ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

భారతదేశంలో 5.5 లక్షలకు పైగా కోలుకున్న కేసులు ఉన్నాయి, ఇవి యాక్టివ్ కేసుల కన్నా 2.5 లక్షలు ఎక్కువ

జాతీయ సగటు 63.02% కంటే 19 రాష్ట్రాలు అధిక రికవరీ రేటును కలిగి ఉన్నాయి

30 రాష్ట్రాలు తక్కువ మరణాల రేటును కలిగి ఉన్నాయి, జాతీయ సగటు 2.64%

పది లక్షల మందిలో 8555 కన్నా ఎక్కువ మందికి పరీక్షలు జరుగుతున్నాయి

Posted On: 13 JUL 2020 5:35PM by PIB Hyderabad

కోవిడ్-19 ని నిరోధించడం, నివారించడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న అనుకూల-క్రియాశీల, ముందస్తు, సమన్వయ చర్యల పరంపరతో  కోవిడ్-19 రికవరీలో క్రమంగా పెరుగుదలకు దోహదపడింది. ఉధృతంగా పరీక్షలు, సకాలంలో రోగ నిర్ధారణతో పాటు కోవిడ్ ప్రభావిత రోగులను వ్యాధి ముదిరే దశకు చేరుకునే ముందు గుర్తించడానికి దారితీసింది; కంటైన్మెంట్ జోన్ లను సమర్థవంతంగా అమలు చేయడం, నిఘా కార్యకలాపాలు సంక్రమణ రేటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. ఆక్సిమీటర్ల వాడకంతో పాటు ఇంటి ఐసోలేషన్ సంరక్షణకు సంబంధించిన నిబంధనలు, ప్రమాణాలు ఆసుపత్రి మౌలిక సదుపాయాలపై భారం పడకుండా, లక్షణం లేని లేదా స్వల్పంగా రోగలక్షణ రోగులను తనిఖీ చేయడానికి సహాయపడ్డాయి. ఇటువంటి గ్రేడెడ్ పాలసీ, సంపూర్ణ విధానం గత 24 గంటల్లో 18,850 మంది కోలుకోవడానికి దారితీసింది, కోవిడ్-19 రోగులలో మొత్తం కోలుకున్న కేసుల సంఖ్య 5,53,470 కు చేరుకుంది.

రికవరీ రేటు నేడు 63.02% కి మెరుగుపడింది. 19 రాష్ట్రాలు జాతీయ సగటు కంటే రికవరీ రేటు ఎక్కువగా ఉన్నాయి. అవి:

 

రాష్ట్రం/యు.టి 

రికవరీ రేటు 

రాష్ట్రం/యు.టి

రికవరీ రేటు

లడఖ్ (యు.టి) 

85.45%

త్రిపుర 

69.18%

ఢిల్లీ 

79.98%

బీహార్  

69.09%

ఉత్తరాఖండ్ 

78.77%

పంజాబ్ 

68.94%

చత్తిస్గఢ్ 

77.68%

ఒడిశా 

66.69%

హిమాచల్ ప్రదేశ్ 

76.59%

మిజోరాం 

64.94%

హర్యానా 

75.25%

అసోం 

64.87%

చండీగఢ్ 

74.60%

తెలంగాణ 

64.84%

రాజస్థాన్ 

74.22%

తమిళనాడు 

64.66%

మధ్యప్రదేశ్ 

73.03%

ఉత్తరప్రదేశ్ 

63.97%

గుజరాత్ 

69.73%

 

 

 

3,01,609 క్రియాశీల కేసులు ఉన్నాయి, అవన్నీ ఆసుపత్రులలో, కోవిడ్ సంరక్షణ కేంద్రాలలో లేదా ఇంట్లోనే ఐసొలేషన్ అయి వైద్య పర్యవేక్షణలో ఉన్నాయి. క్రియాశీల కేసుల కంటే 2,51,861 ఎక్కువ కోలుకున్న కేసులు ఉన్నాయి. క్లిష్టమైన కేసుల క్లినికల్ నిర్వహణపై మెరుగైన చర్యలతో అధిక దృష్టి పెట్టడంతో భారతదేశంలో మరణాల రేటు కూడా 2.64% కి దిగిపోయింది. ఎయిమ్స్ ఢిల్లీ కోవిడ్-19 నేషనల్ టెలికాన్సల్టేషన్ సెంటర్ ద్వారా డెడికేటెడ్ కోవిడ్ హాస్పిటల్స్ (DCH) ను కొనసాగిస్తోంది. 30 రాష్ట్రాలలో మరణాల రేటు జాతీయ సగటు కంటే తక్కువగా ఉంది.

 

రాష్ట్రం/యు.టి 

మరణాల రేటు 

రాష్ట్రం/యు.టి 

మరణాల రేటు 

మణిపూర్ 

0%

ఝార్ఖండ్ 

0.8%

నాగాలాండ్ 

0%

బీహార్ 

0.86%

దాద్రా-నగరహవేలీ దామన్ డయ్యు 

0%

హిమాచల్ ప్రదేశ్ 

0.91%

మిజోరాం 

0%

తెలంగాణ 

1.03%

అండమాన్ నికోబర్ దీవులు 

0%

ఆంధ్రప్రదేశ్ 

1.12%

సిక్కిం 

0%

పుదుచ్చేరి 

1.27%

లడఖ్ (యు.టి) 

0.09%

ఉత్తరాఖండ్ 

1.33%

త్రిపుర 

0.1%

తమిళనాడు 

1.42%

అసోం 

0.22%

హర్యానా 

1.42%

కేరళ 

0.39%

చండీగఢ్ 

1.43%

చత్తిస్గఢ్ 

0.47%

జమ్మూ కాశ్మీర్ (యు.టి)

1.7%

ఒడిశా 

0.49%

కర్ణాటక 

1.76%

అరుణాచల్ ప్రదేశ్ 

0.56%

రాజస్థాన్ 

2.09%

గోవా 

0.57%

పంజాబ్ 

2.54%

మేఘాలయ 

0.65%

ఉత్తరప్రదేశ్ 

2.56%

 

గత 24 గంటల్లో 2,19,103 నమూనాలను పరీక్షించారు. పరీక్షించిన నమూనాల సంచిత సంఖ్య 1,18,06,256. మిలియన్ మందికి గాను జరిగే పరీక్షల సంఖ్య  నిరంతరం పెరుగుతున్నాయి. ఆ సంఖ్య నేడు 8555.25 గా ఉంది. 

దేశంలోని టెస్టింగ్ ల్యాబ్ నెట్‌వర్క్ 1200 ల్యాబ్‌లతో మరింత బలోపేతం చేశారు; ప్రభుత్వ రంగంలో 852 ల్యాబ్‌లు, ప్రైవేట్ గా  348 ల్యాబ్‌లు. వీటితొ పాటు:

• రియల్ టైమ్ ఆర్ టి పిసిఆర్  ఆధారిత పరీక్ష ప్రయోగశాలలు: 626 (ప్రభుత్వం: 389 + ప్రైవేట్: 237) 

• ట్రూనాట్ ఆధారిత పరీక్షా ప్రయోగశాలలు: 474 (ప్రభుత్వం: 428 + ప్రైవేట్: 46) 

• CBNAAT ఆధారిత పరీక్షా ప్రయోగశాలలు: 100 (ప్రభుత్వం: 35 + ప్రైవేట్: 65) 

కోవిడ్-19 సంబంధిత సాంకేతిక సమస్యలు, మార్గదర్శకాలు, సలహాదారులపై అన్ని ప్రామాణికమైన మరియు నవీకరించిన సమాచారం కోసం దయచేసి క్రమం తప్పకుండా సందర్శించండి: https://www.mohfw.gov.in/ మరియు @ MoHFW_INDIA. 

కోవిడ్-19 కు సంబంధించిన సాంకేతిక ప్రశ్నలు పంపవచ్చు technicalquery.covid19[at]gov[dot]in మరియు ncov2019[at]gov[dot]in 

కోవిడ్-19 పై ఏవైనా ప్రశ్నలు ఉంటే, దయచేసి ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ హెల్ప్‌లైన్ నెం.: + 91-11-23978046 లేదా 1075 (టోల్ ఫ్రీ). COVID-19 లోని స్టేట్స్ / యుటిల హెల్ప్‌లైన్ సంఖ్యల జాబితా https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf వద్ద కూడా అందుబాటులో ఉంది.

****



(Release ID: 1638379) Visitor Counter : 165