గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

కోవిడ్ 19 నేపథ్యంలో నివాసాల కేటాయింపుదారులకు 15 రోజుల సడలింపు

Posted On: 23 JUN 2020 5:59PM by PIB Hyderabad

ప్రభుత్వ గృహ వసతి వాడుకుంటున్నవారు ఇప్పుడున్న కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో జులై 15 వరకు వాటిలోనే ఉండవచ్చు. ఈ మేరకు గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ నివాస భవనాల కేటాయింపు దారులకు అదనంగా 15 రోజుల అవకాశం కల్పించింది. అంతకుముందు మే 5న ఇచ్చిన ఆదేశాల ప్రకారం పొడిగింపు జూన్ ఆఖరు వరకు ఉండగా ఇప్పుడు అదనంగా మరో 15 రోజులు ఇచ్చింది. కొత్త ఇళ్ళు అద్దెకు తీసుకోవటంలో ఎదురవుతున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ కేటాయింపు దారులు పంపుకున్న వినతి పత్రాలను మంత్రిత్వశాఖ పరిగణనలొకి తీసుకుంది. కోవిడ్ కారణంగా ఇళ్లలోను సామాను బదలాయింపుకు కార్మికులు అందుబాటులో లేకపోవటం లాంటి సమస్యలను వారు తమ వినతిపత్రాల్లో పేర్కొన్నారు. దీంతో వీరంతా ఖాళీ చేయటానికి గడువును జులై 15 వరకూ పొడిగిస్తూ, ఆ తరువాత కొనసాగిన పక్షంలో జరిమానా/మార్కెట్ అద్దె వసూలు చేయాల్సి ఉంటుందని జూన్ 22  నాటి ఆఫీస్ మెమొరాండం నెం.12035/2/2020 లో పేర్కొంది.

 

*****

 



(Release ID: 1633730) Visitor Counter : 227