ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 తాజా సమాచారం
60% చేరువలో కోలుకున్నవారి శాతం
చికిత్సలో ఉన్నవారి కంటే లక్షా 20 వేలు అధికంగా కోలుకున్నవారు
Posted On:
30 JUN 2020 2:37PM by PIB Hyderabad
భారత ప్రభుత్వం వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో కలిసి తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తలు, సానుకూల చర్యలు తగిన ఫలితాలు ఇస్తున్నాయి. దీంతో కోవిడ్ నుంచి కోలుకున్నవారి శాతం 60% కి దగ్గరవుతోంది. కోవిడ్ తో ఇంకా చికిత్స పొందుతున్నవారి కంటే కోలుకున్నవారు 1,19,696 మంది ఎక్కువగా ఉన్నారు.
ప్రస్తుతం 2,15,125 మంది చికిత్సలో ఉండగా వారికి వైద్యులు నిరంతర సేవలందిస్తున్నారు. ఇప్పటివరకు 3,34,821 మంది చికిత్స పూర్తి చేసుకొని కోలుకోవటంతో డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటిదాకా కోలుకున్నవారిశాతం 59.07% కు చేరింది.
గడిచిన 24 గంటల్లో మొత్తం 13,099 మంది కోవిడ్-19 రోగులకు నయమైంది.
దేశ వ్యాప్తంగా కోవిడ్ పరీక్షల లాబ్ ల్ నెట్ వర్క్ ను విస్తృతం చేసేందుకు భారత వైద్య పరిశోధనామండలి(ఐసీఎం ఆర్) చర్యలు తీసుకుంటున్నది. ఇప్పుడు భారత్ లో మొత్తం లాబ్ ల సంఖ్య 1049 కు చేరింది. వీటిలో 761 ప్రభుత్వ లాబ్ లు, 288 ప్రయివేట్ లాబ్ లు. ప్రస్తుత పరిస్థితి ఇలా ఉంది.
- తక్షణం ఫలితాలు చూపే పరీక్షల లాబ్స్ : 571 (ప్రభుత్వ: 362 + ప్రైవేట్: 209)
- ట్రూ నాట్ ఆధారిత పరీక్షల లాబ్స్ : 393 (ప్రభుత్వ: 367 + ప్రైవేట్: 26)
- సిబినాట్ ఆధారిత పరీక్షల లాబ్స్: 85 (ప్రభుత్వ: 32 + ప్రైవేట్: 53)
పరీక్షలు కూడా బాగా పుంజుకున్నాయి. గడిచిన 24 గంటల్లో 2,10,292 శాంపిల్స్ కు పరీక్షలు జరిగాయి. దీంతో ఇప్పటివరలు జరిపిన పరీక్షల సంఖ్య 86,08,654 కు చేరింది
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ పరిధిలోని జాతీయ రక్తమార్పిడి మండలి ఈ కోవిడ్ సంక్షోభ సమయంలో రక్తమార్పిడి సేవలందించటంలో పాటించాల్సిన రెండో విడత మధ్యంతర .మార్గదర్శకాలను విడుదలచేసింది. ఆ సమాచారాన్ని ఈ వెబ్ సైట్ లో చూడవచ్చు
https://www.mohfw.gov.in/pdf/2ndNBTCGuidanceinLightofCOVID19Pandemic.pdf
కోవిడ్ -19 మీద సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, సూచనలతో కూడిన కచ్చితమైన తాజా సమాచారం కోసం క్రమం తప్పకుండా https://www.mohfw.gov.in/ మరియు @MoHFW_INDIA ను సందర్శించండి.
కోవిడ్ -19 కు సంబంధించిన సాంకేతికమైన అనుమానాలుంటే technicalquery.covid19[at]gov[dot]in కు పంపవచ్చు. ఇతర సమాచారం కావాల్సినవారు ncov2019[at]gov[dot]in మరియు @CovidIndiaSeva ను సంప్రదించవచ్చు.
కోవిడ్ -19 మీద ఏవైనా ప్రశ్నలుంటే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్ లైన్ నెంబర్ +91-11-23978046 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1075 కు ఫోన్ చేయవచ్చు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల హెల్ప్ లైన్ నెంబర్ల కోసం https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf చూడండి
****
(Release ID: 1635421)
Visitor Counter : 196
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam