హోం మంత్రిత్వ శాఖ
గాల్వాన్ లోయ ఘటనలో అమరవీరులైన భారత జవాన్లకు నివాళులు అర్పించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
అమరవీరుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపిన హోంమంత్రి
సైనికులు చూపిన తెగువ, దేశ రక్షణ కోసం వారిలో ఉన్న నిబద్ధతకు దర్పణం: అమిత్ షా
భారత సైన్యానికి గొప్ప ధీశాలులను అందించిన కుటుంబాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా: అమిత్ షా
ఈ శోక సమయంలో యావత్ భారతదేశం ఆ వీరుల కుటుంబాలకు అండగా ఉంటుంది: అమిత్ షా
గాయపడిన సైనికులు వేగంగా కోలుకోవాలని ఆకాక్షించిన అమిత్ షా
प्रविष्टि तिथि:
17 JUN 2020 5:52PM by PIB Hyderabad
గాల్వాన్ లోయ వద్ద చైనా సైన్యంతో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన భారత జవాన్లకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులు అర్పించారు. "వీర సైనికులను కోల్పోయిన బాధను మాటల్లో వర్ణించలేను. దేశాన్ని సురక్షితంగా ఉంచేందుకు ప్రాణాలను త్యాగం చేసిన హీరోలకు దేశం మొత్తం అభివాదం చేస్తోంది. భారత భూభాగం పట్ల దేశం చూపుతున్న నిబద్ధతకు వారి తెగువ నిదర్శనం" అని అమిత్ షా అన్నారు.
"భారత సైన్యానికి గొప్ప ధీశాలులను అందించిన కుటుంబాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. వారి అత్యున్నత త్యాగాన్ని దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. ఈ శోక సమయంలో యావత్ భారతదేశం, కేంద్ర ప్రభుత్వం అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటుంది. గాయపడిన సైనికులు వేగంగా కోలుకోవాలని ఆకాక్షిస్తున్నా" అని అమిత్ షా చెప్పారు.
***
(रिलीज़ आईडी: 1632203)
आगंतुक पटल : 221