మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
విద్యార్థుల మానసిక ఆరోగ్యం, వారి శ్రేయస్సుకు మద్దతు నిచ్చేందుకు హెచ్.ఆర్.డి మంత్రిత్వశాఖ వారి మనోదర్పణ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత అయిన ఆత్మనిర్భర్ భారత్ దిశగా చేపట్టిన కార్యక్రమం మనోదర్పణ్: శ్రీ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్
నేషనల్ టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్, మనోదర్పణ్ ప్రత్యేక వెబ్ పేజీని ప్రారంభించిన కేంద్ర హెచ్.ఆర్.డి మంత్రి
Posted On:
21 JUL 2020 3:15PM by PIB Hyderabad
విద్యార్థుల మానసిక ఆరోగ్యం, వారి శ్రేయస్సుకోసం వారికి మద్దతు నిచ్చేందుకు హెచ్.ఆర్.డి మంత్రిత్వశాఖ చేపట్టిన మనోదర్పణ్ కార్యక్రమాన్ని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభించారు. హెచ్.ఆర్.డి శాఖ సహాయమంత్రి శ్రీ సంజయ్ ధోత్రే కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి శ్రీ అమిత్ ఖరే, పాఠశాలవిద్య, అక్షరాస్యత విభాగం కార్యదర్శి శ్రీమతి అనితా కర్వాల్,మంత్రిత్వశాఖకు చెందిన ఇతర సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి సంబంధించి శ్రీ మతి అనితా కర్వాల్ సవివరమైన ప్రెజెంటేషన్‌ను ఇచ్చారు.
మనోదర్పణ్ చొరవలో భాగంగా శ్రీ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్, నేషనల్ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్(8448440632)ను, హెచ్.ఆర్.డి మంత్రిత్వశాకఖ పోర్టల్‌లో ఒక ప్రత్యేక వెబ్ పేజీ మనోదర్ఫణ్‌ను, మనోదర్పణ్ హ్యాండ్ బుక్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ మాట్లాడుతూ, కోవిడ్ -19 ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఒక సవాలు అని అన్నారు. ఈ అంతర్జాతీయ మహమ్మారి వైద్యపరంగా తీవ్ర ఆందోళన కలిగించేదే కాక, అందరికీ ఒకరకమైన మిశ్రమ భావోద్వేగాలను, మానసిక-సామాజిక ఒత్తిడినీ తీసుకువస్తున్నదని ఆయన అన్నారు. ప్రత్యేకించి పిల్లలు, కౌమార దశలోఉన్నవారిలో ఇలాంటి పరిస్థితులలో , మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అన్నారు. పిల్లలు, కౌమారదశలోని వారు దీని బారిన పడే అవకాశాలు ఎక్కువ అని, వీరు ఇతర మానసిక ప్రవర్తనా సమస్యలతో పాటు, విపరీతమైన ఒత్తిడి ,ఆందోళన, భయాన్నిఅనుభవించే అవకాశం ఉందని చెప్పారు.
విద్యారంగానికి సంబంధించి, విద్యా కార్యకలాపాల కొనసాగింపుపై దృష్టిపెట్టడంతోపాటు , విద్యార్థుల మానసిక శ్రేయస్సుకు కూడా సమానమైన ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుందని ఆయన అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని తమ మంత్రిత్వశాఖ ప్రస్తుత కోవిడ్ సమయంలో, కోవిడ్ అనంతర కాలంలో, విద్యార్థులకు వారి మానసిక ఆరోగ్యం, శ్రేయస్సుకు సంబంధించి మద్దతు నిచ్చేందుకు మనోదర్పణ్ పేరుతో ఒకకార్యక్రమాన్ని ప్రారంభించినట్టు ఆయన తెలిపారు.
విద్య, మానసిక ఆరోగ్యం, మానసిక సామాజిక సమస్యల పరిష్కార రంగంలో నిపుణులైన వారు సభ్యులుగా ఒక వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేయడం జరిగిందని కేంద్ర మంత్రి చెప్పారు. వీరు విద్యార్థుల మానసిక ఆరోగ్య సమస్యలు, వారి ఆందోళనలను గమనించి సమస్యలు పరిష్కరించడంతోపాటు వారి మెరుగైన ఆరోగ్యానికి కృషి చేస్తారన్నారు. కోవిడ్ -19 లాక్‌డౌన్ సమయంలోను , ఆతర్వాత విద్యార్థుల మానసిక ఆరోగ్యం, మానసిక సామాజిక సమస్యల విషయంలో వారి సమస్యలు పరిష్కరించి వారికి అండగా ఉంటారన్నారు. ఇందుకు వీరు కౌన్సిలింగ్ సేవలు, ఆన్ లైన్ సేవలు, హెల్ప్ లైన్ సేవలు అందిస్తారని ఆయన చెప్పారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఆత్మనిర్భర్‌భారత్ అభియాన్‌ను ప్రారంభించారని, మనోదర్పణ్ కార్యక్రమం అందులో చేర్చారని రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ అన్నారు. మానవ వనరులను బలోపేతం చేయడం, ఉత్పాదకతను పెంపొందించడం, సమర్ధవంతమైన సంస్కరణలు, విద్యారంగానికి సంబంధించి న చొరవలలో భాగంగా దీనిని చేర్చారని ఆయన తెలిపారు.
