శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

కార్యాలయాల్లో కోవిడ్ రక్షణ వ్యవస్థ (కాప్స్)ను ప్రారంభించిన దుర్గాపూర్ సిఎస్ఐఆర్-సిఎంఈఆర్ఐ

Posted On: 19 JUL 2020 12:04PM by PIB Hyderabad
ప్రస్తుత మహమ్మారి నేపథ్యంలో పరిస్థితులలో మార్పులు తీసుకురావడానికి ఆవిష్కరణలు జరుగుతూనే ఉన్నాయి. వాటిలో కొన్ని, వ్యవస్థనే మలుపు తిప్పే కారకాలుగా ఉంటాయి. అందులో ఒకటి దుర్గాపూర్  సిఎస్ఐఆర్-సిఎంఈఆర్ఐ రూపొందించిన 'కోవిడ్ నుండి రక్షణ పొందే' కాప్స్ అనే వివిధ సాంకేతికతల మిళితమైన వ్యవస్థ. దీనిని ఆ సంస్థ డైరెక్టర్ ప్రొఫెసర్ (డాక్టర్) హరీష్ హిరానీ ఆవిష్కరిస్తూ, ఆరోగ్య కార్యకర్తల మొదలుకొని  వివిధ సంస్థలలో ముందుండే భద్రత సిబ్బంది వరకు విభిన్న మార్గాలలో వ్యాధి సోకే హానికర వాతావరణంలో పనిచేస్తున్నారు. సమీప భవిష్యత్తులో దుర్గాపూర్ లోని సిఎస్ఐఆర్-సిఎంఈఆర్ఐ డిజిటల్ ఎంట్రీ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ను అభివృద్ధి చేస్తుంది, తద్వారా పని సరళి ఆటోమేట్ అవుతుంది, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పై ఆధారపడి ఉంటుంది. కార్యాలయంలోని కాప్స్ లో కాంటాక్ట్‌లెస్ సోలార్ ఆధారిత ఇంటెలిజెంట్ మాస్క్ ఆటోమేటెడ్ డిస్పెన్సింగ్ యూనిట్ కమ్ థర్మల్ స్కానర్ (ఇంటెల్లిమాస్ట్), టచ్‌లెస్ ఫౌసెట్ (టౌఫ్), 360 ° కార్ ఫ్లషర్ ఇప్పుడు టెక్నాలజీ బదిలీలు, ఉత్పత్తి ఆర్డర్‌ల కోసం అందుబాటులో ఉన్నాయి అని వెల్లడించారు. 
“దుర్గాపూర్‌లోని సిఎస్‌ఐఆర్-సిఎమ్‌ఇఆర్ఐ, స్టార్ట్-అప్స్, ఎంటర్‌ప్రెన్యూర్‌లకు తమ ఆకాంక్షలకు ప్రోత్సాహాన్నిచ్చేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తూ, వారి వినూత్న సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి ఒక వేదికను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను అభివృద్ధి చేయడంపై కూడా దృష్టి పెట్టింది, దీని ఫలితంగా భారత ప్రభుత్వం యొక్క ఆత్మ-నిర్భర్ భారత్ ప్రధాన చొరవను పెంచుతుంది ” అని డాక్టర్ హిరానీ తెలిపారు.
కాప్స్ అనేది ఈ క్రింది సాంకేతిక పరిజ్ఞానాల సమ్మేళనం:
 
