హోం మంత్రిత్వ శాఖ

ఆధ్యాత్మిక గురువు ఆచార్య శ్రీ పురుషోత్తం ప్రియదాస్‌‌జీ స్వామిశ్రీ మహారాజ్ జీ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్‌ షా

ఆచార్య శ్రీ పురుషోత్తం ప్రియదాస్‌‌జీ స్వామిశ్రీ మహారాజ్ జీ పవిత్ర బోధనలు, సమాజ శ్రేయస్సు కోసం చేసిన నిస్వార్థ సేవకు ఏదీ సాటిరాదన్న అమిత్ షా

ఆచార్య శ్రీ పురుషోత్తం ప్రియదాస్‌‌జీ స్వామిశ్రీ మహారాజ్ జీ జీవితమంతా విలువలు, విజ్ఞానమయం. మానవత్వం కోసం నిస్వార్థంగా అంకితమయ్యారని కొనియాడిన అమిత్‌ షా

Posted On: 16 JUL 2020 1:11PM by PIB Hyderabad

లక్షలాది జీవితాల్లో వెలుగులు నింపిన ఆధ్యాత్మిక గురువు ఆచార్య శ్రీ పురుషోత్తం ప్రియదాస్‌‌జీ  స్వామిశ్రీ మహారాజ్ జీ మరణం పట్ల కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్‌ షా సంతాపం వ్యక్తం చేశారు. 

    ఆచార్య శ్రీ పురుషోత్తం ప్రియదాస్‌‌జీ  స్వామిశ్రీ మహారాజ్ జీ పవిత్ర బోధనలు, సమాజ శ్రేయస్సు కోసం ఆయన చేసిన చేసిన నిస్వార్థ సేవకు ఏదీ సాటిరాదని అమిత్ షా ట్వీట్‌ చేశారు.

    ఆచార్య శ్రీ పురుషోత్తం ప్రియదాస్‌‌జీ  స్వామిశ్రీ మహారాజ్ జీ జీవితమంతా ఉదాత్తమైన విలువలు, విజ్ఞానంతో సాగిందని, మానవత్వమనే గొప్ప కారణం కోసం నిస్వార్థంగా ఆయన అంకితమయ్యారని అమిత్‌ షా కొనియాడారు.

    స్వామీజీ మరణం పూడ్చలేని లోటని పేర్కొన్న అమిత్‌ షా, ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన శిష్యులకు మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్‌లో వెల్లడించారు.

    ఆచార్య శ్రీ పురుషోత్తం ప్రియదాస్‌‌జీ  స్వామిశ్రీ మహారాజ్ జీ, మణినగర్ శ్రీ స్వామినారాయణ సంస్థాన్ ఆధ్యాత్మిక గురువు. ఆచార్యుల పరంపరలో ఆయన ఐదో వారసుడు. ప్రస్తుతం ఆయన ఆచార్య స్థానంలో లేరు. 

 

***


(Release ID: 1639098)