ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
మోస్తరు నుంచి తీవ్రమైన కోవిడ్-19తో బాధపడుతున్న రోగులకు పరిమితం చేసిన అత్యవసర వినియోగానికి ఇటోలీజుమ్యాబ్ వాడేందుకు డీసీజీఐ అనుమతి
Posted On:
11 JUL 2020 12:22PM by PIB Hyderabad
కోవిడ్-19 రోగుల చికిత్సకు వాడేందుకు గాను డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) మరో ఔషధానికి అనుమతినిచ్చింది. తీవ్రమైన, దీర్ఘకాలిక చర్మవ్యాధి సోరియాసిస్ చికిత్స నిమిత్తం ఇప్పటికే ఆమోదించబడిన మోనోక్లోనల్ యాంటీబాడీ అయిన ఇటోలీజుమ్యాబ్ (ఆర్‌డీఎన్ఏ మూలం) ఔషధాన్ని క్లినికల్ ట్రయల్స్ డేటా ఆధారంగా కోవిడ్-19 రోగుల చికిత్సకు వినియోగించేందుకు గాను డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతులను మంజూరు చేసింది. మోస్తరు నుంచి తీవ్రమైన కోవిడ్-19 వ్యాధి లక్షణాలతో బాధపడుతున్న రోగులకు పరిమితం చేయబడిన అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతుల్ని మంజూరు చేసింది. మోస్తరు మరియు తీవ్రమైన దీర్ఘకాలిక సోరియాసిస్ చర్మ వ్యాధితో ఇబ్బందిపడుతున్న రోగుల చికిత్స కోసం మెస్సర్స్ బయోకాన్ సంస్థ
ఈ ఔషధాన్ని 2013 నుంచి అల్జుమాబ్ బ్రాండ్ పేరుతో తయారు చేసి మార్కెట్ చేస్తోంది. ఈ స్వదేశీ ఔషధాన్ని కోవిడ్-19 చికిత్సకు ఉపయోగపడేలా రీపర్పస్ చేయబడింది.
క్లినికల్ ట్రయల్స్ ఫలితాల ఆధారంగా అనుమతులు..
కోవిడ్-19 రోగులపై సంస్థ జరిపిన రెండవ దశ క్లినికల్ ట్రయల్ ఫలితాల్ని బయోకాన్ డీసీజీఐకి అందించింది. ఈ ట్రయల్స్ మొత్తం ఫలితాలను డీసీజీఐ కార్యాలయం యొక్క నిపుణుల కమిటీలో చర్చించారు. ఈ ఔషధం వాడకం వల్ల మరణాల నియంత్రణ ప్రాథమిక ఎండ్‌పాయింట్‌గాను, ఊపిరితిత్తులలో పీఏఓ2 మరియు ఆక్సిజన్ సంతృప్తత పెరిగి వాటి పనితీరు మెరుగయ్యే తీరును గురించి
డీసీజీఐకి తెలియజేశారు. కీలక ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ఐఎల్-6, టీఎన్ఏ α మొదలైనవి ఈ ఔషధం వాడకంతో గణనీయంగా తగ్గినట్లు తెలియజేయడమైంది. తద్వారా కోవిడ్-19 రోగులలో హైపర్-ఇన్ఫ్లమేషన్ నివారించవచ్చని తెలిపింది.
ఆయా అంశాలపై సమగ్రంగా చర్చించి, నిపుణుల కమిటీ చేసిన సిఫారసుల్ని పరిగణనలోకి తీసుకున్న తరువాత పరిమితం చేసిన అత్యవసర వినియోగం కింద ఈ ఔషధాన్ని వాడేందుకు గాను డీసీజీఐ అనుమతులను జారీ చేసింది.
కోవిడ్-19 కారణంగా మోస్తరు నుండి తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ (ఏఆర్‌డీఎస్) లోని సైటోకైన్ రిలీజ్ సిండ్రోమ్ (సీఆర్ఎస్) చికిత్స నిమిత్తం ఈ ఔషధాన్ని మార్కెట్ చేయడానికి అనుమతులు మంజూరు చేశారు.
అయితే ఈ ఔషధం వాడకానికి సంబంధించి డీసీజీఐ కొన్ని రకాల షరతులను విధించింది. ఈ ఔషధాన్ని వాడే ముందు రోగుల నుంచి రాతపూర్వక సమ్మతి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. దీనికి తోడు రిస్క్ మేనేజ్‌మెంట్ ప్లాన్, ఆసుపత్రిలో మాత్రమే ఉపయోగించడం వంటి మరికొన్ని షరతులకు లోబడి దీని వాడకానికి డీసీజీఐ అనుమతులను ఇచ్చింది. కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కోవిడ్-19 కొరకు క్లినికల్ మేనేజ్‌మెంట్ ప్రోటోకాల్‌లో సూచించిన “ఇన్వెస్టిగేషనల్ థెరపీస్” లో భాగమైన వివిధ ఔషధల చికిత్సల సగటు వ్యయం కంటే ఇటోలీజుమ్యాబ్ ఔషధంతో చికిత్స వ్యయం తక్కువగా ఉండనుంది.
***
(Release ID: 1637994)
Visitor Counter : 312
Read this release in:
Punjabi
,
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Tamil
,
Malayalam