ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 పై తాజా సమాచారం
పరీక్షలు చేసే సామర్థ్యం పెరిగింది, రోజుకు 3 లక్షల పరీక్షల స్థాయికి చేరుకుంది.
Posted On:
16 JUN 2020 1:11PM by PIB Hyderabad
పెద్ద సంఖ్యలో పడకల లభ్యత, క్లిష్టమైన ఆరోగ్య సంరక్షణ సదుపాయాలను సులభతరం చేయడానికీ మరియు అందించిన సేవలకు న్యాయమైన మరియు పారదర్శక ఛార్జీలను నిర్ధారించడానికీ వీలుగా ప్రైవేటు ఆరోగ్య సంరక్షణ సంస్థలతో సంప్రదింపులు జరపాలని, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాలను కోరింది.
ఈ విషయంలో తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్ వంటి కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే తగిన చర్యలు తీసుకున్నాయి. ఆసుపత్రుల్లో చేరిన కోవిడ్-19 రోగులకు అందించే సౌకర్యాలకు , క్లిష్టమైన వైద్య సంరక్షణకు సహేతుకమైన రేట్లు నిర్ణయించే విషయమై, వారు ప్రైవేటు రంగాలతో చర్చలు జరిపారు. కోవిడ్-19 రోగులకు సత్వరంగా, మంచి నాణ్యతతో కూడిన సహేతుకమైన ఆరోగ్య సంరక్షణను అందించడంలో ఇది సహాయపడుతుంది. ప్రైవేటు రంగంలో ఆరోగ్య సంరక్షణ అందించే సంస్థలతో సంప్రదింపులు జరిపి, ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆరోగ్య సంరక్షణ సదుపాయాలను పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను కోరింది.
దేశంలో వ్యాధి లక్షణాలు కనబడిన వ్యక్తులలో నోవెల్ కరోనా వైరస్ గుర్తించే పరీక్ష సామర్థ్యం నిరంతరం పెరుగుతోంది. దేశం ఇప్పుడు రోజుకు 3 లక్షల నమూనాలను పరీక్షించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇప్పటివరకు పరీక్షించిన మొత్తం నమూనాల సంఖ్య 59,21,069 కాగా, గత 24 గంటల్లో 1,54,935 నమూనాలను పరీక్షించారు.
ఇంతవరకు దేశంలో 907 ప్రయోగశాలలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 659 ప్రయోగశాలలు ప్రభుత్వ రంగంలోనూ, 248 ప్రయోగశాలలు ప్రయివేటు రంగంలోనూ పనిచేస్తున్నాయి.
వివరాలు ఈ విధంగా ఉన్నాయి :
* రియల్ టైమ్ ఆర్.టి-పి.సి.ఆర్. ఆధారిత పరీక్షా ప్రయోగశాలలు : 534 (ప్రభుత్వ: 347 + ప్రయివేటు: 187)
* ట్రూ నాట్ ఆధారిత పరీక్షా ప్రయోగశాలలు : 302 (ప్రభుత్వ: 287 + ప్రయివేటు: 15)
* సి.బి.నాట్ ఆధారిత పరీక్షా ప్రయోగశాలలు : 71 (ప్రభుత్వ: 25 + ప్రయివేటు: 46)
ఢిల్లీలో పరీక్షా సామర్థ్యాన్ని పెంచడానికి, 11 జిల్లాలలో ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున సంబంధిత జిల్లాలకు చెందిన నమూనాలను ప్రత్యేకంగా పరీక్షించడానికి ప్రయోగశాలలను కేటాయించడం జరిగింది. సకాలంలో పరీక్షలు నిర్వహించడానికీ మరియు ఆలస్యం చేయకుండా ఫలితాలను పొందడానికీ, ప్రతి జిల్లా నుండి నమూనాలను ఆ యా జిల్లాలకు కేటాయించిన ప్రయోగశాలలు పంపుతున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో 42 ప్రయోగశాలలు, రోజుకు సుమారు 17,000 పరీక్షల సామర్ధ్యతో సేవలందిస్తున్నాయి.
రియల్ టైమ్ పి.సి.ఆర్.(ఆర్.టి-పి.సి.ఆర్) అనేది కోవిడ్-19 నిర్ధారణ కోసం బంగారం లాంటి ప్రామాణిక ఫ్రంట్‌లైన్ పరీక్ష. దేశవ్యాప్తంగా ఉన్న ఈ 907 ప్రయోగశాలలను, పరీక్ష సామర్ద్యాన్ని పెంపొందించుకోవడం కోసం ఉపయోగించవచ్చు. అయితే, ఈ పరీక్షలకు ప్రత్యేకమైన ప్రయోగశాల సౌకర్యాలు అవసరమవుతాయి, మరియు నమూనాలను ఈ అత్యాధునిక ప్రయోగశాలలకు పంపడానికి పట్టే సమయంతో సహా ఫలితాలు పొందడానికి, కనీసం 2-5 గంటలు పడుతుంది. ట్రూ నాట్ మరియు సి.బి.నాట్ పరికరం చిన్నగా ఎక్కడికైనా తీసుకువెళ్ళడానికి వీలుగా ఉండడంతో మారుమూల ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించడానికి కూడా ఇది సమర్ధవంతంగా ఉపయోగించబడుతోంది.
