మంత్రిమండలి
ఉజ్వలా లబ్ధిదారులు "ప్రధాన మంత్రి గారిబ్ కళ్యాణ్ యోజన" యొక్క ప్రయోజనాలను పొందే గడువును మరో మూడు నెలలు పొడిగించేందుకు కేంద్ర మంత్రివర్గం సమ్మతి
పొడిగింపు జులై 1 నుంచి అమలులోకి వచ్చేలా సమ్మతి తెలిపిన క్యాబినెట్
Posted On:
08 JUL 2020 4:27PM by PIB Hyderabad
ఉజ్వలా లబ్ధిదారులు "ప్రధాన మంత్రి గారిబ్ కళ్యాణ్ యోజన" ప్రయోజనాలను పొందే గడువును మరో మూడు నెలలు పొడిగించేందుకు గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం తన ఆమోదం తెలిపింది. జులై 1 నుంచి దీనిని మూడు నెలలు పొడిగించేందుకు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ చేసిన ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం తన సమ్మతిని తెలిపింది. కోవిడ్ మహమ్మారి కారణంగా తీవ్రంగా నష్టపోయిన పేదలు మరియు బలహీన వర్గాల ప్రజలకు గాను తగిన సామాజిక భద్రతను అందించే లక్ష్యంతో ప్రభుత్వం "ప్రధాన మంత్రి గారిబ్ కళ్యాణ్ యోజన" అనే ఉపశమన ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కేంద్ర ప్యాకేజీలో పీఎంయూవై కింద దేశంలో ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్‌ను పొందిన పేదల కుటుంబాలకు తగిన ఉపశమనం అందించే అంశం కూడా ఉంది. పీఎంజీకేవై - ఉజ్వలా కింద, పీఎంయూవై వినియోగదారులకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి మరో మూడు నెలల కాలానికి ఉచితంగా ఎల్‌పీజీ రీఫిల్ సిలిండర్ అందించాలని నిర్ణయించారు
. ఈ పథకం కింద ఏప్రిల్- జూన్ మాసాలలో ఉజ్వలా లబ్ధిదారుల రూ.9709.86 కోట్ల సొమ్మును నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి బదిలీ చేయడమైంది. దీనికి తోడు 11.97 కోట్ల సిలిండర్లు పీఎంయూవై లబ్ధిదారులకు పంపిణీ చేయబడ్డాయి. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా కలిగే బాధలు, అంతరాయాలను దూరం చేయడంలో ఈ పథకం చాలా మెరుగ్గా దోహదపడింది. ఈ పథకాన్ని సమీక్షించినప్పుడు, పీఎంయూవై లబ్ధిదారులలో ఒక విభాగం ప్రజలు పథకం అమలు వ్యవధిలో సిలిండర్ రీఫిల్ కొనుగోలు చేయడానికి.. తమతమ ఖాతాలో జమ చేసిన అడ్వాన్స్ సొమ్మును ఇంకా ఉపయోగించుకోలేదన్న విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అడ్వాన్స్ పొందడానికి కాల పరిమితిని మూడు నెలల వరకు పొడిగించాలని కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ క్యాబినెట్‌కు పంపింది. విషయాన్ని సమీక్షించిన క్యాబినెట్ ఈ ప్రతిపాదనకు తన ఆమోదం తెలిపింది.
ఈ నిర్ణయంతో ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్‌ను కొనుగోలు చేసినందుకు ఇప్పటికే ముందస్తుగా సొమ్మును పొంది రీఫిల్‌ను కొనుగోలు చేయలేకపోయిన పీఎంయూవై లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనుంది. కేంద్ర క్యాబినెట్ తాజా నిర్ణయంతో ముందస్తుగా తమ ఖాతాల్లో సొమ్ము బదిలీ పొంది లబ్ధిదారులు.. ఇప్పుడు సెప్టెంబర్ 30 వరకు ఉచిత రీఫిల్ సిలిండర్ డెలివరీ తీసుకోనే వేసులుబాటు కలుగనుంది.
****
(Release ID: 1637393)
Visitor Counter : 233
Read this release in:
Punjabi
,
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam