వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాల్లో అసాధారణ వేగం

ప్రపంచ స్థిరత్వం, భద్రత, ఆర్థిక సమృద్ధిలో ప్రయోజనాలను పరస్పరం పంచుకోవడమే కారణమన్న కేంద్రమంత్రి పీయూష్ గోయల్

Posted On: 15 JUL 2020 1:25PM by PIB Hyderabad

భారత్, అమెరికా సి... వేదిక 2020 జూలై 14 తేదీన టెలిఫోనిక్ కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైందిభారత్, అమెరికాలు 2014లో వేదికను పునర్ వ్యవస్థీకరించిన తర్వాత  సమావేశం జరగడం ఇది ఐదవసారి. వాణిజ్య  సంస్థలను ప్రభావితం చేసే కీలక అంశాలపై దృష్టిని కేంద్రీకరించేందుకు బలమైన వేదికగా ఇది ఉపయోగపడుతుంది. ఆలాగే, ఉభయ దేశాల ఆర్థిక వ్యవస్థలకు పరస్పరం ప్రయోజనకరంగా ఉండేలా సహకరించుకోవలసిన అంశాలను అంశాలను గుర్తించేందుకు కూడా వేదిక దోహదపడుతుంది.

  కేంద్ర వాణిజ్య, పరిశ్రమలు, రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్, అమెరికా వాణిజ్య శాఖ మంత్రి విలియం రాస్ సమావేశానికి ఉమ్మడిగా అధ్యక్షత వహించారు. పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ కార్యదర్శి గురుప్రసాద్ మహాపాత్ర, ఇతర సీనియర్ అధికారులుఅమెరికాలో భారతీయ రాయబారి డాక్టర్ తరణ్ జిత్ సాంధూ, భారత్ లో అమెరికా రాయబారి కెన్నెత్ జస్టర్ పాల్గొన్నారు.

   భారత్, అమెరికాలకు చెందిన ప్రముఖ కంపెనీల ముఖ్య కార్యనిర్వాహక అధికారుల (సి...లు)తో కూడిన వేదిక సమావేశానికి టాటాసన్స్ సంస్థ చైర్మన్ చంద్రశేఖరన్, లాక్ హీడ్ మార్టిన్ సంస్థ ప్రెసిడెంట్, ముఖ్యకార్యనిర్వహణాధికారి జేమ్స్ టాయ్ క్లెట్ సహాధ్యక్షులుగా వ్యవహరించారు. గతంలో 2029 ఫిబ్రవరిలో న్యూఢిల్లీలో జరిగిన ఇదివరకటి సీఈఓల వేదిక సమావేశంలో తీర్మానించిన విధానపరమైన సిఫార్సులు, కొత్త తరహా సంస్కరణలను  అమలు చేయడంలో రెండు ప్రభుత్వాలు తీసుకున్న చర్యలను ఉభయ పక్షాల సీఈఓలు ప్రశంసించారు. సీఈఓ ఫోరమ్ సభ్యులు తాజాగా ఉమ్మడిగా ఆమోదించిన సంస్కరణలను, విధానపరమైన సిఫార్సులను సమర్పించారు. ఆరోగ్య రక్షణ, ఔషధాలు, ఎయిరో స్పేస్, రక్షణమౌలిక సదుపాయాలు వస్తూత్పత్తితోపాటు, ఆర్థికవ్యవస్థ కీలక రంగాల్లో ద్వైపాక్షిక పెట్టుబడులను ప్రోత్సహించడమే లక్ష్యంగా సిఫార్లులను సమావేశంలో సమర్పించారుచిన్న వ్యాపారాలకు ప్రోత్సాహం, ఇంధనం, నీరు-పర్యావరణం, .సి.టి., డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఆర్థిక సేవలు, వాణిజ్యం-పెట్టుబడులు తదితర రంగాల్లో పెట్టుబడులు లక్ష్యంగా సిఫార్సులను రూపొందించారు.

     ఉభయదేశాల ద్వైపాక్షిక సంబంధాల పటిష్టతకోసం సమావేశంలో పాల్గొని చొరవ చూపిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు, సమావేశానికి సహాద్యక్షత వహించిన అధికారులకు అమెరికా మంత్రి రాస్ కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రత్యేకించి కోవిడ్-19 మహమ్మారి ప్రబలిన సంక్షోభ సమయంలో చొరవ చూపినందుకు ఆయన కృతజ్ఞతలు వ్యక్తంచేశారు. ఔషధాల, వైద్య పరికరాల తయారీ, సరఫరా రంగంలో రెండు దేశాలు పరస్పర సహకారంద్వారా మరింత చేరువ కావడానికి సమావేశం ఒక అవకాశమని రాస్ అన్నారు.

  సందర్భంగా మంత్రి గోయల్ మాట్లాడుతూ,..భారత్, అమెరకా ద్వైపాక్షిక సంబంధాల్లో అసాధారణమైన ఊపు వచ్చిందని,.. ప్రపంచ స్థిరత్వం, భద్రత, ఆర్థిక సమృద్ధిలో ప్రయోజనాలను ఉభయదేశాలు పరస్పరం పంచుకోవడమే ఇందుకు కారణమని గోయల్ అన్నారు. ఉభయదేశాల ఆర్థిక వ్యవస్థల్లో చిన్న వ్యాపారుల ప్రాముఖ్యతను గోయల్ ప్రధానంగా ప్రస్తావిస్తూ, రంగంలో ఉద్యోగాలను, నైపుణ్యాలను పెంచవలసిన అవసరం ఉందని అన్నారు. కోవిడ్ వైరస్ అనంతర ప్రపంచంలో అనుసరించవలసిన కొత్త మార్గాన్ని రూపకల్పన చేయడంలో సీఈఓల ఫోరమ్ ముందు నడవాలని ఆయన సూచించారు.

