ఆర్థిక మంత్రిత్వ శాఖ
అన్ని సిజిఎస్టి మరియుయ కస్టమ్స్ కార్యాలయాల్లోఇ-ఆఫీస్ వినియోగాన్ని ప్రారంభించిన సిబిఐసి
Posted On:
15 JUN 2020 4:52PM by PIB Hyderabad
భారతదేశ వ్యాప్తంగా సుమారు 500 సిజిఎస్టి మరియు కస్టమ్స్ కార్యాలయాల్లో ఇ-ఆఫీస్ వినియోగాన్ని కేంద్రీయ ప్రత్యక్ష మరియు కస్టమ్స్ బోర్డు(సిబిఐసి) అధ్యక్షులు శ్రీ ఎం అజిత్ కుమార్ ప్రారంభించారు. సుమారు 800 మంది సిబిఐసి సీనియర్ అధికారుల సమక్షంలో దూర విధానంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా ఈ కార్యక్రమంలో నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ కేంద్రం(ఎన్ఐసి) డైరెక్టర్ జనరల్ డా. నీతా వర్మ కూడా పాల్గొన్నారు.
అతి పెద్దదైన ప్రభుత్వ శాఖలు కలిగిన సిబిఐసి తమ కార్యాలయ అంతర్గత కార్యనిర్వహణ కోసం 50,000 అధికారులు మరియు సిబ్బంది వినియోగం కోసం ఈ ఇ-ఆఫీసును ప్రారంభించింది.
ఇప్పటి వరకు కాగితపు ఫైళ్ళ నిర్వహణే జరుగుతుండగా అందుకు ప్రతిగా అంతర్గత కార్యక్రమాలను నిర్వహణ కొరకు ప్రారంభించిన ఈ ఇ-ఆఫీస్ కార్యక్రమం పలు మౌళిక మార్పులను తీసుకువచ్చే అవకాశం ఉంది. పరిశ్రమలు మరియు వ్యాపార వాణిజ్య నిర్వహణ సులువుగా ఉండేందుకు ఐటి ద్వారా చేపట్టిన సంస్కరణల్లో ఉన్న చిన్నపాటి లోటు పాట్లను ఇది పూరిస్తుందని సిబిఐసి ఆశిస్తుంది. పరోక్ష పన్నుల పరిపాలన నిర్వహణ ’పరోక్ష, స్పర్శరహిత మరియు కాగిత రహిత’ విధానాన్ని ఈ సాంకేతికత ద్వారా సిబిఐసి ప్రవేశపెడుతున్నది.
పరిపాలన సంస్కరణలు మరియు ప్రజా వినతుల విభాగం(డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్సెస్) వారి సహకారంతో నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ వారు ఈ ఇ-ఆఫీస్ అప్లికేషన్ను అభివృద్ధిచేసారు. ఇది వివిధ ఫైళ్ళ నిర్వహణలో మరియు ప్రభుత్వ నిర్ణయాలు త్వరితగతిన తీసుకుని పరిపాలనా సౌలభ్యాన్ని కల్పించే లక్ష్యంతో అభివృద్ధి చేయబడినది. ఈ అప్లికేషన్ యొక్క ప్రధాన మాడ్యూల్ ఇ-ఫైల్, ఫైళ్ళకు సంబంధించిన పని అనగా ఫైళ్ళను గ్రహించడం మెదలు కొని తపాలా బట్వాడా చేయడం ఆన్లైల్లో చేయడం, డ్రాఫ్ట్ ఉత్తరాలను తయారు చేయడంతోపాటు వాటిని ఆమోదించడం లేదా సంతకంచేయడం మరియు సంతకం చేసిన వాటిని జారీ చేయడం.
సిజిఎస్టి మరియు కస్టమ్స్ అధికారులు తమ రోజువారీ కార్యక్రమాల నిర్వహలో ఫైళ్ళ నిర్వహణ వేగవంతం చేయడానికి, నిర్ణయాలు త్వరితంగా తీసుకోవడానికి, పారదర్శకతకు, జవాబుదారీగా ఉండేందుకు మరియు కార్యలయాల్లో కాగితం మరియు ముద్రణ ఉపయోగాన్ని తగ్గించేందుకు దీనిని ఉపయోగించవచ్చు. ప్రత్యేకించి కొవిడ్-19 విస్తరిస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో ఫైళ్ళను భౌతికంగా పట్టుకొనడం ద్వారా వైరస్ ప్రసరణను నివారించేందుకు ఉపయోగపడుతుంది. అంతే కాక డాక్యుమెంట్లను మార్పుచేయడం కానీ, నాశనం చేయడం, వాటి తేదీ మార్పు వంటివి చేయకుండా ఈ అప్లికేషన్ నిలువరిస్తుంది. ఈ అప్లికేషన్ ఫైళ్ళు ఎక్కడ ఆగిపోయాని గుర్తించడానికి, వాటిని త్వరితంగా పరిష్కరించడానికి మరియు త్వరితంగా నిర్ణయాలు తీసుకోవడానికి అందులోనే ఒక పర్యవేక్షణ నిర్మాణం అభివృద్ధి చేయబడింది.
ఈ ఇ-ఆఫీస్ జాతీయ ఇ-గవర్నెన్స్ కార్యక్రమం మిషన్ మోడ్ ప్రాజెక్ట్(ఎంఎంపి) క్రింద చేపట్టబడింది.
****
(Release ID: 1631745)
Visitor Counter : 350