రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
భారతదేశంలో అతిపెద్ద, తొలి వర్చువల్ హెల్త్‌కేర్, హైజిన్ ఎక్స్‌పో 2020ను ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీ మాండవీయ
ఐదు రోజులపాటు జరిగే ఈ ఎక్స్‌పో , ఆయుష్, వెల్‌నెస్, వైద్య పరికరాలు, మెడికల్‌టెక్స్‌టైల్స్,వినియోగవస్తువులు,ఔషధాలు, పరిశుభ్రత, పారిశుద్యానికి సంబంధించిన అంశాలపై దృష్టిపెడుతుంది
Posted On:
22 JUN 2020 4:05PM by PIB Hyderabad
షిప్పింగ్ (స్వతంత్ర), రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీ మన్‌సుఖ్ మాండవీయ ఈరోజు భారతదేశపు తొలి అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ, పరిశుభ్రత ఎక్స్‌పో 2020ను ప్రారంభించారు. ఈ ఎక్స్‌పొను పిక్కి ఏర్పాటు చేసింది.
ఈ ఈవెంట్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు. ఇది22 జూన్ ,2020 నుంచి 2020 జూన్ 26 వరకూ రోజూ వర్చువల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఉంటుంది. ఈ వర్చవల్ ఎక్స్‌పోకు ఝాన్సీ పార్లమెంటు సభ్యులు,ఫిక్కీ ఆయుష్ కమిటీ ఛైర్మన్ శ్రీ అనురాగ్ శర్మ, ఫిక్కి అధ్యక్షులు డాక్టర్ సంగీతా రెడ్డి, ప్రముఖ క్రీడాకారి పి.వి.సింధు, ఫిక్కి వైద్య పరికరాల ఫోరం ఛైర్మన్ శ్రీ బద్రి అయ్యంగార్, వివిధ పరిశ్రమల నుంచి ఇతర ప్రతినిధులు ఈ వర్చువల్ ఎక్స్‌పో లో పాల్గొన్నారు.
భారతదేశంలో ఏర్పాటైన తొలి వర్చువల్ ఎగ్జిబిషన్ ఇది. ఈ రకమైన ఎక్స్‌పోలకు ఇది వినూత్న ప్రారంభంగా చెప్పుకోవచ్చు. ఇదొక కొత్త విధానం,ఇందులో వ్యాపారాలు వర్చువల్‌గా జరుగుతాయి.ఇందుకు డిజిటల్ ఇండియా మార్గం సుగమం చేస్తున్నది.
ఈ ఎక్స్‌పో ప్రారంభోత్సవం సందర్బంగా మాట్లాడుతూ మంత్రి, స్వావలంబిత భారత్ కు అనువైన వాతావరణాన్ని నిర్మిస్తున్నట్టు చెప్పారు.ఇది దేశీయంగా ఫార్మసూటికల్ , ఆరోగ్యం, పరిశుభ్రతా రంగం ఉత్పత్తిని పెంచడానికి ఉపకరిస్తుందన్నారు. కోవిడ్ -19 మహమ్మారిపై మనం సాగిస్తున్న తిరుగులేని పోరాటంలో ఆరోగ్యం, పరిశుభ్రత , పారిశుధ్యం, వైద్య వస్త్రాలు,ఉపకరణాలు, ఆయుష్, వెల్‌నెస్ రంగాలకు ఎంతో ప్రాధాన్యత ఉందని చెప్పారు. ప్రధానమంత్రి ఆదేశాల మేరకు 2014 నుంచి ఈ దిశగా తీసుకున్న వివిధ చర్యలను మంత్రి వివరించారు. ప్రతి ఇంటికీ టాయిలెట్ సదుపాయం కల్పించడం, ఆరోగ్య సంరక్షణ కల్పించేందుకు పది కోట్ల కుటుంబాలకు ఆయుష్మాన్ భారత్ సదుపాయం కల్పించడం, స్వచ్ఛభారత్ అభియాన్, సువిధా శానిటరీ నాప్‌కిన్ తదితరాల గురించి ఆయన వివరించారు. తక్కువ ధరకే నాణ్యమైన ఔషధాలను ప్రతి ఒక్కరికీ అందజేస్తున్న జన్ ఔషధి స్టోర్స్ గురించి కూడా ఆయన తెలిపారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రభుత్వ గట్టి సంకల్పం, దార్శనికత వల్లే ఇవన్నీ సాధ్యమయ్యాయని మాండవీయ వివరించారు.
