సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
చర్మకారుల కోసం ఢిల్లీలో అత్యధునాతన పాదరక్షల తయారీ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన కెవిఐసి
Posted On:
16 JUL 2020 5:38PM by PIB Hyderabad
చర్మకారులకు శిక్షణ ఇచ్చేందుకు దేశంలోనే తొలిసారిగా అత్యధునాతన పాదరక్షల శిక్షణ కేంద్రాన్ని ఖాదీ , గ్రామీణ పరిశ్రమల కమిషన్ ఈరోజు ఢిల్లీలో ప్రారంభించింది. ఆగ్రాలో ఎం.ఎస్.ఎం.ఇ మంత్రిత్వశాఖకు చెందిన, కేంద్ర పాదరక్షల శిక్షణ సంస్థ(సిఎఫ్‌టిఐ) సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కెవిఐసి-సిఎఫ్ టిఐ పాదరక్షల శిక్షణ ,ఉత్పత్తి కేంద్రం రాజఘాట్ ,గాంధీ దర్శన్ వద్ద ఏర్పాటైంది. చర్మకారులకు అత్యంత నాణ్యత గల పాదరక్షలు తయారు చేయడంలో ఇది రెండు నెలల సమగ్ర శిక్షణ నిస్తుంది.
ఈ కేంద్రాన్ని ప్రారంభిస్తూ కెవిఐసి ఛైర్మన్ శ్రీ వి.కె.సక్సేనా, చర్మకారులను , చర్మ చికిత్సక్ గా అభివర్ణించారు. ఈ శిక్షణ కేంద్రంలో రెండు నెలల శిక్షణ పూర్తిచేసుకున్న చర్మకారులు స్వతంతగా పాదరక్షల తయారీ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు అవసరమైన లాజిస్టిక్ మద్దతును ఈ కేంద్రం అందిస్తుంది. భవిష్యత్తులొ తమ కార్యకలాపాలు కొనసాగించడానికి వీరికి రూ5000 ల విలువగల ఉపకరణాల కిట్‌ను కూడా అందజేయనున్నారు.
కెవిఐసి-సిఎఫ్ టిఐ పాదరక్షల శిక్షణ, ఉత్పత్తి కేంద్రాన్ని అధునాతన ఉపకరణాలు, యంత్రాలతో రెండు నెలల రికార్డు సమయంలొ ఏర్పాటు చేశారు. లాక్‌డౌన్ కారణంగా దీని ప్రారంభొత్సవం ఆలస్యమైంది. తొలుత 40 మందిగల బ్యాచ్ చర్మకారులకు శిక్షణ ఇచ్చేందుకు శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించినప్పటికీ, కరొనా మహమ్మారి కారణంగా సామాజిక దూరం నిబంధనలను దృష్టిలో ఉంచుకుని ఈ బ్యాచ్‌ను 20 మందికే పరిమితం చేశారు. కెవిఐసి ఇలాంటి పాదరక్షల శిక్షణ కేంద్రాన్ని వారణాశిలో కూడా ఏర్పాటు చేస్తున్నది.
చర్మకారులకు లేదా చర్మచికిత్సక్‌లకు శిక్షణ అందించడం ప్రధానమంత్రి దార్శనికత అయిన “సబ్ కా సాథ్, సబ్ కా వికాస్” కు అనుగుణమైనదని కెవిఐసి ఛైర్మన్ తెలిపారు.
పాదరక్షల తయారీ అనేది ప్రస్తుతం ఫ్యాషన్‌లొ ఒక భాగమైనదని, పాదరక్షల తయారీ ఇప్పుడు ఎంతమాత్రం మామూలు పని కాదని ఆయన అన్నారు.“ ఈ శిక్షణ కేంద్రం ద్వారా మేము వీలైనంత ఎక్కువమందిని పాదరక్షల తయారీ కార్యకలాపాలలోకి తీసుకురానున్నాము. ఈ కార్యక్రమాన్ని కేవలం రెండునెలల వ్యవధిలోనే రూపుదిద్దడం జరిగింది. చర్మకారులు అన్ని రకాల పాదరక్షలను కేవలం రెండు నెలలలోనే తయారు చేయగలుగుతారు.ఇది వారి రాబడిని ఎన్నోరెట్లు పెంచుతుంది” అని కెవిఐసి ఛైర్మన్ తెలిపారు.
*****
(Release ID: 1639269)
Visitor Counter : 249