రైల్వే మంత్రిత్వ శాఖ

5 రాష్ట్రాల్లో 960 కోవిడ్ కేర్ కోచ్ లను అందుబాటులో ఉంచిన భారతీయ రైల్వే ఢిల్లీలో 9 స్థానాల్లో 503 కోచ్‌లను మోహరింపు

భారతీయ రైల్వే, జాతీయ ప్రయోజనానికి తన వంతు బాధ్యతగా రైల్వే కోచ్లను కోవిడ్ కేర్ సెంటర్లుగా మార్చింది

2020 మే 6న ఎంఓహెచ్ఎఫ్ డబ్ల్యూ జారీ చేసిన ప్రామాణిక ఆపరేటింగ్ విధానాల ప్రకారం వైద్యులు, పారామెడిక్స్‌ను
రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చాలి

రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు సహాయం చేయడానికి రైల్ కోచ్‌ల ప్రతి స్థానానికి 2 అనుసంధాన అధికారులను రైల్వే నియమించనున్నది

ఉన్న వాతావరణ పరిస్థితుల్లో కోచ్‌ల లోపల సౌకర్యవంతమైన ఉష్ణోగ్రతను నిర్వహించడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి

కోవిడ్ రోగుల సంరక్షణలో సహాయపడటానికి అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వానికి రైల్వే సహాయం చేస్తుంది

Posted On: 17 JUN 2020 5:45PM by PIB Hyderabad

కోవిడ్ -19 కి వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగిస్తూ, రాష్ట్ర ప్రభుత్వాల ఆరోగ్య సంరక్షణ ప్రయత్నాలను భర్తీ చేయడానికి భారతీయ రైల్వే అన్ని ప్రయత్నాలు చేస్తోంది. భారతీయ రైల్వే తన 5231 కోవిడ్ కేర్ రైల్ కోచ్ లను  రాష్ట్రాలకు అందించడానికి సన్నద్ధమైంది. జోనల్ రైల్వే ఈ కోచ్‌లను కోవిడ్ కేర్ సెంటర్‌గా చాలాతేలికపాటి / తేలికపాటి కేసులకు ఉపయోగించడానికి మార్పు చేసింది. 

ప్రస్తుతానికి, రైల్వే 5 రాష్ట్రాల్లో మొత్తం 960 కోవిడ్ కేర్ కోచ్ లని అందుబాటులోకి తెచ్చింది. అవి ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్. మొత్తం 960 కోవిడ్ కేర్ కోచ్ లలో 503 కోవిడ్ కేర్ కోచ్ లను ఢిల్లీలో, ఆంధ్రప్రదేశ్ లో 20, తెలంగాణలో 60, ఉత్తర ప్రదేశ్ లో 372, మధ్యప్రదేశ్ లో 5 అందుబాటులో ఉంచారు.

ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడలో మొత్తం 20 కోవిడ్ కేర్ కోచ్‌లను మోహరించగా, తెలంగాణలో మొత్తం 60 కోవిడ్ కేర్ కోచ్‌లను సికింద్రాబాద్, కాచిగూడా, ఆదిలాబాద్.

రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞాపన మేరకు ఈ కోచ్ లను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా సమకూర్చింది భారతీయ రైల్వే. 

                             ***


(Release ID: 1632216) Visitor Counter : 228