   సమావేశానికి అమెరికా తరఫున సహాధ్యక్షత వహించిన టాయ్ క్లెట్ మాట్లాడుతూ,..కోవిడ్-19 సంక్షోభ సమయంలో ఉభయదేశాల మధ్య వెల్లడైన అసాధారణ సహకారం,..ఇకపై కూడా కొనసాగుతుందని, మౌలిక సదుపాయాల నిర్మాణం, ద్వైపాక్షిక పెట్టుబడుల పెంపుదల, ఉద్యోగాల సృష్టి వంటి అంశాల్లో సహకారం కొనసాగుతుందని అన్నారు. పరిమితిలేని విదేశీ పెట్టుబడులకు అవకాశం ఉన్న కొన్ని రంగాలను ఆయన ప్రధానంగా ప్రస్తావించారువిధాన స్థిరత్వం, సకాలంలో వివాదాల పరిష్కారం, మేధోసంపత్తి హక్కుల రక్షణ, మౌలిక సదుపాయాల్లో పెట్టుబడుల కొనసాగింపు వంటి అంశాలపై దృష్టిని కేంద్రీకరించాలన్నారు.

  భారత్ తరఫున సమావేశానికి సహాద్యక్షుడుగా వ్యవహరించిన చంద్రశేఖరన్ మాట్లాడుతూ, ప్రపంచ సరఫరా వ్యవస్థను తిరిగి సమతౌల్యం చేసేందుకు ప్రపంచ స్థాయిలో కృషి చేయాల్సిన అవసరం ఉందని, భౌగోళిక, వాణిజ్య సంబంధమైన అంశాలే ఇందకు కారణమని అన్నారు. అమెరికా ప్రైవేటు రంగంలోని కంపెనీల ప్రతినిధులు, అమెరికా ప్రభుత్వంతో భాగస్వామ్యం వహించేందుకు అవకాశం లభించడం అభినందనీయమని అన్నారు. ఉభయదేశాల మధ్య వాణిజ్య సంబంధాలు పటిష్టపడటానికి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చాలా అవసరమని అన్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి మానవ వనరుల రూపంలో భారత్ అందిస్తున్న సహాయాన్ని దేశం గుర్తించాల్సి ఉందన్నారు. అలాంటి ప్రతిభా వనరుల సరిహద్దులుదాటి కదిలేందుకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాల్సి ఉందని ఆయన అన్నారు.   

  అమెరికా రాయబారి జస్టర్ మాట్లాడుతూ,..భారత్-అమెరికా వాణిజ్య సంబంధాల్లో ఇంకా వినియోగంలోకి రాని సామర్థ్యాలపై సీఈఓల వేదిక దృష్టిని కేంద్రీకరించాలన్నారు. ఉభయ పక్షాలకు ఆమోద యోగ్యమైన విధానపరమైన సూచనలను సీఈఓల వేదికకు చెందిన ప్రతి అధ్యయన బృందం రూపొందించాలని విజ్ఞప్తి చేశారు. భారత్-అమెరికా భాగస్వామ్యాలను తీర్చిదిద్దడంలో సీఈఓల వేదిక పాత్ర ప్రశంసనీయమని భారత రాయబారి సాంధూ అన్నారు. విధాన నిర్ణయకర్తలు సంస్కరణలను రూపొందించేందుకు సీఈఓల వేదిక  సిఫార్సులు ఎంతగానో దోహదపడ్డాయన్నారు.

   సమావేశంలో ప్రారంభోన్యాసం అనంతరం సహాధ్యక్షులు సిఫార్సులను, సూచనలను సమర్పించారు. ఆరోగ్య రక్షణ, ఔషధాలు, ఎయిరోస్పేస్, రక్షణ, మౌలిక సదుపాయాలు, వస్తూత్పత్తి, చిన్న వ్యాపారులకు ప్రోత్సాహం, ఇంధనం, నీరు-పర్యావరణం, .సి.టి, డిజిటల్ రంగం మౌలిక సదుపాయాలు, ఆర్థిక సేవలు, వాణిజ్యం, పెట్టుబడులపై సిఫార్సులు రూపొందించారు.

  సీఈఓల వేదికకు సంబంధించిన అధ్యయన బృందాలు సమావేశంలో తమ నివేదికలను చదివి వినిపించన అనంతరం,. కేంద్ర పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ కార్యదర్శి గురుప్రసాద్ మహాపాత్ర మాట్లాడుతూ,..భారత్-అమెరికా ఆసాధారణ ద్వైపాక్షిక సంబంధాలను గురించి ప్రస్తావించారు. వాణిజ్యం, పెట్టుబడులు, అనుసంధాన రంగాల్లో ఉభయదేశాల సంబంధాలు నానాటికీ మరింత బలోపేతం అవుతున్నాయని ఆయన అన్నారు.

   ఉభయదేశాల వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు ప్రయోజనం కలిగించే లక్ష్యానికి తాము కట్టుబడి ఉన్నామని ఉభయ పక్షాల ప్రభుత్వ ప్రతినిధులు, సీఈఓలు సమావేశంలో స్పష్టం చేశారు. కోవిడ్ సంక్షోభం అనంతర కాలంలో సమావేశం సిఫార్సులకు ప్రాధాన్యం ఇచ్చేందుకు, ద్వైపాక్షిక సంబంధాల పటిష్టతకోసం పనిచేసేందుకు తాము దృఢదీక్షతో ఉన్నామని గోయల్, రాస్ స్పష్టం చేశారు

 

***



(Release ID: 1638770) Visitor Counter : 250