మనోదర్పణ్ పేరుతో వెబ్ పేజీని కూడా ప్రారంభించినట్టు మంత్రి చెప్పారు. కోవిడ్ మహమ్మారి సమయంలో, ఆతర్వాత కూడా మానసిక ఆరోగ్యం, శ్రేయస్సుకు సంబంధించి మానసిక సామాజిక మద్దతుకు మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ఒక వెబ్‌సైట్‌ను రూపొందించిందని అన్నారు. ఈ వెబ్ పేజీ లో సూచనలు, సలహాలు, ఆచరణాత్మక చిట్కాలు,పోస్టర్లు, పాడ్ కాస్ట్‌లు, వీడియోలు, మానసిక సామాజిక మద్దతువిషయంలో చేయదగిన, చేయకూడని అంశాలు, తరచూ అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఆన్‌లైన్ ప్రశ్నల వ్యవస్థ ఇందులో ఉన్నాయన్నారు. జాతీయ స్థాయిలో టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ (8448440632) ను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఈ ప్రత్యేక హెల్ప్ లైన్‌ను నిపుణులైన కౌన్సిలర్లు, సైకాలజిస్టులు, మానసిక ఆరోగ్యనిపుణులు నిర్వహిస్తారు. ఈ హెల్ప్ లైన్ ద్వారా విద్యార్ధులకు మానసిక ఆరోగ్యం, మానసిక సామాజిక సమస్యలపై టెలి కౌన్సిలింగ్ అందించడం జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారి నుద్దేశించి మాట్లాడుతూ ,కేంద్ర హెచ్.ఆర్.డి శాఖ సహాయ మంత్రి శ్రీ సంజయ్ దోత్రే, కోవిడ్ మహమ్మారి పిల్లలు ,పెద్దలపై మానసికంగా, భావోద్వేగపరంగా ప్రభావం చూపే అవకాశం ఉందని అన్నారు. ఇలాంటి పరిస్థితులలో,మనకు వ్యవస్థీకృత, సంస్థాగత సహాయం కావలసి ఉందన్నారు. మానసిక ఆరోగ్యం అనేది ప్రజల శ్రేయస్సు, సమాజం, ప్రజల ఉత్పాదకతతో పరస్పర సంబంధం కలిగి ఉంటుందని చెప్పారు. అందువల్ల, అటువంటి వాతావరణంలో వ్యక్తుల శ్రేయస్సుకు , వారు తమ కార్యకలాపాలు సజావుగా నిర్వహించడానికి ఇది చాలా అవసరమని అన్నారు. మనం మరింత సమైక్యంగా , పరస్పర ఆధారిత సమాజంగా కూడా మరింత ముందుకు రావాలని ఆయన అన్నారు. మనోదర్పణ్ కార్యక్రమం, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించిన ఆత్మనిర్భర్‌భారత్ అభియాన్‌లో భాగమని చెప్పారు. మానవ వనరులను బలోపేతం చేయడం, ఉత్పాదకతను పెంపొందించడం, సమర్ధవంతమైన సంస్కరణలు, విద్యారంగానికి సంబంధించి న చొరవలలో భాగంగా దీనిని చేర్చారని ఆయన అన్నారు.
మనోదర్పన్ చొరవ కింద సమీకరించిన వనరులు , విద్యార్థులకు, వారి కుటుంబాలకు, టీచర్లకు మానసికంగా సుస్థిర మద్దతు ఇవ్వడానికి వీలు కల్పించేవని కూడా దౌత్రే చెప్పారు. కరోనా అనంతర కాలంలో కూడా దీని ఉపయోగం ఉంటుందని, ఇది మానసిక ఆరోగ్యానికి సంబంధించి సానుకూల చర్యలు, మానసిక సమస్యల నిరోధానికి కృషి చేయడానికి వీలు కల్పిస్తుందని చెప్పారు. దీనిని ప్రధాన అభ్యసన ప్రక్రియలతో అనుసంధానం చేయడం జరిగిందని ఆయన అన్నారు.
