హోం మంత్రిత్వ శాఖ

జాతీయ విపత్తుల ప్రతిస్పందన నిధికి, వ్యక్తులు లేదా సంస్థలు సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి

Posted On: 18 JUL 2020 4:52PM by PIB Hyderabad

వ్యక్తులు లేదా సంస్థల నుంచి ఆర్థిక సాయం పొందేందుకు జాతీయ విపత్తుల ప్రతిస్పందన నిధి (ఎన్డీఆర్‌ఎఫ్‌)కి కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. విపత్తుల నిర్వహణ కోసం సాయం పొందొచ్చంటూ, విపత్తుల నిర్వహణ చట్టం-2005లోని సెక్షన్ 46(1)(బి) ప్రకారం అనుమతినిచ్చింది. ఈ క్రింది ఏదైనా పద్ధతి ద్వారా ఈ సాయం ఉండాలి:

ఎ. భౌతిక పత్రాల ద్వారా: “పీఏవో (సెక్రటేరియట్‌), ఎంహెచ్‌ఏ”, న్యూదిల్లీ పేరిట ఉండాలి. "ఎన్డీఆర్ఎఫ్‌కు సాయం" అని ఆ పత్రం వెనుక రాయవచ్చు.

బి. ఆర్టీజీఎస్‌/నెఫ్ట్‌/యూపీఐ ద్వారా:  "ఎన్డీఆర్ఎఫ్‌కు సాయం" అని సూచిస్తూ, ఆర్టీజీఎస్‌ లేదా నెఫ్ట్‌ ద్వారా పంపవచ్చు. ఖాతా సంఖ్య.10314382194, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ SBIN0000625, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, సెంట్రల్‌ సెక్రటేరియట్‌ బ్రాంచ్‌, న్యూదిల్లీ ఖాతాలో జమ చేయాలి.

సి. భారత్‌కోష్‌ పోర్టల్‌ https://bharatkosh.gov.in ద్వారా, నెట్‌ బ్యాంకింగ్‌ లేదా డెబిట్ లేదా క్రెడిట్‌ కార్డు లేదా యూపీఐ ద్వారా సాయం అందించవచ్చు. అందుకు కింది పద్ధతులు అనుసరించాలి.

i. https://bharatkosh.gov.in హోంపేజీలోని 'క్విక్‌ పేమెంట్‌' ఆప్షన్‌ మీద క్లిక్‌ చేయాలి. 

ii. తర్వాతి పేజీలో, మంత్రిత్వ శాఖగా హోంమంత్రిత్వ శాఖను ఎంచుకోవాలి. పర్పస్‌ ఆప్షన్‌లో 'ఎన్డీఆర్‌ఎఫ్‌కు సాయం' అని పేర్కొనాలి. దీని తర్వాత చెల్లింపు ప్రక్రియను వెబ్‌సైట్‌ ప్రారంభిస్తుంది.



(Release ID: 1639691) Visitor Counter : 238