  1. సౌర ఆధారిత ఇంటెలిజెంట్ మాస్క్ ఆటోమేటెడ్ డిస్పెన్సింగ్ యూనిట్ కమ్ థర్మల్ స్కానర్ (ఇంటెల్లిమాస్ట్) -
    సోలార్ ఆధారిత ఇంటెల్లిమాస్ట్ అనేది ఇంటెలిజెంట్ నిఘా కియోస్క్, ఇది శరీర ఉష్ణోగ్రతను గుర్తిస్తుంది, ఒక వ్యక్తి ఫేస్ మాస్క్ ధరిస్తున్నారా లేదా సాఫ్ట్‌వేర్ పరిష్కారాల ద్వారా గుర్తిస్తుంది. ఫేస్ మాస్క్ ధరించని ఉద్యోగి గురించి సమాచారం మాస్క్ క్యాష్‌లెస్ డెలివరీ కోసం అడ్మినిస్ట్రేషన్‌కు అందించబడుతుంది, తరువాత జీతం నుండి ధరను కోత పెడతారు. ఈ విషయంలో సిస్టమ్ ఇంటర్నెట్-ఆఫ్-థింగ్స్‌ను పూర్తిగా వినియోగించుకుంటుంది. అంతర్గతంగా ఉండే థర్మల్ స్కానర్ శరీరంలో ఉష్ణోగ్రత హెచ్చు తగ్గులను  తెలుసుకుని సెక్యూరిటీ గార్డ్ ని దృశ్య శ్రవణం ద్వారా హెచ్చరిస్తుంది. ఇంటెల్లిమాస్ట్ పర్యవేక్షించే సిబ్బంది భద్రతను నిర్ధారించడానికి, ఏదైనా పెద్ద సంస్థలో ముందు జాగ్రత్త చర్యల అమలుకు సహాయపడుతుంది. ఇంటెల్లిమాస్ట్ గుర్తింపు కార్డు ఆధారిత మాస్క్ డిస్పెన్సింగ్, అటెండెన్స్ సిస్టమ్‌ను కూడా సులభతరం చేస్తుంది. ఫేషియల్ రికగ్నిషన్ బేస్డ్, ఐడి కార్డ్ బేస్డ్ అటెండెన్స్ సిస్టమ్ సమీప భవిష్యత్తులో వ్యవస్థలో పొందుబరుస్తారు. అందువల్ల ఆఫీస్,  ఇండస్ట్రియల్ కాంప్లెక్స్‌లతో పాటు స్కూల్, కాలేజ్ క్యాంపస్‌లకు సమగ్ర పరిష్కారంగా పనిచేస్తుంది. ఈ వ్యవస్థ  రియల్ టైం ఫలితాలను ఇవ్వడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. రియల్ టైం డేటా ప్రతిస్పందన, సమాచార వ్యాప్తి కోసం ఏదైనా సంస్థ యొక్క మానవ వనరుల డేటాతో అనుసంధానం అవుతుంది. బ్లాక్‌అవుట్‌ల సమయంలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా కోసం ఇంటెల్లిమాస్ట్ వ్యవస్థను సౌర శక్తి బ్యాకప్ చేస్తుంది. ఇంటెల్లిమాస్ట్ విద్యుత్ సరఫరా అవసరం 40-50 వాట్స్ సౌర విద్యుత్, విద్యుత్ హైబ్రిడ్ కలయిక ద్వారా లభిస్తుంది. 
     
  1. టచ్‌లెస్ ఫాసెట్ (పీపాలో నుంచి నీళ్లు బయిటికి రావడానికి వేసివుండే చిన్న గొట్టము) (టఫ్) - గృహాలు మరియు కార్యాలయ స్థలాల కోసం టచ్‌లెస్ టఫ్ ఆవిష్కరణ అవుతుంది. తాజా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఈ వ్యవస్థ అదే పీపాలో నుంచి 30 సెకన్ల వ్యవధితో ద్రవ సబ్బు నీటిని పంపిణీ చేస్తుంది. . పీపాలో నుంచి నీళ్లు బయిటికి రావడమునకు వేసివుండే చిన్న గొట్టము ఏదైనా వాష్-బేసిన్ పైన చాలా తేలికగా అమర్చవచ్చు, సులభంగా ఏర్పాటు చేయడం కోసం ప్లగ్ మరియు ప్లే మోడ్‌లో లభిస్తుంది. ఈ వ్యవస్థ స్థానిక ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం టచ్-ఫ్రీ మెకానిజంలో సబ్బును పంపిణీ చేసిన 30 సెకన్ల తరువాత నీటిని పంపిణీ చేస్తుంది, గృహ వాష్ బేసిన్ల పైన చాలా సులభంగా అమర్చవచ్చు. ఈ దేశీయ వస్తువు కలుషితాన్ని నివారించడంతో పాటు కుటుంబ సభ్యులలో, ముఖ్యంగా లక్షణాలు కనబడని వ్యక్తుల నుండి కూడా సంక్రమణ వ్యాప్తికి అడ్డుకట్ట వేస్తుంది. ఈ సాంకేతిక పరిజ్ఞానానికి కేవలం 10 వాట్ల విద్యుత్ సరఫరా అవసరం. 
  1. 360 ° కార్ ఫ్లషర్: సిఎస్ఐఆర్-సిఎంఈఆర్ఐ అభివృద్ధి చేసిన 360 ° కార్ ఫ్లషర్ అనేది సోడియం హైపోక్లోరైట్ వాటర్ స్క్రీన్. ఇది ప్రత్యేకమైన నాజిల్ డిజైన్‌ను ఉపయోగిస్తుంది, ఇది శానిటైజర్ డిఫ్యూజ్డ్ వాటర్..  కార్ బాడీ / వీల్స్ కింద, తగినంత పీడనంతో వెదజల్లుతుంది. 360 ° కార్ ఫ్లషర్ ఆర్కిటెక్చర్ వాటర్ ఛానల్ ఫ్రేమ్‌పై తగిన సంఖ్యలో ప్రత్యేకమైన నాజిల్‌లతో ఆధారపడి ఉంటుంది, వీటిని ఏదైనా నిర్దిష్ట సంస్థ నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా అనుకూలీకరించవచ్చు. వాటర్ ఛానల్ ఫ్రేమ్, ఫ్లషర్ నాజిల్ డిజైన్ నీటి సామర్థ్యాన్ని నిర్ధారించడానికి  నీటి వ్యర్థాలను తగ్గించడానికి వీలుగా రూపొందించారు. దీని పంపును నడపడానికి 750 వాట్ల విద్యుత్ అవసరం.

 

 

*****



(Release ID: 1639806) Visitor Counter : 253