పర్యటక మంత్రిత్వ శాఖ

కేంద్ర పర్యాటక శాఖ పథకం "ప్రసాద్‌" కింద, 'గుజరాత్‌లోని సోమనాథ్‌లో యాత్ర సౌకర్యాలు పెంపు' ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో, వర్చువల్‌ పద్ధతిలో పాల్గొన్న మంత్రి శ్రీ ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌

ప్రసాద్‌ పథకం నిధులతో, రూ.45.36 కోట్ల వ్యయంతో ప్రాజెక్టు విజయవంతంగా పూర్తి

Posted On: 16 JUL 2020 7:40PM by PIB Hyderabad

 

    కేంద్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ (స్వతంత్ర బాధ్యత), గుజరాత్‌ ముఖ్యమంత్రి శ్రీ విజయ్‌భాయ్‌ రూపానీతో కలిసి వర్చువల్‌ పద్ధతిలో, 'గుజరాత్‌లోని సోమనాథ్‌లో యాత్ర సౌకర్యాలు పెంపు' ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టును కేంద్ర పర్యాటక శాఖ పథకం 'ప్రసాద్‌' కింద 2017 మార్చిలో మంజూరు చేశారు. రూ.45.36 కోట్ల వ్యయంతో విజయవంతంగా ప్రాజెక్టు పూర్తయింది. పార్కింగ్‌, యాత్ర సౌకర్యాల కేంద్రం, ఘన వ్యర్థాల నిర్వహణను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో, అత్యధిక నాణ్యతతో ఏర్పాటు చేశారు.

 

 

2020-07-16 18:39:32.073000


 
    సౌకర్యాల కల్పనలో ప్రపంచస్థాయి ప్రమాణాలు నెలకొల్పేందుకు కేంద్రం విడుదల చేసిన నిధులను ఉత్తమంగా ఉపయోగించుకున్నందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని శ్రీ ప్రటేల్‌ అభినందించారు. పర్యాటక రంగం కోసం, తమ మంత్రిత్వ శాఖ నుంచి సాధ్యమైనంత సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.

 

2020-07-16 18:40:06.011000

    'నేషనల్‌ మిషన్‌ ఆన్‌ పిలిగ్రిమేజ్‌ రీజువెనేషన్‌ అండ్‌ స్పిరిచువల్‌, హెరిటేజ్‌ ఆగ్మెంటేషన్‌ డ్రైవ్‌' (పీఆర్‌ఏఎస్‌హెచ్‌ఏడీ-ప్రసాద్‌) ను కేంద్ర పర్యాటక శాఖ 2014-15లో ప్రారంభించింది. గుర్తించిన యాత్ర, వారసత్వ ప్రాంతాల్లో సమీకృత అభివృద్ధి ఈ పథకం లక్ష్యం. ప్రవేశ మార్గాలు (రోడ్డు, రైలు, జల రవాణా), ఆఖరి అడుగు వరకు అనుసంధానం, ప్రాథమిక పర్యాటక సౌకర్యాలైన సమాచార కేంద్రాలు, ఏటీఎం లేదా నగదు మార్పిడి, రవాణాలో పర్యావరణహిత పద్ధతులు, పునరుత్పాదక శక్తి వనరులతో ఆ ప్రాంతంలో వెలుగులు, పార్కింగ్‌, తాగునీరు, మరుగుదొడ్లు, సామాన్లు భద్రపరుచుకునే గది, వేచివుండే గది, ప్రాథమిక చికిత్స కేంద్రం, ప్రదర్శనశాల, ఫలహారశాల, రెయిన్ షెల్టర్‌, టెలికాం సౌకర్యం, ఇంటర్నెట్ అనుసంధానం మొదలైన మౌలిక సదుపాయాల వృద్ధిపై ఈ పథకం దృష్టి పెడుతుంది.

***
 


(Release ID: 1639203) Visitor Counter : 196