సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 19 నుండి 21 తేదీ 2020 వరకు నమస్తే యోగా కార్యక్రమాన్ని నిర్వహించనున్న కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

పప్రంచ యోగా దినోత్సవం 2020 రోజున 10 మిలియన్ల సూర్య నమస్కారాలు మరియు నమస్తే యోగా (#10MillionSuryaNamaskar మరియు # NamasteYoga) హ్యాష్ ట్యాగ్లను ఉపయోగించి తనతోపాటు సూర్యనమస్కారాలను చేయవలసిందిగా ప్రజలను కోరిన కేంద్ర మంత్రి శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్

Posted On: 20 JUN 2020 1:50PM by PIB Hyderabad

కేంద్ర సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ(స్వతంత్ర) మంత్రి  శ్రీ ప్రహ్లాద్ పటేల్ ప్రపంచ యోగా దినోత్సవం (21 జూన్ 2020)న పురానా ఖిలా వద్ద సూర్య నమస్కారాలను చేయబోతున్నారని  అదే సమయంలో తనతోపాటుగా ప్రజలందరూ వారి వారి ఇళ్ళ వద్ద నుండే ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని ఆయన కోరారు.  ప్రపంచ యోగా దినోత్సవం ప్రధాన మంత్రి శ్రీ నరేద్ర మోడీ గారు ప్రపంచానికి ఇచ్చిన బహుమతియని ప్రతీ ఒక్కరూ తమ నిత్య జీవితంలో యోగా సాధనను చేయాలని ఆయన అన్నారు.

సామాజిక మాధ్యమంలో ఆయన తన సందేశాన్ని పోస్ట్ చేసి ప్రజలందరూ  వారి వారి యోగా సాధన వీడియోను #10MillionSuryaNamaskar & #NamasteYoga ద్వారా సామాజిక మాధ్యమ వేదికలో పోస్టు చేయడం వలన అది  ప్రజల్లో ఆరోగ్య అవగాహన పెంచడానికి ఒక ఉద్యమంగా రూపుదిద్దుకుంటుందని అన్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖా మంత్రి వర్యుల సందేశానికి సామజిక మాధ్యమంలో మంచి స్పంద లభిస్తోంది. ప్రపంచ యోగా దినోత్సవం రోజున సుమారు 10 మిలియన్ల ప్రజలు సూర్య నమస్కారాలను చేస్తారని ఆయన ఆశిసున్నట్లు ఆయన తెలిపారు.

 

Prahlad Singh Patel@prahladspatel

विश्व योग दिवस पर अपने घर पर योग ज़रूर करें, हमारे साथ सूर्य नमस्कार कर का उपयोग कर video डालकर, आप सभी को शामिल होने के लिए आमंत्रित करता हूँ इसमें @MinOfCultureGoI@BeCureFit@ficci_india शामिल है@PMOIndia

Embedded video

635

7:48 PM - Jun 19, 2020

Twitter Ads info and privacy

187 people are talking about this

 

 

ప్రతీ ఒక్కరి జీవితంలో యోగా  తప్పనిసరి సాధనగా చేయాలనే లక్ష్యంతో  ప్రపంచ యోగా దినోత్సవం 2020 సందర్భంగా జూన్ 19వ తేదీ నుండి 21వ తేదీ 2020 వరకు నమస్తే యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది కేంద్ర సాంస్కృతిక శాఖ.

 

 

 

*******



(Release ID: 1632885) Visitor Counter : 221