నౌకారవాణా మంత్రిత్వ శాఖ
కోల్‌కతా ఓడరేవులోని హల్దియా డాక్ కాంప్లెక్స్‌కు రూ.107 కోట్ల వ్యయంతో అగ్నిమాపక సౌకర్యాల ఏర్పాటుకు కేంద్ర షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ఆమోదం
- నౌకాశ్రయంలో భద్రత మరియు సురక్షితమైన కార్గో కార్యకలాపాల దిశగా కీలక చర్య
Posted On:
14 JUL 2020 2:47PM by PIB Hyderabad
కోల్‌కతా ఓడరేవులోని హల్దియా డాక్ కాంప్లెక్స్‌లో గల ఐదు జెట్టీలలో రూ.107 కోట్ల వ్యయంతో అత్యాధునిక అగ్నిమాపక సదుపాయాల ఏర్పాటుకు గాను కేంద్ర
షిప్పింగ్ శాఖ సహయ మంత్రి (స్వతంత్ర హోదా) శ్రీ మన్సుఖ్ మాండవియా ఆమోదం తెలిపారు. ఈ ఆధునిక అగ్నిమాపక సౌకర్యాలు కోల్‌కతా పోర్ట్‌లో ఉన్న హల్దియా డాక్ కాంప్లెక్స్ నుండి పెట్రో-రసాయన ఉత్పత్తుల ఎగుమతి దిగుమతులకు వీలు కలిగించనుంది. పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ యొక్క ఆయిల్ ఇండస్ట్రీ సేఫ్టీ డైరెక్టరేట్ (ఓఐఎస్‌డీ) యొక్క మార్గదర్శకం ప్రకారం ఇక్కడ ప్రస్తుతం ఉన్న అగ్నిమాపక సౌకర్యం ఎల్‌పీజీ మరియు ఇతర పెట్రోలియం ఉత్పత్తుల రవాణకు తగిన మద్దతునిచ్చేది లేదు. షిప్పింగ్ మంత్రిత్వ శాఖ అన్ని ప్రధాన ఓడరేవులలో కార్గో ఆపరేషన్ యొక్క రక్షణ మరియు భద్రతకు ప్రాధాన్యతను ఇచ్చింది. తాజా ప్రతిపాదిత చర్య ప్రపంచ స్థాయి ప్రమాణాల ప్రకారం అగ్నిప్రమాదాల నుంచి తగిన భద్రత కల్పించేలా ఉంది. మేటి అగ్నిమాపక చర్యల కారణంగా సమీప భవిష్యత్తులో హల్డియా డాక్‌లోని ఎల్‌పీజీ మరియు ఎల్‌ఎన్‌జీ కార్గో మరింత పెరుగుతుందని అంచనా.
ఓఐఎస్‌డీ మార్గదర్శకాలను మేరకు ఏర్పాటు చేయనున్న అత్యాధునిక అగ్ని మాపక మౌలిక సదుపాయాలు.. కోల్‌కతా నౌకాశ్రయంలో పెట్రో-రసాయన వస్తువుల ఎగుమతి, దిగుమతులను పూర్తి రక్షణాతక్మంగా సురక్షితంగా నిర్వహించేందుకు గాను దోహదం చేయనున్నాయి.
***
(Release ID: 1638551)
Visitor Counter : 204