ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
1234 లాబ్ లు, రాపిడ్ యాంటిజెన్ పరీక్షలతో ప్రతి పదిలక్షలమందిలో 9231 పరీక్షలు
24 గంటల్లో 3.26 లక్షలకు పైగా శాంపిల్స్ పరీక్ష
Posted On:
16 JUL 2020 5:41PM by PIB Hyderabad
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పరీక్షించు, ఆనవాలు తెలుసుకో, చికిత్స అందించు అనే త్రిముఖ వ్యూహంలో భాగంగా దేశ వ్యాప్తంగా పరీక్షలు పెంచటం కోసం పారీక్షలు జరిపే లాబ్ ల సంఖ్య బాగా పెరిగింది. భారత వైద్య పరిశోధనామండలి మార్గదర్శకాలకు అనుగుణంగా పరీక్షల సంఖ్య పెంచటం వలన పాజిటివ్ కేసులను త్వరగా గుర్తించే అవకాశం ఏర్పడింది.
కోవిడ్ పాజిటివ్ కేసులను నిర్థారించేందుకు ఆర్ టి - పిసిఆర్ టెస్ట్ ను అత్యుత్తమమైన గోల్డ్ స్టాండర్డ్ గా పరిగణిస్తుండగా రాపిడ్ యాంటిజెన్ పాయింట్ ఆప్ కేర్ ( పిఒసి) పరీక్ష ద్వారా అర్థగంటలోనే ఫలితం తెలుసుకోవచ్చు. దీనివలన కంటెయిన్మెంట్, బఫర్ జోన్లలో పరీక్షలు బాగా పెంచే వెసులుబాటు ఏర్పడింది. ఆ విధంగా కరోనా ఇన్ఫెక్షన్ వ్యాప్తిని సమర్థంగా అడ్డుకోగలుగుతున్నారు.
పరీక్ష జరిపించుకోవాల్సిందిగా సిఫార్సు చేయటానికి ఆర్ ఎం పి డాక్టర్లు కూడా అర్హులేనని చెప్పటంతో బాటు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆర్ టి- పిసిఆర్, ట్రూనాట్, సిబి నాట్ లాబ్ నెట్ వర్క్ లు పెరగటంతో పరీక్షల సంఖ్య గణనీయంగా పెరిగింది.
గడిచిన 24 గంటల్లో 3,26,826 శాంపిల్స్ పరీక్షించగా ఇప్పటివరకు జరిపిన మొత్తం పరీక్షల సంఖ్య 1,27,39,490 కి చేరింది. ఫలితంగా ప్రతి పది లక్షల మంది జనాభాలో 9231.5 మందికి పరీక్షలు జరిపినట్టయింది.
దేశవ్యాప్తంగా పరీక్షల సంఖ్య పెరగటంలో కీలలమైన పాత్ర పోషించింది పెరుగుతున్న లాబ్ ల నెట్ వర్క్ అన్నది నిజం. నేటివరకూ దేశంలో ఉన్న లాబ్ ల సంఖ్య 1234 కాగా అందులో ప్రభుత్వ ఆధ్వర్యంలో 874, ప్రైవేట్ ఆధ్వర్యంలో 360 ఉన్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి:
తక్షణం ఫలితాలు చూపే పరీక్షల లాబ్స్ : 635 (ప్రభుత్వ: 392 + ప్రైవేట్: 243)
ట్రూ నాట్ ఆధారిత పరీక్షల లాబ్స్ : 499 (ప్రభుత్వ: 447 + ప్రైవేట్: 52)
సిబినాట్ ఆధారిత పరీక్షల లాబ్స్: 100 (ప్రభుత్వ: 35 + ప్రైవేట్65 )
కోవిడ్ -19 మీద సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, సూచనలతో కూడిన కచ్చితమైన తాజా సమాచారం కోసం క్రమం తప్పకుండా https://www.mohfw.gov.in/ మరియు @MoHFW_INDIA ను సందర్శించండి.
కోవిడ్ -19 కు సంబంధించిన సాంకేతికమైన అనుమానాలుంటే technicalquery.covid19[at]gov[dot]in కు పంపవచ్చు. ఇతర సమాచారం కావాల్సినవారు ncov2019[at]gov[dot]in మరియు @CovidIndiaSeva ను సంప్రదించవచ్చు.
కోవిడ్ -19 మీద ఏవైనా ప్రశ్నలుంటే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్ లైన్ నెంబర్ +91-11-23978046 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1075 కు ఫోన్ చేయవచ్చు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల హెల్ప్ లైన్ నెంబర్ల కోసం https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf చూడండి
(Release ID: 1639149)
Visitor Counter : 193