ఆర్థిక మంత్రిత్వ శాఖ

సీబీడీటీ, ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వ శాఖ మధ్య అవగాహన ఒప్పందం

Posted On: 20 JUL 2020 6:55PM by PIB Hyderabad

' కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు' (సీబీడీటీ) నుంచి 'కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ'కు సమాచార బదిలీకి సంబంధించి రెండు వర్గాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. సీబీడీటీ తరపున ఆదాయపన్ను విభాగం ప్రిన్సిపల్‌ డైరెక్టర్‌ జనరల్ శ్రీమతి అను జె. సింగ్‌‌, ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వ శాఖ అడిషనల్‌ సెక్రటరీ&డెవలప్‌మెంట్‌ కమిషనర్‌  శ్రీ దేవేంద్ర కుమార్‌ సింగ్‌ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.

    ఈ ఒప్పందం ప్రకారం, ఆదాయపన్ను రిటర్నుల సంబంధిత సమాచారాన్ని ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వ శాఖకు ఆదాయపన్ను విభాగం అందిస్తుంది. ఈ ఏడాది జూన్‌ 26న ఇచ్చిన నోటిఫికేషన్‌ నం. ఎస్.ఓ. 2119(ఇ)లో సూచించిన విధంగా, సంస్థలను పరిశీలించి, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలుగా విభజించేందుకు ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వ శాఖకు ఈ సమాచారం వెసులుబాటు కల్పిస్తుంది.

    సంతకం చేసిన రోజు (20.07.2020‌‌) నుంచే ఈ ఒప్పందం అమల్లోకి వచ్చింది. సమాచార మార్పిడి ప్రక్రియను పర్యవేక్షించేందుకు రెండు విభాగాలు నోడల్‌ అధికారి, ప్రత్యామ్నాయ నోడల్‌ అధికారులను నియమిస్తాయి. 

సీబీడీటీ, ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వ శాఖ మధ్య సహకారం, కలిసి పనిచేయడంలో కొత్త శక ప్రారంభానికి ఈ అవగాహన ఒప్పందం నాంది పలికింది.

***
 



(Release ID: 1640039) Visitor Counter : 189