ఆర్థిక మంత్రిత్వ శాఖ

రాజస్థాన్‌, దిల్లీ, ముంబయిలో తనిఖీలు చేపట్టిన ఆదాయపన్ను విభాగం

Posted On: 13 JUL 2020 10:40PM by PIB Hyderabad

ఆదాయపన్ను అధికారులు మూడు బృంద వ్యాపారాలపై తనిఖీలు చేపట్టారు. జైపూర్‌లోని 20 ప్రాంతాల్లో, కోటాలోని 6 చోట్ల, ముంబయిలోని 9 ప్రదేశాల్లో ఈ తనిఖీలు జరిగాయి.

    హోటళ్లు, జలవిద్యుత్‌ ప్రాజెక్టులు, లోహ, వాహన రంగాల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్న ఒక బృందం కార్యకలాపాలపై అధికారులు ఆరా తీశారు. ఈ వ్యాపారాల్లో వచ్చిన లెక్కల్లో చూపని ఆదాయాన్ని స్థిరాస్తి రంగంలో పెట్టుబడి పెట్టినట్లు అనుమానిస్తున్నారు.

    మరో బృందం హస్తమున్న వెండి, బంగారం, పురాతన వెండి వస్తువుల వ్యాపారాలు, ఈ వ్యాపారాలతో సంబంధమున్న యూకే, అమెరికా వంటి దేశాల్లోని సంస్థల లావాదేవీలపైనా అధికారులు దృష్టి పెట్టారు. ఈ దేశాల్లోని ఆస్తులు, బ్యాంక్‌ ఖాతాలపై ఆరా తీశారు. వెండి ఆభరణాల వ్యాపారంలో ఎక్కువ భాగాన్ని  ఖాతా పుస్తకాల్లో చూపడం లేదన్నది ఈ బృందంపై ప్రధాన ఆరోపణ.

    మూడో బృందం హోటల్ వ్యాపారంలో ఉంది. ఈ వ్యాపారాల్లోకి పెట్టుబడి ఎక్కడి నుంచి వచ్చిందో తేల్చాల్సివుంది.
  
    కాగితాలు, డైరీలు, డిజిటల్ సమాచారం రూపంలో అనేక ఆధారాలు అధికారులకు లభించాయి. బులియన్‌ మార్కెట్‌, వివిధ ఆస్తుల్లో నగదు రూపంలో పెట్టుబడులను ఇవి సూచిస్తున్నాయి. పరిశోధన కొనసాగుతోంది.    

 

***
 



(Release ID: 1638510) Visitor Counter : 156