ప్రధాన మంత్రి కార్యాలయం
ఇసిఒఎస్ఒసి యొక్క ఉన్నత స్థాయి విభాగాన్ని ఉద్దేశించి 2020వ సంవత్సరం జూలై 17వ తేదీ న ప్రసంగించనున్న ప్రధాన మంత్రి
Posted On:
16 JUL 2020 11:26AM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2020వ సంవత్సరం జూలై 17వ తేదీ నాడు న్యూ యార్క్ లోని ఐక్య రాజ్య సమితి ఆర్థిక మరియు సామాజిక మండలి (ఇసిఒఎస్ఒసి) కి చెందిన ఉన్నత స్థాయి విభాగం యొక్క ఈ సంవత్సరపు సమావేశాన్ని ఉద్దేశించి వర్చువల్ మాధ్యమం ద్వారా కీలకోపన్యాసాన్ని ఇవ్వనున్నారు. ఈ సమావేశం 0930-1130 గంటల మధ్య (స్థానిక కాలమానం ప్రకారం) జరుగనుంది. ముగింపు సమావేశం లో ప్రధాన మంత్రి నార్వే యొక్క ప్రధాని తో మరియు యుఎన్ సెక్రటరి జనరల్ తో కలసి ప్రసంగించనున్నారు.
ప్రభుత్వం, ప్రైవేటు రంగం, పౌర సమాజం మరియు విద్యావేత్త లతో కూడిన ఒక భిన్న సమూహానికి చెందిన ఉన్నత స్థాయి ప్రతినిధులు వార్షిక ఉన్నత స్థాయి విభాగం లో కొలువుదీరారు. ‘‘కోవిడ్- 19 అనంతర బహుపక్షవాదం: 75వ వార్షికోత్సవ వేళ మనకు ఎటువంటి యుఎన్ యొక్క ఆవశ్యకత ఉన్నది’’ అనేది ఈ సంవత్సరం జరిగే ఉన్నత స్థాయి విభాగం యొక్క ఇతివృత్తం గా ఉన్నది.
మారుతున్న అంతర్జాతీయ పరిసర వాతావరణం మరియు కోవిడ్-19 విశ్వమారి తాలూకు ప్రస్తుత సంకట కాలాన్ని పూర్వ రంగం గా తీసుకొని ఈ సమావేశం బహుపక్షవాదం యొక్క దిశ ను నిర్ధరించేటటువంటి మహత్వపూర్ణ బలాల పైన దృష్టి ని సారించనున్నది. దీని తో పాటు, ఈ సమావేశం సందర్భం లో బలమైన నాయకత్వం, ప్రభావశీల అంతర్జాతీయ సంస్థ లు, ప్రాతినిధ్య విస్తరణ మరియు ప్రపంచ శ్రేణి సార్వజనిక వస్తువుల కు పెరిగిన ప్రాముఖ్యం.. వీటన్నిటి రూపం లో ప్రపంచ కార్యసూచీ అమలు ను ముందుకు తీసుకుపోయే మార్గాల ను అన్వేషించనున్నారు.
భద్రత మండలి లో శాశ్వతేతర సభ్యత్వ దేశం గా (2021-22 పదవీకాలాని కి గాను) భారతదేశం జూన్ 17వ తేదీ నాడు ఎదురులేకుండా ఎన్నికైనప్పటి నుండి
విస్తృత యుఎన్ సభ్యత్వదేశాల ను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ప్రధాన మంత్రి కి లభించడం ఇదే మొదటి సారి. ఐక్య రాజ్య సమితి ని స్థాపించిన అనంతరం 75వ వార్షికోత్సవ వేళ చోటు చేసుకొంటున్నటువంటి ఇసిఒఎస్ఒసి యొక్క ఉన్నత స్థాయి విభాగ సదస్సు తాలూకు ఇతివృత్తం నిజాని కి భారతదేశం భద్రత మండలి సంబంధిత ప్రాధాన్యం తో సైతం మారుమోగుతూ ఉన్నది. దీని లో భాగం గా, కోవిడ్-19 తదనంతర జగత్తు లో ‘సంస్కరించిన బహుపక్షవాద’ ఆవశ్యకత ఉందని భారతదేశం పిలుపునిచ్చింది. ఇదే సందర్భం లో, ఇసిఒఎస్ఒసి యొక్క ప్రథమ అధ్యక్ష పదవి (1946 వ సంవత్సరం లో సర్ రామస్వామి ముదలియార్) రూపం లో భారతదేశం పోషించిన భూమిక ను కూడా ను స్మరించుకోవడం జరుగుతుంది. ప్రధాన మంత్రి ఇంతకు ముందు, 2016 వ సంవత్సరం జనవరి మాసం లో, ఇసిఒఎస్ఒసి యొక్క 70వ వార్షికోత్సవం జరిగిన సందర్భం లో కీలకోపన్యాసాన్ని ఇచ్చారు.
***
(Release ID: 1639094)
Visitor Counter : 266
Read this release in:
Punjabi
,
Odia
,
Assamese
,
Malayalam
,
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Gujarati
,
Tamil