సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
ఆయుష్ నిపుణులతో కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వర్చువల్ సమావేశం
Posted On:
23 JUN 2020 8:07PM by PIB Hyderabad
సమీకృత వైద్యంలోని గొప్పదనమే కోవిడ్ సంక్షోభానికి పరిష్కారమని మరోమారు తేలిందని కేంద్రమంత్రి దాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు ఇక్కడ జరిగిన వర్చువల్ సమావేశంలో అభిప్రాయపడ్డారు. రానున్న రోజుల్లో ఈ కోణాన్ని తీవ్రంగా పరిగణించాల్సి వస్తుందని, అప్పుడే సమర్థవంతమైన మందులు, చికిత్స అందుబాటులోకి రాగలవని అన్నారు.
భారతదేశంలో పేరుమోసిన ఆయుష్ నిపుణులందరితో ఈ రోజు ఢిల్లీలో ఒక వర్చువల్ సమావేశం జరిగింది. బెంగళూరు వివేకానంద కేంద్రం అధిపతి డాక్టర్ నాగేంద్ర ఆచార్య, కొచ్చి లోని త్రిస్సూర్ కు చెందిన సీతారామ్ ఆయుర్వేదిక్ ఆస్పత్రి డాక్టర్ రామనాథన్, అలీగఢ్ ముస్లిమ్ యూనివర్సిటీ యునాని మెడికల్ సైన్సెస్ కన్సల్టెంట్ డాక్టర్ జమీర్ అహ్మద్, న్యూ ఢిల్లీలోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ అండ్ అలైడ్ సైన్సెస్ హోమియోపథిక్ కన్సల్టెంట్ డాక్టర్ అశోక్ శర్మ ఈ సమావేశంలో పాల్గొన్నారు. మంత్రి వీరి నుద్దేశించి మాట్లాడుతూ అంటువ్యాధులు కాని వ్యాధుల విషయంలోనూ, మధుమేహంలోనూ సమీకృత వైద్య విధానం తగిన ఫలితాలివ్వటాన్ని గుర్తు చేశారు. అయితే, దీనికి తగినంత స్పందన, గుర్తింపు రాలేదన్నారు. నిజానికి ఇన్సులిన్, అల్లోపతి మాత్రల కంటే ఈ మందుల ప్రభావం గణనీయంగా ఉన్నట్టు తగినన్ని ఆధారాలు, పరిశోధన పత్రాలు ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో వాడటం లేదన్నారు. యోగా, నాచురోపతి వంటివి కూడా ఏకకాలంలో అనుసరిస్తే అద్భుత ఫలితాలుంటాయని అభిప్రాయపడ్డారు.
బాధితుడి రోగ నిరోధక శక్తిమీద ఆధారపడి వచ్చే కోవిడ్ లాంటి వైరల్ వ్యాధి విషయంలోనూ రోగ నిరోధకశక్తి పెంచుకోవటానికే ప్రాధాన్యమివ్వాలని రుజువైందన్నారు. హోమియోపతి తదితర వైద్య విధానాల విస్తృత వినియోగం ద్వారా రోగ నిరోధక శక్తి పెంచుకోవటమనే అంశం సహజంగానే ప్రత్యామ్నయ వైద్య విధానాల పట్ల ఆసక్తిపెంచుతోందన్నారు.
ఈ వర్చువల్ సమావేశంలో డాక్టర్ నాగేంద్ర ఆచార్య తన ప్రసంగంలో యోగాభ్యాసం తీరుతెన్నులలో నూతన పోకడలను వివరించారు. వివిధ వయోవర్గాల వారు అనుసరించాల్సిన యోగాసనాల గురించి చెబుతూ ఆస్పత్రులలో ఉన్న 60 ఏళ్ల లోపు వారు, 60 ఏళ్ళు పైబడినవారు వేరు వేరు ఆసనాలు అభ్యాసం చేయాలన్నారు. వాళ్ళకోసం నిర్దేశిమ్చిన యోగాసనాలన్నీ కేవలం పావుగంటలో పూర్తి చేయగలిగేవేనన్నారు.
******
(Release ID: 1633812)
Visitor Counter : 213