ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

గడిచిన 24 గంటల్లో కోలుకున్న కోవిడ్ బాధితులు 20,000 దాటటంతో 63.24%చేరిన కోలుకున్నవారిశాతం

మొత్తం కోలుకున్నవారు దాదాపు 6 లక్షలు

చికిత్సలో ఉన్నవారి సంఖ్య 3,19,840 మాత్రమే

Posted On: 15 JUL 2020 5:35PM by PIB Hyderabad

గడిచిన 24 గంటల్లో కోలుకున్న కోవిడ్ బాధితుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 24 గంటల్లో  20,572 మంది కోలుకోగా ఇప్పటివరకు బాధితులలో కోలుకున్నవారి మొత్తం సంఖ్య 5,92,031 కి చేరింది. దీంతో నేటికి కోలుకున్నవారి శాతం 63.24% అయింది.

 

కోలుకున్నవారు పెరగటానికి ప్రధానంగా పరీక్షల సంఖ్య బాగా పెరగటం, సకాలంలో వ్యాధి నిర్థారణ, సమర్థంగా చికిత్సచేయటం అనే అంశాలున్నాయి. కొన్ని సందర్భాలలో ఆస్పత్రులకు బదులు ఇళ్ళలోనే క్వారంటైన్ చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించటం  కూడా సత్ఫలితాలనిచ్చింది.  లక్షణాలు కనబడని, తేలికపాటి లక్షణాలు మాత్రమే కనబడిన బాధితుల విషయంలో ఇళ్ళలో ఉంచుతూ ఆక్సిమీటర్లు వాడేట్టు చేసి  ప్రమాణాలు పాటింపజేయటం వలన ఆస్పత్రుల మౌలిక సదుపాయాలమీద భారం పడకుండా కూడా చూడగలిగారు.

 

కోలుకున్నవారికీ, చికిత్సలో ఉన్నవారికీ మధ్య తేడా బాగా పెరుగుతోంది. ఈరోజుకు ఆ సంఖ్య 2,72,191 కు చేరింది. ఆ విధంగా చూసినప్పుడు బాధితులకంటే  కోలుకున్నవారు  1.85 రెట్లు ఎక్కువగా ఉన్నారు.

 

భారతదేశంలో కోవిడ్ బాధితులకున్ చికిత్స చేయటానికి అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలలో 1378 ప్రత్యేక కోవిడ్ ఆస్పత్రులు, 3077  ప్రత్యేక కోవిడ్ ఆరోగ్య కేంద్రాలు, 10351 కోవిడ్ సంరక్షక కేంద్రాలు ఉన్నాయి. వాటిలో మొత్తం 21,738 వెంటిలేటర్లు, 46,487 ఐసియు పడకలు, 1,65,361  ఆక్సిజెన్ తో కూడిన పడకలు ఉన్నాయి.

 

కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకూ 230.98 లక్షల ఎన్95 మాస్కులు, 123.56 లక్షల పిపిఇ కిట్లు, 11,660 వెంటిలేటర్లు రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు అందజేసి కోవిడ్ చికిత్స సమర్థవంతంగా జరగటానికి దోహదం చేసింది. 

 

కోవిడ్ -19 మీద సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, సూచనలతో కూడిన కచ్చితమైన తాజా సమాచారం కోసం క్రమం తప్పకుండా https://www.mohfw.gov.in/ మరియు  @MoHFW_INDIA ను సందర్శించండి.

కోవిడ్ -19 కు సంబంధించిన సాంకేతికమైన అనుమానాలుంటే technicalquery.covid19[at]gov[dot]in కు పంపవచ్చు. ఇతర సమాచారం కావాల్సినవారు ncov2019[at]gov[dot]in మరియు @CovidIndiaSeva ను సంప్రదించవచ్చు.

కోవిడ్ -19 మీద ఏవైనా ప్రశ్నలుంటే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్ లైన్ నెంబర్  +91-11-23978046 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1075 కు ఫోన్ చేయవచ్చు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల హెల్ప్ లైన్ నెంబర్ల కోసం   https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf  చూడండి

 

***

 

 


(Release ID: 1638843) Visitor Counter : 185