సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
మైక్రో ఫైనాన్సింగ్ విధానం గ్రామీణ, వ్యవసాయ, గిరిజన రంగాల్లోని సూక్ష్మ వ్యాపారాలకు ఈ సమయంలో చాలా అవసరం : శ్రీ నితిన్ గడ్కరీ.
Posted On:
20 JUL 2020 5:01PM by PIB Hyderabad
సూక్ష్మ / చిన్న వ్యాపారాలు / మత్స్యకారులు, పడవలు నడిపేవారు, రిక్షా కార్మికులు, కూరగాయల విక్రయించేవారు, పేదలు, స్వయం సహాయ బృందాల వంటి వారికి ఆర్ధికంగా సహాయపడే ఒక విధానం లేదా మోడల్ ను రూపొందించవలసిన అవసరం ఎంతైనా ఉందని, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మరియు రోడ్డు, రవాణా శాఖల కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ, నొక్కి చెప్పారు. ‘ఎం.ఎస్.ఎం.ఈ. లు మరియు జీవనోపాధిని తిరిగి రూపొందించడంపై పాన్ ఐ.ఐ.టి. గ్లోబల్ ఇ-కాన్‌క్లేవ్’ ను ఉద్దేశించి ఆయన నిన్న రాత్రి వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగించారు.
దేశంలో ఎక్కువ శాతం మంది ప్రజలు చేపల వేట, తేనేటీగల పెంపకం, వెదురు ఉత్పత్తి వంటి చాలా చిన్న చిన్న కార్యకలాపాల్లో పాల్గొంటున్నారనీ, వారు ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి ఉన్నారనీ, వారికి తగిన ఆర్థిక సహాయం లేదనీ, ఆయన వివరించారు. వారు కష్టపడి పనిచేస్తారనీ, నైపుణ్యం కలిగినవారనీ, వారు ప్రతిభావంతులు, నిజాయితీపరులనీ, అయితే వారికి తగిన ఆర్ధిక స్తొమత లేకపోవడం వలన వారు తమ వ్యాపారాలు, కార్యకలాపాల ద్వారా ఎక్కువగా ధనాన్ని ఆర్జించలేక పోతున్నారనీ ఆయన పేర్కొన్నారు. వారికి కాస్త ఆర్థిక, సాంకేతిక, మార్కెటింగ్ సహకారం అందిస్తే, వారు తమ వ్యాపారాన్నీ, కార్యకలాపాలనూ పెంపొందించుకుంటారు. తద్వారా, గ్రామీణ, వ్యవసాయ, గిరిజన ప్రాంతాలలో ఉపాధి అవకాశాలను ఖచ్చితంగా పెరగడంతో పాటు, మన దేశ జి.డి.పి. కూడా వృద్ధి చెందుతుంది.
సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడిన ఈ పారిశ్రామికవేత్తలకు చేయూతనిచ్చి, ఆర్థిక సహాయం అందించే విధంగా, ఒక విధానాన్ని లేదా నమూనాను అభివృద్ధి చేయడానికి శ్రీ గడ్కరీ సలహాలను ఆహ్వానించారు. ఈ మోడల్ లేదా విధానం పారదర్శకంగా, అవినీతి రహితంగా, తక్కువ విధానపరమైన షరతులతో కూడిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగించుకునే విధంగా, కనీసం అనుమతులతో రూపొందించాలని ఆయన సూచించారు. నీతీ ఆయోగ్, ఆర్థిక మంత్రిత్వ శాఖల ఆమోదం పొందిన అనంతరం, ఈ మోడల్ లేదా విధానం వెదురు ఉత్పత్తి, తేనె ఉత్పత్తి, ప్రత్యామ్నాయ ఇంధన వనరులు వంటి ఇతర రంగాలలో నిమగ్నమైన అనేక సంస్థలకు మద్దతు ఇస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, బాంగ్లాదేశ్ లో గ్రామీణ బ్యాంకు వ్యవస్థాపకులు ప్రొఫెసర్ ముహమ్మద్ యూనస్ కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని, తమ ఉద్దేశ్యాలను వ్యక్తపరిచారు.
*****
(Release ID: 1639991)
Visitor Counter : 242