యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

భారత ఒలింపిక్ పనితీరు ఇంకా విస్తరించేలా ఖెలో ఇండియా స్టేట్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ (కెఐఎస్సిఈ) ను ఏర్పాటు చేయడానికి

క్రీడా మంత్రిత్వ శాఖ సన్నద్ధం : శ్రీ కిరణ్ రిజిజు

మొదటి దశలో ఎనిమిది రాష్ట్రాల్లో ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న క్రీడా సౌకర్యాలను మంత్రిత్వ శాఖ గుర్తించింది

Posted On: 17 JUN 2020 11:06AM by PIB Hyderabad

ప్రధానమైన ఖేలో ఇండియా పథకం కింద ఖేలో ఇండియా స్టేట్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ (కిస్సిఇ) ను ఏర్పాటు చేయడానికి క్రీడా మంత్రిత్వ శాఖ సిద్ధంగా ఉంది. మొత్తం రాష్ట్రంలో ఒక బలమైన క్రీడా పర్యావరణ వ్యవస్థను రూపుదిద్దే ప్రయత్నంతో ప్రతి రాష్ట్ర, కేంద్ర పరిథిల్లొ ఒక కెఐఎస్సిఈ ని గుర్తిస్తారు. మొదటి దశలో, కర్ణాటక, ఒడిశా, కేరళ, తెలంగాణ, ఈశాన్య రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్లతో సహా భారతదేశంలోని ఎనిమిది రాష్ట్రాల్లో ప్రభుత్వ యాజమాన్యంలోని క్రీడా సౌకర్యాలను మంత్రిత్వ శాఖ గుర్తించింది. వీటిని ఖేల్ ఇండియా స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా స్థాయి పెంచుతారు. 

రాష్ట్రాల్లో క్రీడా సౌకర్యాలను బలోపేతం చేసే ఈ ప్రయత్నం గురించి కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి శ్రీ కిరణ్ రిజిజు మాట్లాడుతూ, “ఒలింపిక్స్‌లో రాణించాలన్న భారతదేశ ప్రయత్నాన్ని బలోపేతం చేయడానికి ఖెలో ఇండియా స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటైంది. భారతదేశంలోని ప్రతి రాష్ట్రంలో లభించే అత్యుత్తమ క్రీడా సౌకర్యాలను ప్రపంచ స్థాయి ప్రమాణాల అకాడమీలుగా పెంచడం మా ప్రయత్నం, ఇక్కడ దేశవ్యాప్తంగా ఉన్న క్రీడాకారులు తమ నిర్దిష్ట విభాగంలో శిక్షణ పొందాలనుకుంటున్నారు. ప్రభుత్వ కమిటీ లోతైన విశ్లేషణ తర్వాత క్రీడా సౌకర్యాలు గుర్తించారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిభను  వెలికి తీయడంతో పాటు అన్ని ప్రధాన అంతర్జాతీయ టోర్నమెంట్లలో, ప్రత్యేకంగా ఒలింపిక్స్‌లో దేశానికి పతకాలు సాధించగల ఉన్నత క్రీడాకారులకు శిక్షణ ఇవ్వడానికి ఇది సరైన దిశలో ఒక అడుగు అని నాకు నమ్మకం ఉంది. ” అని శ్రీ కిరణ్ రిజుజు అన్నారు.  క్రీడా సౌకర్యాలు ఎంపిక చేసే విధానం అక్టోబర్ 2019 లో ప్రారంభమయ్యాయి. పరిశీలించిన 15 ప్రతిపాదనలలో, ప్రాధాన్యత క్రీడల మౌలిక సదుపాయాల లభ్యత, కేంద్రం తయారు చేసే ఛాంపియన్లలో లభించే శిక్షణా సౌకర్యాల ఆధారంగా 8 ప్రతిపాదనలు తుది ఎంపికగా ఖరారయ్యాయి.  

సమగ్ర అధ్యయనం తర్వాత సూచించిన అవసరానికి అనుగుణంగా, ఖరారు చేసిన వాస్తవ మొత్తం ఆధారంగా ఎనిమిది కేంద్రాలకు గ్రాంట్ ఇవ్వబడుతుంది. బ్రాడ్-బేస్ టాలెంట్ ఐడెంటిఫికేషన్ కోసం, రాష్ట్రాలు, యుటిలు ప్రతి క్రీడలో ప్రతిభను గుర్తించి అభివృద్ధి చేస్తాయి, దీని కోసం కేంద్రం నిధులు అందుతాయి. అథ్లెట్ల పనితీరు స్థాయి అంతర్జాతీయ ప్రమాణాలకు మెరుగుపడేలా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నైపుణ్యం, వనరులు, పర్యవేక్షణ వ్యవస్థను విస్తరిస్తుంది.

మొదటి బ్యాచ్‌లో, ఖేలో ఇండియా స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు ఈ కింద వాటి స్థాయి పెంచుతారు:

సంగే లాడెన్ స్పోర్ట్స్ అకాడమీ, ఇటానగర్, అరుణాచల్ ప్రదేశ్ 

జైప్రకాష్ నారాయణ్ నేషనల్ యూత్ సెంటర్, బెంగళూరు,కర్ణాటక

జివి రాజా సీనియర్ సెకండరీ స్పోర్ట్స్ స్కూల్, తిరువనంతపురం, కేరళ 

ఖుమాన్ లంపక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఇంఫాల్, మణిపూర్ 

రాజివ్ గాంధీ స్టేడియం ఐజావాల్, మిజోరాం 

కళింగ స్టేడియం , భువనేశ్వర్, ఒడిశా 

స్టేట్ స్పోర్ట్స్ అకాడమీ ఐజి స్టేడియం, కోహిమా, నాగాలాండ్ 

రీజినల్ స్పోర్ట్స్ స్కూల్, హకీంపేట, తెలంగాణ. 

 

*******



(Release ID: 1632165) Visitor Counter : 221