మహిళల మెరుగైన ఆరొగ్య ప్రాధాన్యత గురించి ప్రముఖంగా ప్రస్తావిస్తూ మంత్రి, ఈ అంశంపై ప్రతిఒక్కరూ శ్రద్దపెట్టి పనిచేయాలన్నారు. సువిధ శానిటరీ నాప్‌కిన్‌లు జన ఔషధి స్టోర్లలో ప్యాడ్ ఒక్కొక్కటి రూపాయికే లభ్యమౌతున్న విషయాన్నిఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇలాంటి చర్యలు దేశ మహిళల ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రతకు పూచీపడతాయని ఆయన చెప్పారు. శరీరదారుఢ్యం, పరిశుభ్రత ఆరోగ్యసంరక్షణ రంగంలో అంతర్భాగమని ప్రముఖ క్రీడా కారిణి పి.వి.సింధు అన్న మాటలతో మంత్రి ఏకీభవించారు. "ఆరోగ్యంగా ఉండాలంటే శారీరదారుఢ్యం ఉండడమే కాకుండా , క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని" ఆయన అన్నారు.
దేశంలో వైద్య పరికరాల పార్కు ,బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు ప్రోత్సాహకాలు ఇస్తూ ప్రభుత్వం ఇటీవల చేసిన ప్రకటనను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈక్విటీ పార్టిసిపేషన్ ద్వారా ప్రైవేటు రంగం ఇలాంటి పార్కులు ఏర్పాటు చేయదలచుకుంటే ప్రైవేటు రంగానికి సహాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన అన్నారు.ఇలాంటి ప్రకటనలు ప్రధానమంత్రి ప్రకటించిన ఆత్మనిర్భర భారత్ అభియాన్ చట్రంలో ఎలా పనిచేస్తాయో వివరించారు.
కోవిడ్ నియంత్రణకు కృషి చేస్తున్న ఫ్రంట్‌లైన్ వర్కర్లు, డాక్టర్లు, నర్సులు, పోలీసుల కృషిని మంత్రి ఈ సందర్బంగా ప్రశంసించారు.
ప్రస్తుత సవాళ్లను అవకాశాలుగా మలచుకుని ప్రస్తుత అవకాశాలను అందిపుచ్చుకున్న తయారీ రంగానికి చెందిన వారిని అంటే, ఆరోగ్య రంగ మౌలిక సదుపాయాల పెంపు, బెడ్ల ఏర్పాటు, పిపిఇ కిట్లు, మాస్కులు, వెంటిలేటర్లు, ఉపకరణాల తయారీ వంటి రంగాలలోని వారిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. భారత పారిశ్రామిక రంగం ప్రభుత్వంతో భుజం, భుజం కలిపి నడుస్తోందని మంత్రి అన్నారు.
శ్రీ మాండవీయ, ఆయుష్ ప్రయోజనాల గురించి కూడా మాట్లాడారు. ఆయుష్ సూచనల మేరకు తయారు చేసే ఔషధాలు, శరీర శక్తిని పెంపొందిస్తాయని అన్నారు. కరోనా ను ఎదుర్కోవడంలో ప్రభుత్వ చేపడుతున్న చర్యలకు సంప్రదాయ ఔషధాలు ఎంతో కీలకపాత్ర పోషిస్తున్నాయని ఆయన అన్నారు.
******
(Release ID: 1633451)
Visitor Counter : 315