ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ నుంచి కోలుకున్న శాతం వేగంగా పెరుగుదల, నేటికి 61.53%


చికిత్సలో ఉన్నవారికంటే కోలుకున్నవారు 2 లక్షల పైమాటే

గత 24 గంటల్లో 2.6 లక్షల శాంపిల్స్ కు పైగా పరీక్షలు

Posted On: 08 JUL 2020 4:48PM by PIB Hyderabad

కోవిడ్ పరీక్షలు జరుపుతున్న శాంపిల్స్ సంఖ్య రోజురీజుకూ గణనీయంగా పెరుగుతూ వస్తోంది. గడిచిన 24 గంటల్లో 2,62,679 శాంపిల్స్ పరీక్షించారు. అంటే, వాటిలో ప్రైవేటు లాబ్ లలో జరపిన పరీక్షలకంటే 53,000  ఎక్కువ.  దీంతో ఇప్పటివరలూ జరిపిన మొత్తం పరీక్షల సంఖ్య 1,04,73,771 కు చేరింది. ఆ విధంగా చూసినప్పుడు ప్రతి పది లక్షల మందికీ 7180 మందిని పరీక్షించినట్టు లెక్క. కేంద్రం రాష్ట్రప్రభుత్వాలతో కలిసి అనుసరిస్తున్న "పరీక్షించు, ఆనవాలు గుర్తించి, చికిత్స అందించు "  అనే త్రిముఖ వ్యూహం ఫలితంగా సాధ్యమైందని భావించాలి.
చెప్పుకోదగిన స్థాయిలో కోవిడ్ పరీక్షలు జరగటంలో కీలకమైన అంశం దేశ వ్యాప్తంగా లాబ్ ల సంఖ్య పెరగటమే. ప్రభుత్వ రంగంలో 795  లాబ్ లు, ప్రైవేట్ రంగంలో 324 లాబ్ లు ప్రస్తుతం పనిచేస్తుండగా మొత్తం సంఖ్య 1119 కి చేరింది. అవి ఈ విధంగా ఉన్నాయి:
 

  • తక్షణం ఫలితాలు చూపే పరీక్షల లాబ్స్ : : 600  (ప్రభుత్వ: 372  + ప్రైవేట్:  228)
  • ట్రూ నాట్ ఆధారిత పరీక్షల లాబ్స్ : 426 (ప్రభుత్వ: 390   + ప్రైవేట్: 36)
  • సిబినాట్ ఆధారిత పరీక్షల లాబ్స్: 93 (ప్రభుత్వ: 33  + ప్రైవేట్: 60)

ఆరోగ్య పరిరక్షణ మౌలిక సదుపాయాలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. ఐసియు, ఆక్సిజెన్ అనుబంధ పడకలు, వెంటిలేటర్లు తదితర పరికరాలు బాగా అందుబాటులో ఉంటున్నాయి.  సకాలంలొ బాధితుల గుర్తింపు, పాజిటివ్ కేసులకు సమర్థమైన చికిత్స  అందించటానికి ఈ సౌకర్యాలు బాగా ఉపయోగపడుతున్నాయి. బాధితులు కోలుకోవటం, చికిత్సలో ఉన్నవారికంటే చాలా ఎక్కువమంది కొలుకున్నట్టు నమోదు కావటం వీటి ఫలితాలే. ైప్పుడు చికిత్సలో ఉన్నవారికంటే 1,91,886 మంది ఎక్కువగా కోలుకున్నవారు ఉన్నారు.

గడిచిన 24 గంటల్లో 16,883 మంది బాధితులు కోలుకోగా ఇప్పటివరకు మొత్తం కోలుకున్నవారి సంఖ్య 4,56,830 కు చేరింది. కోలుకుంటున్నవారిశాతం కూడా బాగా పెరుగుతూ వస్తోంది. ఈరోజుకు అది 61.53% చేరింది.

ప్రస్తుతం 2,64,944 మంది కోవిడ్ బాధితులుందగా వారందరికీ డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స అందుతోంది.

కోవిడ్ -19 మీద సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, సూచనలతో కూడిన కచ్చితమైన తాజా సమాచారం కోసం క్రమం తప్పకుండా https://www.mohfw.gov.in/ మరియు  @MoHFW_INDIA ను సందర్శించండి.

కోవిడ్ -19 కు సంబంధించిన సాంకేతికమైన అనుమానాలుంటే technicalquery.covid19[at]gov[dot]in కు పంపవచ్చు. ఇతర సమాచారం కావాల్సినవారు ncov2019[at]gov[dot]in మరియు @CovidIndiaSeva ను సంప్రదించవచ్చు.


కోవిడ్ -19 మీద ఏవైనా ప్రశ్నలుంటే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్ లైన్ నెంబర్  +91-11-23978046 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1075 కు ఫోన్ చేయవచ్చు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల హెల్ప్ లైన్ నెంబర్ల కోసం   https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf  చూడండి

****

 



(Release ID: 1637331) Visitor Counter : 212