రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

పెళ్లికాని దివ్యాంగులైన కుమారులు 25 సంవత్సరాలు పైబడిన తరువాత కూడా ఈ.సి.హెచ్.ఎస్. సౌకర్యాలకు అర్హులు


Posted On: 08 JUL 2020 12:52PM by PIB Hyderabad

పెళ్లికాని, ఆర్థికంగా ఆధారపడి, 25 ఏళ్ళు నిండిన తర్వాత శాశ్వతంగా దివ్యాంగులైన ఈ.సి.హెచ్.ఎస్. లబ్ధిదారుల కుమారులను ఇంతవరకు ఆధారపడినవారుగా పరిగణించలేదు. అందువల్ల వీరికి, మాజీ సైనికుల కంట్రిబ్యూటరీ ఆరోగ్య పధకం (ఈ సి.హెచ్.ఎస్.) కింద వైద్య సదుపాయాలు పొందటానికి అర్హత లేదు.  ఇది కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సి.జి.హెచ్.ఎస్) నిబంధనల ప్రకారం ఇ.సి.హెచ్.ఎస్. కు కూడా వర్తిస్తుంది.

అయితే, 2020 జనవరి, 1వ తేదీ నాటి వారి ఓ.ఎం. నెం.4-24/96-సి&పి/సి.జి.హెచ్.ఎస్.(పి)/ఈ.హెచ్.ఎస్. ప్రకారం పెళ్లికాని, ఆర్థికంగా ఆధారపడి, 25 ఏళ్ళు నిండిన తర్వాత శాశ్వతంగా దివ్యాంగులైన ఈ.సి.హెచ్.ఎస్. లబ్ధిదారుల కుమారులను కూడా ఇప్పుడు ఆధారపడినవారుగా సి.జి.హెచ్.ఎస్. పరిగణించింది. అందువల్ల, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (ఎమ్.ఓ.హెచ్.ఎఫ్.డబ్ల్యూ) ఆఫీస్ మెమోరాండం (ఓ.ఎం) నెం.4-24/96-సి&పి/సి.జి.హెచ్.‌ఎస్(పి)/ఈ.హెచ్.ఎస్., తేదీ 05.05.2018 నాటి షరతులకు లోబడి సి.జి.హెచ్.‌ఎస్. ప్రయోజనాలను పొందటానికి వారు కూడా అర్హులు.

పెళ్లికాని, ఆర్థికంగా ఆధారపడి, 25 ఏళ్ళు నిండిన తర్వాత శాశ్వతంగా దివ్యాంగులైన ఈ.సి.హెచ్.ఎస్. లబ్ధిదారుల కుమారులను కూడా ఇప్పుడు ఆధారపడినవారుగానూ మరియు వారికి 2018 మే నెల 7వ తేదీ నాటి ఎమ్.ఓ.హెచ్.ఎఫ్.డబ్ల్యూ. కు చెందిన ఎం.ఓ. లో పేర్కొన్న నిబంధనలకు లోబడి ఈ.సి.హెచ్.ఎస్. కింద ప్రయోజనాలు పొందడానికి వారు అర్హులని  రక్షణ మంత్రిత్వ శాఖ (ఎమ్.ఓ.డి) పరిధిలోని మాజీ సైనికుల సంక్షేమ శాఖ (డి.ఈ.ఎస్.డబ్ల్యూ) నిర్ణయించింది.

*****


(Release ID: 1637231) Visitor Counter : 277