ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ నుంచి కోలుకున్న వారు 5.3 లక్షలమంది, చికిత్సలో 2.9 లక్షలమంది
చికిత్సలో ఉన్నవారికంటే కోలుకున్నవారు 2.4 లక్షలు అధికం
గడిచిన 24 గంటల్లో కోలుకున్నవారు 19 వేల పైమాటే
ప్రతి పదిలక్షలమందికీ 8396.4 పరీక్షలు
Posted On:
12 JUL 2020 3:20PM by PIB Hyderabad
కోవిడ్ నివారణ, చికిత్స విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా తదేక దృష్టితో తీసుకుంటున్న చర్యలు, చేస్తున్న కృషి సత్ఫలితాలనిస్తున్నాయి. బాధితులను ముందస్తుగా గుర్తించటంలోను, సకాలంలో చికిత్స అందించటంలోను అప్రమత్తంగా వ్యవహరించటం వల్ల కోలుకుంటున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. గత 24 గంటల్లో 19,235 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోవిడ్ నుంచి కోలుకున్నవారి మొత్తం సంఖ్య 5,34,620 కు చేరింది. ఆ విధంగా కోలుకున్నవారి శాతం 62.93% కు పెరిగింది. .
అన్ని రకాల చర్యల కారణంగా మరింత మంది కొలుకుంటూ ఉండటంతో చికిత్సలో ఉన్నవారికంటే కోలుకుంటున్నవారి సంఖ్య 2,42,362 అధికంగా ఉంది. ప్రస్తుతం ఇంకా కోలుకోని 2,92,258 మందికి వైద్య బృందాలు చికిత్స అందిస్తూ ఉన్నాయి.
కోవిడ్ బాధితులకోసం చికిత్స అందించే ఆరోగ్య సదుపాయాలు కూడా పెరుగుతూ వచ్చాయి. ప్రత్యేకంగా కోవిడ్ కోసం నిర్దేశించిన ఆస్పత్రులు (డిసిహెచ్) 1370 కాగా, కోవిడ్ ఆరోగ్య కేంద్రాలు (డిసిహెచ్ సి) 3062, కోవిడ్ సంరక్షక కేంద్రాలు ( సిసిసి )10334 అందుబాటులో ఉన్నాయి.
ఈ కేంద్రాలు విజయవంతంగా పనిచేయటానికి కేంద్రం ఇప్పటివరకూ వివిధ రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకూ 122.36 లక్షల పిపిఇ కిట్లు, 223.33 లక్షల ఎన్95 మాస్కులు, 21,685 వెంటిలేటర్లు అందజేసింది.
కోవిడ్ పరీక్షల నిర్వహణకు ఎదురవుతున్న అన్ని రకాల అవరోధాలనూ తొలగించి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు విస్తృతంగా పరీక్షలు చేపట్టటానికి కేంద్రం తగిన చర్యలు తీసుకుంది. దీనివలన ప్రతిరోజూ నిర్వహించే పరీక్షల శాంపిల్స్ సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. గడిచిన 24 గంటల్లో 2,80,151 శాంపిల్స్ పరీక్షించగా ఇప్పటివరకు జరిపిన మొత్తం పరీక్షల సంఖ్య 1,15,87,153 కి చేరింది. ఫలితంగా ప్రతి పది లక్షల మంది జనాభాలో 8396.4 మందికి పరీక్షలు జరిపినట్టయింది.
దేసవ్యాప్తంగా పరీక్షల సంఖ్య పెరగటంలో కీలలమైన పాత్ర పోషించింది పెరుగుతున్న లాబ్ ల నెట్ వర్క్ అన్నది నిజం. నేటివరకూ దేశంలో ఉన్న లాబ్ ల సంఖ్య 1194 కాగా అందులో ప్రభుత్వ ఆధ్వర్యంలో 850, ప్రైవేట్ ఆధ్వర్యంలో 344 ఉన్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి:
తక్షణం ఫలితాలు చూపే పరీక్షల లాబ్స్ : 624 (ప్రభుత్వ: 388 + ప్రైవేట్: 236)
ట్రూ నాట్ ఆధారిత పరీక్షల లాబ్స్ : 472 (ప్రభుత్వ: 427 + ప్రైవేట్: 45)
సిబినాట్ ఆధారిత పరీక్షల లాబ్స్: 98 (ప్రభుత్వ: 35 + ప్రైవేట్63 )
కోవిడ్ -19 మీద సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, సూచనలతో కూడిన కచ్చితమైన తాజా సమాచారం కోసం క్రమం తప్పకుండా https://www.mohfw.gov.in/ మరియు @MoHFW_INDIA ను సందర్శించండి.
కోవిడ్ -19 కు సంబంధించిన సాంకేతికమైన అనుమానాలుంటే technicalquery.covid19[at]gov[dot]in కు పంపవచ్చు. ఇతర సమాచారం కావాల్సినవారు ncov2019[at]gov[dot]in మరియు @CovidIndiaSeva ను సంప్రదించవచ్చు.
కోవిడ్ -19 మీద ఏవైనా ప్రశ్నలుంటే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్ లైన్ నెంబర్ +91-11-23978046 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1075 కు ఫోన్ చేయవచ్చు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల హెల్ప్ లైన్ నెంబర్ల కోసం https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf చూడండి
***
(Release ID: 1638169)
Visitor Counter : 203
Read this release in:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Malayalam