హోం మంత్రిత్వ శాఖ

కోవిడ్‌-19 ఏర్పాట్లను సమీక్షించేందుకు ఎల్ఎన్‌జేపీఎన్ ఆసుప‌త్రిని ఆక‌స్మికంగా సంద‌ర్శించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా

Posted On: 15 JUN 2020 6:59PM by PIB Hyderabad

కోవిడ్‌-19 క‌ట్ట‌డికి సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించేందుకు గాను కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ అమిత్ షా సోమ‌వారం ఢిల్లీలోని లోక్ నాయక్ జై ప్రకాష్ నారాయణ్ (ఎల్ఎన్‌జేపీఎన్) ఆసుప‌త్రిని ఆక‌స్మికంగా సందర్శించారు. ప్రతి ఆసుపత్రిలోని కరోనా వార్డులలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని శ్రీ అమిత్ షా ఢిల్లీ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.

 

  

ఇలా చేయ‌డం వ‌ల్ల రోగుల పై సరైన పర్యవేక్షణ ఉంచ‌డంతో పాటుగా మరియు రోగుల సమస్యలను కూడా పరిష్కరించేందుకు ఇది దోహ‌దం చేస్తుంద‌ని ఆయ‌న అన్నారు. ఈ ఆసుప్ర‌తిలో
ఆహారాన్ని సరఫరా చేసే క్యాంటీన్ల కోసం త‌గిన బ్యాకప్‌ల‌ను కూడా ఏర్పాటు చేయాలని కేంద్ర హోం మంత్రి ఢిల్లీ ప్ర‌ధాన కార్యదర్శిని ఆదేశించారు. ఒక క్యాంటీన్‌లో ఇన్‌ఫెక్షన్ ఏర్ప‌డినా కూడా.. రోగులు నిరంతరాయంగా ఆహారాన్ని అందించ‌డాన్ని కొనసాగించేందుకు ఈ చ‌ర్య దోహ‌దం చేస్తుంద‌ని ఆయ‌న తెలిపారు. కరోనా రోగుల చికిత్స ద్వారా మానవ సేవలో నిమగ్నమైన వైద్యులు మరియు నర్సుల సైకో-సోషల్ కౌన్సెలింగ్ కూడా చేయించాల‌ని శ్రీ అమిత్ షా ఆదేశించారు. ఈ చ‌ర్య క‌రోనా మహమ్మారిపై పోరాడుతున్న వారిని శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా దృఢ‌ప‌రుస్తుంద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. 

 

*****



(Release ID: 1631796) Visitor Counter : 283