హోం మంత్రిత్వ శాఖ
ఆసియాలోకెల్లా అతిపెద్ద 750 మెగావాట్ల రేవా సౌర విద్యుత్‌ప్రాజెక్టును జాతికి అంకితం చేసినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
భవిష్యత్ అవసరాలకు ఎంతో కీలకమైన ఈ ప్రాజెక్టు, శ్రీ నరేంద్ర మోదీ ప్రభుత్వ ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతను మరింత బలపరుస్తోంది :- కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా
2022 నాటికి పునరుత్పాదక ఇంధనానికి సంబంధించి 175 గిగావాట్ల స్థాపిత సామర్ధ్యాన్ని సాధించే భారతదేశపు లక్షిత సంకల్పాన్ని రేవా సౌరవిద్యుత్ ప్రాజెక్టు పునరుద్ఘాటిస్తొందన్న కేంద్ర హోం మంత్రి అమిత్‌షా
Posted On:
10 JUL 2020 4:16PM by PIB Hyderabad
ఆసియాలోకెల్ల అతిపెద్ద 750 మెగా వాట్ల రేవా సౌర విద్యుత్ ప్రాజెక్టును జాతికి అంకితం చేసినందుకు,ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి, కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా కృతజ్ఞతలు తెలిపారు.
ఈమేరకు ఆయన ట్విట్టర్‌ద్వారా ఒక సందేశం ఇస్తూ, ఈ ప్రాజెక్టు భవిష్యత్ అవసరాలకు ఎంతో కీలకమైనదని, శ్రీనరేంద్ర మోదీ ప్రభు్త్వ ఆత్మనిర్భర భారత్ దార్శనికతను ఇది పునరుద్ఘటిస్తున్నదని పేర్కొన్నారు.
2022 నాటికి 175 గిగా వాట్ల (జిడబ్ల్యు) స్థాపిత పునరుత్పాదక శక్తి సామర్ధ్యాన్ని సాధించేదిశగా భారతదేశపు సంకల్పాన్ని రేవా సౌరవిద్యుత్ ప్రాజెక్టు పునరుద్ఘాటిస్తున్నదని హోంమంత్రి తెలిపారు.
భవిష్యత్తులో ఇండియా ఇంధన భద్రత విషయంలొ స్వావలంబన సాధించేందుకు, ప్రస్తుతం జాతికి అంకితం చేసిన 750 మెగా వాట్ల (ఎం.డబ్ల్యు) రేవా సౌర విద్యుత్ ప్రాజెక్టు మరో ముందడుగుగా చెప్పుకోవచ్చు. ఫ్రాన్సులోని పారిస్ లో ఐక్యరాజ్య సమితి 21వ సెషన్ సందర్భంగా, వాతావరణ మార్పులపై జరిగిన కాన్ఫరెన్సు ఆఫ్ పార్టీస్ ( సిఒపి-21)లో ఇంటర్నేషనల్ సోలార్ అలయెన్సు ను, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2015 నవంబర్ 30న ప్రారంభించారు.
***
(Release ID: 1637793)
Visitor Counter : 209