సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

నష్టాల్లో ఉన్న ఎం ఎస్ ఎం ఇ రంగం కోసం నిధులిచ్చే మరో పథకం


రెండు లక్షల సంస్థలకోసం రూ. 20 వేల కోట్ల హామీ

నడుస్తూ నష్టాల్లో కూరుకుపోయిన వాటికి అదనపు రుణసౌకర్యం

Posted On: 24 JUN 2020 4:32PM by PIB Hyderabad

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు అండగా నిలబడుతూ, వాటిలో అప్పుల్లో కూరుకుపోయిన వాటికి అదనంగా రుణాలిచ్చేలా ఋణహామీ పథకాన్ని  ఎంఎస్ ఎం ఇ శాఖామంత్రి నితిన్ గడ్కరీ ఈ రోజు ప్రారంభించారు. అప్పుల్లో కూరుకుపోవటం వలన ముందుకు వెళ్లలేకపోతున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు మరింత బాంకు రుణం లభించేలా రూ. 20,000 కోట్ల హామీ ఇవ్వటం ఈ పథకం ప్రత్యేకత. ఆవిధంగా ఈ మేరకు బాంకులు ఆయా సంస్థలలో వాటా తీసుకొని పెట్టుబడిపెడతాయి.

 

అప్పుల్లో కూరుకుపోయిన ఎంఎస్ ఎం ఇ లకు అప్పుగాని, పెట్టుబాడి గాని దొరక్కపోవటం అతిపెద్ద సవాలుగా మారినట్టు గుర్తించటంతో ఆత్మ నిర్భర్ పాకేజ్ లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. 2020 మే 13న ఆర్థికమంత్రి చేసిన ప్రకటనలో అప్పుల్లో కూరుకుపోయిన ఎంఎస్ ఎం ఇ ల గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే. నడుస్తూ ఉండి అప్పుల్లో పడిన సంస్థలను మళ్ళీ గాడిలో పెట్టటానికి ఈ పథకం రూపొందించారు. ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ ఉపసంఘం నుంచి ఆమోదం, ఆర్థిక మంత్రిత్వశాఖ. సిడ్బీ, రిజర్వ్ బాంక్ అధికారులతో  సమాలోచనలు పూర్తయ్యాక మంత్రి శ్రీ గడ్కరీ ఈ రోజు నాగ్ పూర్ లో లాంఛనంగా పథకాన్ని ప్రారంభించారు.

 

ఈ పథకంలోని ముఖ్యాంశాలు:

 

  • 2020 ఏప్రిల్ 30 నాటికి అప్పుల్లో పడి నడపటం సమస్యగా మారిన ఎంఎస్ ఎం ఇ యూనిట్ల ప్రమోటర్లకు మద్దతు ఇవ్వటం ఈ పథకం లక్ష్యం
  • సంస్థలో 15% వాటా లేదా రూ. 75 లక్షల్లో ఏది తక్కువైతే దానికి సరిపడేంత మొత్తాన్ని ప్రమోటర్లకు అప్పుగా ఇస్తారు.
  • ప్రమోటర్లు ఈ మొత్తాన్ని తమ ఎం ఎస్ ఎం ఇ యూనిట్ లో వెచ్చించటం ద్వారా ద్రవ్యత్వాన్ని పెంచుకొని అప్పు-మూలధనం నిష్పత్తిని కాపాడుకుంటారు.
  • ఈ మొత్తానికి 90% హామీ పథకం ద్వారా లభిస్తుండగా మిగిలిన 10% ప్రమోటర్లు భరించాలి.
  • ఇందులో అసలు తిరిగి చెల్లించటానికి పదేళ్ళ గడువు ఇస్తుండగా అందులో మొదటి ఏడేళ్ళు మారటోరియం సౌకర్యం ఉంటుంది.
  • ఈ పథకం ద్వారా దాదాపు రెండు లక్షల ఎంఎస్ ఎం ఇ యూనిట్లు లబ్ధి పొందుతాయని భావిస్తున్నారు. దీనివలన ఈ రంగంలో ఆర్థిక వ్యవస్థ కోలుకోవటానికి దోహదం చేసినట్టవుతుంది.  వీటిమీద ఆధారపడిన లక్షలాది మంది ఉద్యోగుల జీవనోపాథిని కూడా కాపాడినట్టవుతుంది. అర్హతలున్న ఎంఎస్ ఎం ఇ ప్రమోటర్లు ఏ షెడ్యూల్డ్ వాణిజ్య బాంకునైనా సంప్రదించి ఈ పథకం కింద లబ్ధి పొందవచ్చు. ఈ పథకాన్ని సిజిటిఎంఎస్ ఇ ద్వారా నిర్వహిస్తారు. సాధారణంగా ఎదురయ్యే ప్రశ్నలకు జవాబులతోబాటు మార్గదర్శకాలను ఈరోజు జారీ చేశారు.

 

ఈ సందర్భంగా ప్రధానికి, ఆర్థిక శాఖామంత్రికి శ్రీ నితిన్ గడ్కరీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఆర్థికసేవల శాఖ అధికారులకు, రిజర్వ్ బాంకు గవర్నర్ కు కూడా ఈ వినీత్న పథకానికి మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.

 

*******(Release ID: 1634059) Visitor Counter : 105