ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
ఆత్మనిర్భర్ యాప్ ఆవిష్కరణ సవాలు ఎంట్రీల దాఖలు గడువు తేదీని పొడిగించిన ప్రభుత్వం
Posted On:
17 JUL 2020 5:48PM by PIB Hyderabad
ఆత్మనిర్భర భారత్ యాప్ ఆవిష్కరణ సవాలు కు వస్తున్న అద్భుత స్పందనను గమనించి భారత ప్రభుత్వం ఈ సవాలు ఎంట్రీల దాఖలుకు చివరి తేదీని 2020 జూలై 26 కు పొడిగించేందుకు నిర్ణయించింది. ఈ సవాలును మైగవ్ ఇన్నొవేట్ పోర్టల్ పై ఉంచారు. ఇందులో పాల్గొనదలచిన వారు https://innovate.mygov.in/app-challenge/ కు లాగ్ ఇన్ కావాల్సి ఉంటుంది.
ఆత్మనిర్భర భారత్ యాప్ ఆవిష్కరణ సవాలును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2020 జూలై 4 వ తేదీన ప్రారంభించారు. దీనికి దేశవ్యాప్తంగా టెక్ ఎంటర్‌ప్రెన్యూయర్లు, స్టార్టప్‌లనుంచి ఉత్సాహపూరిత స్పందన లభించింది. ఇప్పటివరకూ గుర్తించిన 8 కేటగిరీలలలో 2353 ఎంట్రీలు వచ్చాయి. ఇందులో 1496 వ్యక్తులనుంచి రాగా, 857 సంస్థలు, కంపెనీల నుంచి వచ్చాయి. వ్యక్తుల నుంచి వచ్చిన వాటిలో 788 దరఖాస్తులు ఉపయోగించడానికి సిద్దంగా ఉన్నవి కాగా మిగిలిన 708 అభివృద్ది దశలో ఉన్నవి.
యాప్‌ల కోసం ఎంట్రీలు సమర్పించిన సంస్థల విషయం చూసినట్టయితే, 636 యాప్‌లు ఇప్పటికే వాడుకకు సిద్ధంకాగా, మిగిలిన 221అభివృద్ధి దశలో ఉన్నాయి.కేటగిగిరీ వారీగా దాఖలైన యాప్‌లను గమనిస్తే, 380 యాప్‌లు బిజినెస్, 286 హెల్త్,వెల్‌నెస్, 339 ఈ లెర్నింగ్, 414 సోషల్ నెట్ వర్కింగ్, 136 గేమ్స్,238 ఆఫీస్, వర్క్‌ఫ్రం హోం, 75 న్యూస్ ,96 ఎంటర్‌టైన్‌మెంట్ రంగాలకు సంబంధించినవి ఉన్నాయి.ఇతర కేటగిరీలనుంచి 389 యాప్‌ల ను సమర్పించారు. ఇందులోని 100 యాప్‌లు లక్షడౌన్ లోడ్‌లు కలవి ఉన్నాయి. దరఖాస్తుదారులలో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన వారు , మారుమూల ప్రాంతాలు, చిన్న పట్టణాలకు చెందిన వారు కూడా ఉన్నారు. దీనిని బట్టి మన దేశంలో ఉన్న ప్రతిభ, ఈ యాప్ ఆవిష్కరణల సవాలు అనేవి, భారతీయ టెక్‌డవలపర్లకు, ఎంటర్‌ప్రెన్యుయర్లకు, కంపెనీలకు ప్రపంచంలో మరెక్కడా లేని రీతిలో ఉన్నత ప్రమాణాలతో దేశం కోసం యాప్‌లు నిర్మించడానికి దక్కిన సరైన అవకాశం గా చెప్పుకోవచ్చు. కొలమానానికి వీలుగా, ఉపయోగించడానికి సులభమైన ఇంటర్‌ఫేస్‌తో సురక్షితమైన యాప్‌లను గుర్తించడం , వినియోగదారులు యాప్‌లకు తిరిగి వచ్చేలా చేసే అనుభవాన్ని ఇవ్వడం నిజమైన సవాలు. ఆత్మనిర్భర భారత్ యాప్ వాతావరణానికి, భారతీయ టెక్ స్టార్టప్‌లకు విలువను పెంచే శక్తి ఉంది. అలాగే మల్టీ ట్రిలియన్ డాలర్ యాప్ ఎకానమీలో వారు కొంత వాటా పొందడానికి ఇది అవకాశం ఇస్తుంది. కేవలం మూడు టాప్ కంపెనీలు గరిష్ఠ యాప్ డౌన్‌లోడ్‌లు కలిగి ఉన్నాయి. ఈ ఏడాది మొత్తం మార్కెట్ క్యాప్ సుమార్ 2 మిలియన్ అమెరికన్ డాలర్లు ఉంది. మనం వేగంగా పురొగమిస్తున్నాం. వినూత్న పరిష్కారాలను సాధించడంలొ మన స్టార్టప్‌ల సామర్థ్యం కూడా నిరూపితమైంది. గత నెలలో ప్రారంభించిన వీడియో కాన్ఫరెన్సింగ్, ఇన్నోవేషన్ ఛాలెంజ్‌కి వచ్చిన ఉత్సాహపూరితమైన స్పందనతో ఇది నిరూపితమైంది. దీనికి 2000 కి పైగా దరఖాస్తులు వచ్చాయి, వాటిలో 12 ప్రోటోటైప్‌లను రూపొందించడానికి ఎంపికయ్యాయి.
దాఖలైన సొల్యూషన్ల నాణ్యతను చూసి, న్యాయనిర్ణేతలు ఎంపికజాబితాను ఆ దశలో 3 నుంచి 5కు పెంచడం జరిగింది. ఇందులో అన్నీ పూర్తి స్థాయి సొల్యూషన్లను సాధించే నైపుణ్యాలు కలిగినవిగా తేలాయి. టాప్ 3 కంపెనీల జాబితాలో జైపూర్ నుంచి సర్వ్‌వెబ్స్, హైదరాబాద్ నుంచి పీపుల్ లింక్, అలప్పుజ నుంచి టెక్‌జెన్‌ట్సియా ఉన్నాయి. వీటికి ఒక్కొక్క దానికి పూర్తి స్థాయి సొల్యూషన్లు సాధించడానికి 20 లక్షల రూపాయలు గ్రాంటు బహుకరించడం జరిగింది. న్యాయనిర్ణేతలు 4వ , 5వ ర్యాంకు ఇచ్చిన వాటిలో హైదరాబాద్ నుంచి సోల్ పేజ్, చెన్నైనుంచి హైడ్రామీట్ కంపెనీలు ఉన్నాయి. ఈ సంస్థలు ఒక్కొక్క దానికి 15 లక్షల రూపాయలు గ్రాంటు ఇచ్చారు. వీరు కూడా పూర్తిస్థాయి సొల్యూషన్లు కనుగొననున్నారు. దీనికితోడుగా 4 కంపెనీలు, అవి ఘజియాబాద్ నుంచి అరియా టెలికం , జైపూర్ నుంచి వీడియోమీట్, ఢిల్లీనుంచి వాక్ సేతు, చెన్నైనుంచి జోహో సంస్థలు కూడా చెప్పుకోదగిన సామర్ధ్యం కలిగినవిగా జ్యూరీ పరిగణించింది. మన టెక్ కంపెనీలకు మంచి ప్రోత్సాహం ఇస్తే, అవి ప్రపంచశ్రేణి సొల్యూషన్స్ సాధించగలవని ఈ సవాలు రుజువు చేసింది.
***
(Release ID: 1639465)
Visitor Counter : 242