ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోటి మైలురాయి దాటిన కోవిడ్ పరీక్షలు


1100 దాటిన కోవిడ్‌ ప్రయోగశాలల సంఖ్య

4.24 లక్షలకు పైగా కోలుకున్న బాధితులు, చికిత్సలో ఉన్నవారికంటే 1.7 లక్షలు అధికం

జాతీయ స్థాయిలో 60.86% చేరుకున్న కోలుకున్నవారి శాతం

Posted On: 06 JUL 2020 6:01PM by PIB Hyderabad

కోవిడ్ తాజా పరిణామాలలో భాగంగా మొత్తం పరీక్షల సంఖ్య కోటి మైలురాయి దాటటం విశేషం. నిర్థారణ పరీక్షలకు అత్యధిక ప్రాధాన్యమివ్వటం తెలిసిందే. పరీక్షలు, గుర్తింపు, చికిత్స అనే వ్యూహంలో భాగంగా ప్రజలకోసం అనేక చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే కోవిడ్ పరీక్షలకు ఎదురవుతున్న అనేక ప్రతిబంధకాలను తొలగించారు. దీంతో ప్రతిరోజూ పరీక్షల సంఖ్య పెరుగుతూ వస్తోంది. గడిచిన 24  గంటల్లో  3,46,459 పరీక్షలు జరపగా ఇప్పటిదాకా చేసిన పరీక్షల సంఖ్య 1,01,35,525 కు చేరింది.


దేశ వ్యాప్తంగా కోవిడ్ పరీక్షల లాబ్ ల నెట్ వర్క్ ను విస్తృతం చేసేందుకు భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎం ఆర్) చర్యలు తీసుకుంటున్నది.  దీని ఫలితంగానే పరీక్షల సంఖ్య పెంపు సాధ్యమైంది. రోజూ లాబ్ ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇప్పుడు భారత్ లో మొత్తం లాబ్ ల సంఖ్య  1105  కు చేరింది. వీటిలో  788  ప్రభుత్వ లాబ్ లు  కాగా,  317 ప్రయివేట్ లాబ్ లు. ప్రస్తుత పరిస్థితి ఇలా ఉంది:

  • తక్షణం ఫలితాలు చూపే పరీక్షల లాబ్స్ : 592 (ప్రభుత్వ: 368  + ప్రైవేట్:  223)
  • ట్రూ నాట్ ఆధారిత పరీక్షల లాబ్స్ : 421 (ప్రభుత్వ: 387    + ప్రైవేట్: 34)
  • సిబినాట్ ఆధారిత పరీక్షల లాబ్స్: 92  (ప్రభుత్వ: 33  + ప్రైవేట్: 59)

భారత ప్రభుత్వం వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో కలిసి తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తలు, సానుకూల చర్యలు తగిన ఫలితాలు ఇస్తున్నాయి. కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య ఈ రోజుకు 4,24,432  కు పెరిగింది.  గడిచిన 24 గంటల్లో మొత్తం 15,350  మంది కోవిడ్ బాధితులు కోలుకున్నారు.  
ప్రస్తుతం కోవిడ్ తో చికిత్స పొందుతున్నవారి కంటే కోలుకున్నవారే 1,71,145 మంది ఎక్కువగా ఉన్నారు. దీంతో జాతీయ స్థాయిలో కోలుకున్నవారి శాతం 60.86% కు చేరినట్టయింది.

ప్రస్తుతం ఇంకా 2,53,287 మంది బాధితులుండగా వారందరికీ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స జరుగుతోంది.

కోవిడ్ -19 మీద సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, సూచనలతో కూడిన కచ్చితమైన తాజా సమాచారం కోసం క్రమం తప్పకుండా https://www.mohfw.gov.in/ మరియు  @MoHFW_INDIA ను సందర్శించండి.
కోవిడ్ -19 కు సంబంధించిన సాంకేతికమైన అనుమానాలుంటే technicalquery.covid19[at]gov[dot]in కు పంపవచ్చు. ఇతర సమాచారం కావాల్సినవారు ncov2019[at]gov[dot]in మరియు @CovidIndiaSeva ను సంప్రదించవచ్చు.

కోవిడ్ -19 మీద ఏవైనా ప్రశ్నలుంటే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్ లైన్ నెంబర్  +91-11-23978046 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1075 కు ఫోన్ చేయవచ్చు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల హెల్ప్ లైన్ నెంబర్ల కోసం   https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf  చూడండి

 

******

 


(Release ID: 1636913) Visitor Counter : 296