విశ్వసనీయత, సున్నితత్వం మరియు విశిష్టతను కోల్పోకుండా పరీక్షలను మరింత సరసమైన ధరలతో మరియు పరీక్షల సంఖ్యను పెంచే ప్రయత్నంలో, ఐ.సి.ఎం.ఆర్. పాయింట్-ఆఫ్-కేర్ రాపిడ్ యాంటిజెన్ డిటెక్షన్ టెస్ట్ కు సంబంధించి ఒక అడ్వైజరీ (సూచనలను) జారీ చేసింది.
ఆ వివరాలను ఇక్కడ చూడవచ్చు:
https://www.icmr.gov.in/pdf/covid/strategy/Advisory_for_rapid_antigen_test_14062020_.pdf
రాపిడ్ యాంటిజెన్ పరీక్షను కఠినమైన వైద్య పర్యవేక్షణలో కంటైన్మెంట్ జోన్లు మరియు ఆసుపత్రులలో ఉపయోగించవచ్చు. ప్రామాణిక క్యూ కోవిడ్-19 ఏ.జి. డిటెక్షన్ కిట్ ద్వారా ఫలితాలు పొందడానికి 15 నిమిషాలు పడుతుంది. అందువల్ల వ్యాధిని ముందుగా గుర్తించడంలో ఇది సహాయపడుతుంది. నమూనా సేకరించిన తర్వాత ఒక గంటలోపు నమూనా సేకరణ స్థలంలోనే యాంటిజెన్ పరీక్షను నిర్వహించవచ్చు. ప్రస్తుతం, మన దేశంలో యాంటిజెన్ టెస్ట్ కిట్ల తయారీ సామర్థ్యం నెలకు 10 మిలియన్లు చొప్పున ఉంది. రాపిడ్ యాంటిజెన్ టెస్ట్ కిట్లను రాష్ట్రాలు సులభంగా సేకరించడానికి వీలుగా, దేశీయ తయారీదారులు ప్రభుత్వ ఇ-మార్కెట్ ప్లేస్ (జి.ఇ.ఎం) పోర్టల్‌కు ఆన్‌బోర్డ్‌లో ఉండేలా కేంద్రం భరోసా ఇస్తోంది.
ఎలిసా మరియు క్లియా యాంటీబాడీ పరీక్షలను వ్యాధి లక్షణాలు లేని ఫ్రంట్‌లైన్ కార్మికులు, వైద్యులు, పారామెడిక్స్ మొదలైనవారికి మరియు కోవిడ్-19 రోగుల సంరక్షణలో పనిచేసేవారిలో విశ్వాసాన్ని పెంపొందించడానికీ ఉపయోగించవచ్చు. వీటిని జి.ఇ.ఎం. పోర్టల్‌లో కూడా అందుబాటులో ఉంచడం జరిగింది.
కోవిడ్-19 కు సంబంధించిన సాంకేతిక సమస్యలు, మార్గదర్శకాలు, సలహాలు, సూచనలపై ప్రామాణికమైన, తాజా సమాచారం కోసం ఈ వెబ్ సైట్ ను క్రమం తప్పకుండా సందర్శించండి :
: https://www.mohfw.gov.in/ మరియు @MoHFW_INDIA .
కోవిడ్-19 కు సంబంధించిన సాంకేతిక సమస్యలకు పరిష్కారాలను దిగువ పేర్కొన్న ఈ మెయిల్ ను సంప్రదించడం ద్వారా పొందవచ్చు :
technicalquery.covid19[at]gov[dot]in
ఇతర సందేహాలు, అనుమానాలకు పరిష్కారాలను దిగువ పేర్కొన్న ఈ మెయిల్ ను సంప్రదించడం ద్వారా పొందవచ్చు :
ncov2019[at]gov[dot]in మరియు @CovidIndiaSeva.
కోవిడ్-19 పై ఎటువంటి అనుమానాలు, సమస్యలు, సమాచారానికైనా, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన ఉచిత హెల్ప్ లైన్ నెంబర్ : +191-11-23978046 లేదా 1075 (టోల్ ఫ్రీ) ను సంప్రదించవచ్చు.
వివిధ రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల కు చెందిన కోవిడ్-19 హెల్ప్ లైన్ నెంబర్ల జాబితా కోసం ఈ వెబ్ సైట్ ని చూడండి :
https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf .
****
(Release ID: 1631919)
Visitor Counter : 294
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam