ప్రధాన మంత్రి కార్యాలయం

కోవిడ్ -19 మహమ్మారికి వ్యతిరేకంగా సన్నాహాలపై సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించిన - ప్రధానమంత్రి.

Posted On: 11 JUL 2020 1:33PM by PIB Hyderabad

దేశంలోని కోవిడ్ 19 పరిస్థితిని గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈరోజు సమీక్షించారు.  ఈ సమీక్షా సమావేశంలో గౌరవనీయులైన హోంమంత్రి శ్రీ అమిత్ షా,  కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్,  నీతీ ఆయోగ్ సభ్యుడుక్యాబినెట్ కార్యదర్శి తో పాటు భారత ప్రభుత్వంలోని ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు

దేశంలోని వివిధ ప్రాంతాలలో పరిస్థితులను, వివిధ రాష్ట్రాల సంసిద్ధతను ప్రధానమంత్రి అడిగి తెలుసుకున్నారు.  బహిరంగ ప్రదేశాల్లో వ్యక్తిగత పరిశుభ్రత మరియు సామాజిక క్రమశిక్షణను పాటించాల్సిన అవసరాన్ని మనం తప్పక పునరుద్ఘాటించాలని ప్రధానమంత్రి ఆదేశించారు.  కోవిడ్ గురించి ప్రజల్లో విస్తృతమైన అవగాహన కల్పించాలనీ, వైరస్ వ్యాప్తిని నివారించడానికి నిరంతర ప్రాధాన్యత ఇవ్వాలనీ, ఆయన సూచించారు.  ఈ విషయంలో ఎలాంటి ఆత్మసంతృప్తికీ అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. 

ఢిల్లీలో, మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేయడంలో కేంద్ర, రాష్ట్ర, స్థానిక అధికారుల కృషిని ప్రధానమంత్రి ప్రశంసించారు.  మొత్తం ఎన్.‌సి.ఆర్ ప్రాంతంలో కోవిడ్ -19 మహమ్మారి వ్యాప్తిని నియంత్రించడంలో కూడా ఇతర రాష్ట్ర ప్రభుత్వాలతో ఇలాంటి విధానాన్ని అనుసరించాలని ఆయన ఆదేశించారు.

అహ్మదాబాద్‌లో ‘ధన్వంత్రి రథ్ ’ ద్వారా నిర్వహిస్తున్న నిఘా మరియు గృహ ఆధారిత సంరక్షణను విజయవంతమైన ఉదాహరణగా ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇతర ప్రదేశాలలో కూడా ఈ విధానాన్ని అవలంబించవచ్చునని ఆయన సూచించారు.   ఎక్కువ సంఖ్యలో కోవిడ్ పాజిటివ్ కేసులు ఉన్న అన్ని ప్రభావిత రాష్ట్రాలు, ప్రదేశాలకు రియల్ టైమ్ జాతీయ స్థాయి పర్యవేక్షణ మరియు మార్గదర్శకత్వం అందించాలని కూడా ప్రధానమంత్రి ఆదేశించారు.

*****(Release ID: 1637975) Visitor Counter : 45