సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
ఏఎస్ఐ కి చెందిన అన్ని కేంద్రీకృత రక్షిత స్మారక చిహ్నాలు 2020 జూలై 6 నుండి తెరుచుకోనున్నాయి: శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్
ప్రార్థనా స్థలాలయిన ఏఎస్ఐ 820 కేంద్ర రక్షిత స్మారక చిహ్నాలు ఇప్పటికే 8 జూన్ 2020 న ప్రారంభమయ్యాయి
Posted On:
03 JUL 2020 4:49PM by PIB Hyderabad
2020 జూలై 6 నుండి భద్రతా ప్రోటోకాల్‌లను పూర్తిగా పాటించడం ద్వారా కేంద్ర రక్షిత స్మారక చిహ్నాలను తెరవాలని కేంద్ర సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రిత్వ శాఖ (ఎఎస్‌ఐ) నిర్ణయించిందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర ఛార్జ్) శ్రీప్రహ్లాద్ సింగ్ పటేల్ ప్రకటించారు. కాని కంటైన్మెంట్ కానీ ప్రదేశాలలో స్మారక చిహ్నాలు / మ్యూజియంలు మాత్రమే సందర్శకుల కోసం తెరుచుకుంటాయి. అన్ని కేంద్రీకృత రక్షిత స్మారక చిహ్నాలు, సైట్లు పరిశుభ్రత, సామాజిక దూరం, గృహ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఇతర ఆరోగ్య ప్రోటోకాల్‌లకు కట్టుబడి ఉంటాయి. రాష్ట్ర,/ జిల్లా పరిపాలన కు సంబంధించిన నిర్దిష్ట ఆదేశాలు కూడా ఖచ్చితంగా అమలు అవుతాయి.
కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ఈ స్మారక చిహ్నాలు మూసివేశారు. మొత్తం 3691 కేంద్ర రక్షిత స్మారక చిహ్నాలు ఏఎస్ఐ పరిధిలోకి వస్తాయి, వీటిలో 820 కేంద్ర రక్షిత స్మారక చిహ్నాలు 2020 జూన్ 8 న ప్రారంభమయ్యాయి.
అన్ని కేంద్ర రక్షిత స్మారక చిహ్నాలు, మ్యూజియంలను తెరవడానికి ఆర్కియోలాజికల్ సర్వే అఫ్ ఇండియా విడుదల చేసిన ఎస్ఓపి కోసం లింక్‌ను క్లిక్ చేయండి
సందర్శకుల సూచనల కోసం లింక్‌ను క్లిక్ చేయండి
*****
(Release ID: 1636243)
Visitor Counter : 258