హోం మంత్రిత్వ శాఖ

కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఆదేశాల మేర‌కు ఢిల్లీలోని ఆసుపత్రులలో కోవిడ్‌-19తో మ‌రణించిన రోగుల అంత్య‌క్రియ‌ల ప్ర్ర‌క్రియ‌ వేగ‌వంతం

Posted On: 16 JUN 2020 8:36PM by PIB Hyderabad

కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా ఆదేశాల మేర‌కు ఢిల్లీలోని అన్ని ఆసుపత్రులు (కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేట్) కోవిడ్‌-19 కార‌ణంగా మృతి చెందిన రోగుల మృత దేహాల‌కు అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించే ప్ర్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేశాయి. కోవిడ్‌-19 కార‌ణంగా మృతి చెందిన రోగుల దహన సంస్కారాలు / అంత్యక్రి‌య‌ల‌ను వేగ‌వంతంగా నిర్వ‌హించాల‌ని ఈ నెల 14 న కేంద్ర హోం శాఖ మంత్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ నిర్ణ‌యానికి క‌ట్టుబ‌డి ఢిల్లీలో ఉన్న‌ అన్ని ఆసుపత్రులు ఈ రోజు అంత్య‌క్రియ‌ల‌ను, అంతిమ సంస్కారపు ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేశారు. ఆసుపత్రి సిబ్బంది వారు కోవిడ్ -19 కార‌ణంగా మ‌ర‌ణించిన వారికి సంబంధిత‌ కుటుంబికులు మరియు వారి బంధువుల సమ్మతితో / వారి బంధువుల స‌మ‌క్షంలో చివరి కర్మలు నిర్వ‌హించారు. మిగిలిన 36 మంది క‌రోనా మృతుల
స‌న్నిహిత బంధువులు ఢిల్లీలో అందుబాటులో లేని కార‌ణంగా వారి చివరి కర్మలు రేప‌టికి వాయిదా వేయ‌బ‌డ్డాయి. దీంతో వీరి అంతిమ సంస్కారాలు రేపు జ‌రుగనున్నాయి. క‌రోనాతో మృతి చెందిన వారి చివరి కర్మలు చేయడంలో జాప్యం జరగకూడదని ఆసుపత్రి వ‌ర్గాల వారికి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కఠినమైన ఆదేశాల‌ను జారీ చేసిన సంగ‌తి విదిత‌మే. 

***


(Release ID: 1631999) Visitor Counter : 301