ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

మాతృత్వ మరణాల నిష్పత్తి తగ్గుదలలో విజయం దిశగా భారత్ సుస్థిర అభివృద్ధి, జాతీయ ఆరోగ్య విధాన లక్ష్యాల సాధనే ధ్యేయం: డాక్టర్ హర్షవర్ధన్

సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధించిన
రాష్ట్రాల సంఖ్య 3నుంచి 5కు హెచ్చింపు

Posted On: 17 JUL 2020 6:01PM by PIB Hyderabad

మాతృత్వ మరణాల నిష్పత్తిని (ఎం.ఎం.ఆర్.ను) తగ్గుదల విషయంలో భారత్ విజయం సాధించిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ చెప్పారు. దేశంలో నిష్పత్తి ఏడాదిలో 9 పాయింట్లు తగ్గినట్టు భారత రిజిస్ట్రార్ జనరల్ విడుదల చేసిన ప్రత్యేక బులిటెన్ ద్వారా తెలుస్తోందని ఆయన అన్నారు.  2015-17లో 122గా నమోదైన నిష్పత్తి 2016-18లో 7.4శాతం తగ్గిపోయి, 113గా నమోదైందన్నారు. 2011నుంచి ఎం.ఎం.ఆర్. తగ్గుదల ప్రోత్సాహకరంగా ఉందని చెప్పారు. 2011-13మధ్య 167గా ఉన్న ఎం.ఎం.ఆర్., 2014-16మధ్య 130కి తగ్గిందని, అదే..2015-17 మధ్య 122గా, 2016-18 మధ్య 113గా నమోదైందని మంత్రి చెప్పారు.

   సుస్షిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు భారత్ కట్టుబడి ఉందని డాక్టర్ హర్షవర్ధన్ స్పష్టం చేశారు. మాతృత్వ మరణాల నిష్పత్తి క్రమంగా తగ్గుతూ ఉండటంతో 2030 నాటికి లక్ష సజీవ జననాలకు గాను మాతృత్వ మరణాలను 70కి తగ్గించాలన్న సుస్థిర అభివృద్ధి లక్ష్యాన్ని భారత్ సాధించే సూచనలు కనిపిస్తున్నాయని మంత్రి చెప్పారు. అలాగే, జాతీయ ఆరోగ్య విధానంలో నిర్దేశించుకున్న ప్రకారం వంద సజీవ జననాల లక్ష్యం కూడా సాధించే సూచనలున్నాయన్నారు. దేశంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధించిన రాష్ట్రాల సంఖ్య  3నుంచి 5కు పెరిగిందని. కేరళ (43 పాయింట్లు), మహారాష్ట్ర (46), తమిళనాడు (60), తెలంగాణ (63), ఆంధ్రప్రదేశ్ (65) జాబితాలో ఉన్నాయని అన్నారు. జాతీయ ఆరోగ్య విధానం నిర్దేశించినట్టుగా మాతృత్వ మరణాల నిష్పత్తి తగ్గుదలను సాధించిన రాష్ట్రాలు 11 ఉన్నాయి. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధించిన ఐదు రాష్ట్రాలు కూడా జాబితాలో ఉన్నాయి. ఇంకా జాబితాలో జార్ఖండ్ (71), గుజరాత్ (75), హర్యానా (91), కర్ణాటక (92), పశ్చిమ బెంగాల్ (98) ఉత్తరాఖండ్ (99) ఉన్నాయని కేంద్రమంత్రి హర్షవర్ధన్ చెప్పారు.

  పంజాబ్ (129), బీహార్ (149), ఒడిశా (150) రాష్ట్రాల్లో మాతృత్వ మరణాల నిష్పత్తి వందనుంచి 150 మధ్య నమోదైందని, చత్తీస్ గఢ్ (159), రాజస్థాన్ (164), మధ్యప్రదేశ్ (173), ఉత్తరప్రదేశ్ (197), అస్సాం (215) వంటి ఐదు రాష్ట్రాల్లో మాతృత్వ మరణాల నిష్పత్తి 150కి పైగా నమోదైందని హర్షవర్ధన్ చెప్పారు

  కాగా, గరిష్టస్థాయిలో 22 పాయింట్ల తగ్గుదల చూపిన రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ (19), ఒడిశా (18), బీహార్ (16), మధ్యప్రదేశ్ (15) రాష్ట్రాలకు మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ అభినందనలు తెలియజేశారు. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలు మాత్రం మాతృత్వ మరణాల నిష్పత్తిలో 15శాతం కంటే ఎక్కువ తగ్గుదలను నమోదు చేశాయన్నారు. ఒడిశా, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ వంటి నాలుగు రాష్ట్రాలు 10నుంచి 15వరకూ తగ్గుదలను నమోదు చేశాయన్నారు. ఇక, కర్ణాటక, అస్సాం, జార్ఖండ్, హర్యానా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి 7 రాష్ట్రాలు 5నుంచి పది శాతంవరకూ మాతృత్వ మరణాల నిష్పత్తిలో తగ్గుదలను సాధించాయని తెలిపారు.

  ఫలితాలను సాధించడంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిపాలనాా యంత్రాగాలు చేసిన కృషి ఎంతో గొప్పదని  డాక్టర్ హర్షవర్ధన్ చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న పటిష్ట చర్యలతోపాటు, జాతీయ ఆరోగ్య కార్యక్రమం కింద చేపట్టిన జనని శిశు సురక్షా కార్యక్రమ్, జనని సురక్షా యోజన, లక్ష్యప్రధామంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ వంటి పథకాలు అమలు చేయడం వల్ల విజయం సాధ్యమైందని మంత్రి చెప్పారు. గర్భిణీలకు, నవజాత శిశువులకు ఆరోగ్య రక్షణకోసం చేపట్టన సురక్షిత్ మాతృత్వ ఆశ్వాసన్ (సుమన్) కార్యక్రమంతో కూడా లక్ష్యాల సాధన సాధ్యమైందన్నారు.

***


(Release ID: 1639513) Visitor Counter : 264