మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
పశుసంవర్ధక మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి అమలు మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ 2024 నాటికి 330 మిలియన్ టన్నులకు పెరగనున్న పాల ఉత్పత్తి.
పాల ప్రాసెసింగ్‌ను 40 శాతం వరకు పెంచేందుకు ప్రభుత్వం కృషి: శ్రీ గిరిరాజ్ సింగ్
పాడిపరిశ్రమ, మాంసం ప్రాసెసింగ్, విలువ పెంపు, ప్రైవేటు రంగంలో పశుదాణా ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించిన
మౌలిక సదుపాయాల కల్పనలో పెట్టుబడులకు ఎహెచ్ఐడిఎఫ్ ప్రోత్సాహకాలకు అవకాశం కల్పించనుంది.
Posted On:
16 JUL 2020 4:05PM by PIB Hyderabad
కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ ఈరోజు15 వేల కోట్ల రూపాయల విలువగల, పశుసంవర్ధక మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేశారు. దీనిని ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద వివిధ రంగాలలో ప్రగతికి వీలుకల్పించే ఉద్దీపన ప్యాకేజ్ లో భాగంగా 24.06.2020 న కేంద్ర కేబినెట్ ఆమోదించింది. పశుసంవర్ధక పాడి పరిశ్రమ శాఖ సహాయమంత్రి ప్రతాప్ చంద్ర సారంగి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పశుసంవర్దక మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి(ఎహెచ్ఐడిఎప్) ఏర్పాటును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించినందుకు శ్రీ గిరిరాజ్‌సింగ్ ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.పాల ఉత్పత్తిని పెంచేందుకు, ఆయా పాడి జాతులను మెరుగుపరిచేందుకు ఇండియా కృషి చేస్తున్నదని, మరోవైపు ప్రాసెసింగ్ రంగంపై దృష్టిపెడుతున్నదని మంత్రి చెప్పారు. ఇండియా 188 మిలియన్ టన్నుల పాలను ఉత్పత్తి చేస్తున్నదని, 2024 నాటికి పాల ఉత్పత్తి 330 మిలియన్ టన్నులకు పెరగనున్నదని గిరిరాజ్ సింగ్ అన్నారు. కేవలం 20 నుంచి 25 శాతం పాలు ప్రాసెసింగ్ రంగం నుంచి వస్తున్నాయని, దీనిని 40 శాతానికి పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఆయన అన్నారు. పాల ప్రాసెసింగ్ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి (డిఐడిఎఫ్)ని ,సహకార రంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి అమలు చేయనున్నదని, ఎహెచ్ఐడిఎఫ్ పథకం ఈదిశగా ప్రైవేటు రంగానికి తొలి పథకమని ఆయన అన్నారు. మౌలికసదుపాయాల కల్పన అనంతరం లక్షలాది మంది రైతులు దీనివల్ల ప్రయోజనం పొందుతారని, మరిన్ని పాలు ప్రాసెస్ చేయడానికి అవకాశం ఉంటుందని అన్నారు. ఇది పాల ఉత్పత్తుల ఎగుమతి ని పెంచనున్నదని, ప్రస్తుతం ఈ ఎగుమతులు అతితక్కువగా ఉన్నాయని చెప్పారు. పాల ఉత్పత్తుల రంగంలో ఇండియా, న్యూజిలాండ్ వంటి దేశాల ప్రమాణాల స్థాయికి చేరుకోవాల్సిఉందని గిరిరాజ్ సింగ్ అన్నారు. కోవిడ్ -19 లాక్‌డౌన్ సమయంలో పాడి రైతులు దేశంలోని పాల వినియోగదారులకు, పాలను నిలకడగా సరఫరా చేయగలిగారని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
పాల ఉత్పత్తి మౌలిక సదుపాయాల అభివృద్దికి పాల ఉత్పత్తి సహకార రంగం పెట్టుబడులకు తగిన ప్రోత్సాహకం ఇచ్చేందుకు ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తున్నది. ఎహెచ్ఐడిఎఫ్ ను ఎంఎస్ఎంఇగా ఏర్పాటు చేశారు. ప్రాసెసింగ్,విలువ జోడింపు మౌలికసదుపాయాలలో ప్రైవేటు రంగం పాత్రను దృష్టిలో ఉంచుకుని వాటిని ప్రోత్సహించడంతోపాటు, వాటికి రాయితీలు ఇవ్వాల్సి ఉంది. ప్రైవేటు రంగంలో పశుదాణా తయారీ ప్లాంట్ల ఏర్పాటుకు , మాంసం ప్రాసెసింగ్, విలువ పెంపు, మౌలిక సదుపాయాల కల్పనకు , పాల ఉత్పత్తుల రంగంలో మౌలికసదుపాయాల అభివృద్ధికి ఎహెచ్ఐడిఎఫ్ అవసరమైన పెట్టుబడి రాయితీలను కల్పించనుంది.
ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్‌లు (ఎఫ్.పి.ఒలు), ఎం.ఎస్.ఎం.ఇలు, సెక్షన్ 8 కంపెనీలు, ప్రైవేటు కంపెనీలు,వ్యక్తిగత ఎంటర్‌ప్రెన్యుయర్లు 10శాతం మార్జిన్ మనీని స్వయంగా సమకూరుస్తున్నవారు ఈ పథకం కింద అర్హతగల లబ్ధిదారులుగా ఉంటారు. మిగిలిన 90 శాతం మొత్తం రుణంగా ఉంటుంది. దీనిని షెడ్యూల్డు బ్యాంకులు సమకూరుస్తాయి. భారత ప్రభుత్వం 3 శాతం వడ్డీ రాయితీ సదుపాయాన్ని అర్హతగల లబ్ధిదారులకు కల్పిస్తుంది. అసలు రుణ మొత్తానికి రెండు సంవత్సరాల కాలం మారటోరియంగా ఉంటుంది. ఆ తర్వాత 6 సంవత్సరాలు తిరిగి చెల్లింపు కాలంగా ఉంటుంది.
భారత ప్రభుత్వం 750 కోట్ల రూపాయలతో క్రెడిట్ గ్యారంటీ ఫండ్‌ను ఏర్పాటు చేయనుంది. దీనిని నాబార్డ్ నిర్వహిస్తుంది. ఎంఎస్.ఎం.ఇ కింద నిర్వచించిన సీలింగ్ పరిమితి పరిధిలోకి వచ్చే , మంజూరైన ప్రాజెక్టులకు క్రెడిట్ గ్యారంటీ ని సమకూర్చనున్నారు. రుణగ్రహీత క్రెడిట్ సదుపాయంలో 25శాతం వరకు హామీ కవరేజ్ ఉంటుంది.డెయిరీ, మాంసం ప్రాసెసింగ్ యూనిట్, విలువను జోడించే మౌలికసదుపాయాలను ఏర్పాటు చేసేందుకు పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్న లబ్ధిదారులు లేదా ప్రస్తుత మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలనుకుంటున్న వారు ఎస్ఐడిబి కి చెందిన ఉద్యమ మిత్ర పోర్టల్ ద్వారా షెడ్యూల్డ్ బ్యాంకులలోదరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రైవేటు రంగం ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేందుకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. 15,000 కోట్ల రూపాయల ఎ.హెచ్.ఐ.డి.ఎఫ్, ప్రైవేటు పెట్టుబడి దారులకు వడ్డీ రాయితీ పథకం వంటివి ఈ ప్రాజెక్టులకు అవసరమైన పెట్టుబడిని సమకూర్చడానికి వీలు కల్పించడంతోపాటు, పెట్టుబడి దారులకు తాము పెట్టిన పెట్టుబడి మొత్తంపై రాబడి పెరగడానికి, పెట్టుబడి తిరిగి రావడానికి ఇది వీలు కల్పిస్తుంది. అర్హత గల లబ్దిదారులు, ప్రాసెసింగ్, విలువ జోడింపు రంగాలలో మౌలికసదుపాయాలకు సంబంధించి పెట్టిన పెట్టుబడులు ప్రాసెస్ అయిన, విలువ జోడింపు కలిగిన వస్తువుల ఎగుమతులును పెంచనున్నాయి.
ఇండియాలో పాల ఉత్పత్తుల తుది విలువలో దాదాపు 50నుంచి 60 శాతం వరకు తిరిగి రైతులకే వెళుతుంది. అందువల్ల ఈ రంగంలో వృద్ధి రైతుల రాబడిపై ప్రత్యక్ష ప్రభావాన్నికలిగి ఉంటుంది. పాల ఉత్పత్తుల మార్కెట్ సైజు, పాల అమ్మకం నుంచి రైతులకు వచ్చే రాబడి అనేవి ప్రైవేటు , సహకార పాల ఉత్పత్తి సంస్థల క్రమమైన వృద్దితో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నాయి.
అందువల్ల, ఎహెచ్ఐడిఎఫ్ లో పెట్టుబడి ప్రోత్సాహం 7 రెట్లు ప్రైవేట్ పెట్టుబడులను ప్రభావితం చేయడమే కాకుండా, ఇన్‌పుట్‌లపై ఎక్కువ పెట్టుబడులు పెట్టడానికి రైతులను ప్రోత్సహిస్తుంది. తద్వారా ఉత్పాదకత పెరిగి, రైతుల ఆదాయాలు కూడా పెరుగుతాయి. ఎహెచ్ఐడిఎఫ్ ద్వారా ఆమోదించిన చర్యలు 35 లక్షల మంది ప్రత్యక్ష,పరోక్ష జీవనోపాధి కల్పనకు సహాయపడనున్నాయి.
కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రతాప్ చంద్ర సారంగి మాట్లాడుతూ, ప్రభుత్వం 53.5 కోట్ల పశువులకు వాక్సిన్ వేయించాలని నిర్ణయించిందని, ఇందులో ఇప్పటికే 4 కోట్ల పశువులకు వాక్సిన్ వేశారని ఆయన చెప్పారు.
సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో బ్రీడ్ మెరుగుదల జరుగుతున్నదని చెప్పారు. అయితే మనం ప్రాసెసింగ్ రంగంలో వెనుకబడి ఉన్నామన్నారు. ఎహెచ్ఐడిఎఫ్ ను ఉపయోగించుకుని దాణాకు కూడా ప్రాసెసింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవచ్చని ఆయన అన్నారు. ఇది రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి అలాగే ప్రధానమంత్రి కల అయిన 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ ను సాధించడానికి ఉపకరిస్తుందన్నారు.
పశు సంవర్దక మౌలికసదుపాయాల అభివృద్ధి నిధి అమలుకు సంబంధించిన మార్గదర్శకాల లింక్ ...
(Release ID: 1639176)
Visitor Counter : 304