మనోదర్పణ్ కార్యక్రమంలో కింది అంశాలు ఉన్నాయి.:
--విద్యార్థులు, టీచర్లు, పాఠశాల టీచర్లు, యూనివర్సిటీ సిబ్బంది, విద్యార్థుల కుటుంబాలకు తగిన సూచనలు మార్గదర్శకాలు .
-- ఎం.హెచ్.ఆర్.డి . వెబ్‌సైట్‌లో వెబ్ పేజీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మానసిక మద్దతు కు సంబంధించిన సూచనలు, సలహాలు, చిట్కాలు, పోస్టర్లు, వీడియోలు, చేయదగిన, చేయకూడని అంశాలుప, తరచూ అడిగే ప్రశ్నలకు సమాధానాలు, ఆన్‌లైన్ ప్రశ్నల వ్యవస్థ .
--పాఠశాల, విశ్వవిద్యాలయ స్థాయిలో కౌన్సిలర్లకు సంబంధించిన డైరక్టరీ, జాతీయ స్థాయి డేటా బేస్ ఏర్పాటు. జాతీయ స్థాయి హెల్ప్‌లైన్ లో టెలి కౌన్సిలింగ్ సేవలు స్వచ్ఛందంగా అందుబాటులో అందించే వారి వివరాలు ..
--దేశవ్యాప్తంగా గల పాఠశాలలు, కాలేజీలు, విశ్వవిద్యాలయాల విద్యార్ధులు ఎం.హెచ్.ఆర్.డి ఏర్పాటు చేసిన జాతీయ టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ ద్వారా సేవలు పొందే ఏర్పాటు. ఈ హెల్ప్ లైన్ ను సైకాలజిస్టులు, నిపుణులైన కౌన్సిలర్లు , మానసిక ఆరోగ్యానికి సంబంధించిన వారు నిర్వహిస్తారు. కోవిడ్ -19 పరిస్థితుల అనంతరం కూడా ఇది కొనసాగుతుంది.
--మానసికసామాజికమద్దతు: విద్యార్థుల జీవన నైపుణ్యాలు మెరుగుపరచడం, శ్రేయస్సు అనేదానిపై ఒక హ్యాండ్ బుక్‌ను ఆన్‌లైన్ లో ఉంచుతారు.
ఈ పుస్తకంలో తరచూ అడిగే ప్రశ్నలకు సమాధానాలు, వాస్తవాలు, అపోహలు, భావోద్రేకపరమైన అంశాలను ఎలా ఎదుర్కోవడం, ప్రవర్తనకు సంబంధించిన సమస్యలనుఎదుర్కోవడం వంటి వాటికి సంబంధించి కొవిడ్ సమయంలోనూ ఆ తర్వాతకు పనికి వచ్చే అంశాలు ( పాఠశాల విద్యార్థులస్థాయి నుంచి కాలేజీ యువత వరకు ) ఉంటాయి.
--విద్యార్ధులు, టీచర్లు, కుటుంబ సభ్యులు కోవిడ్ -19 సమయంలో, ఆ తర్వాత కౌన్సిలింగ్, మార్గనిర్దేశం పొందడానికి సంప్రదించేందుకు ఇంటరాక్టివ్ ఆన్ లైన్ చాట్ ప్లాట్ ఫాం ను ఏర్పాట చేశారు. మానసిక ఆరోగ్య నిపుణులు, సైకాలజిస్టులు వీరికి మార్గనిర్దేశం చేయడానికి సిద్ధంగా ఉంటారు.
--ఈ వెబ్ పేజీలో వెబినార్లు, ఆడియో విజువల్ సమాచారం, వీడియోలు, పోస్టర్లు, ఫ్లయర్లు, కామిక్‌లు, లఘు చిత్రాలను అదనపు సమాచారంగా అప్‌లోడ్ చస్తారు. దేశవ్యాప్తంగా విద్యార్థుల నుంచి క్లౌడ్ సోర్సింగ్ ను పీర్ సపోర్టుగా ప్రోత్సహిస్తారు.
మనోదర్పణ్ వెబ్‌సైట్ కోసం క్లిక్ చేయండి : http://manodarpan.mhrd.gov.in/
పిపిటి కోసం క్లిక్ చేయండి:
(Release ID: 1640259)
Visitor Counter : 773
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Malayalam