హోం మంత్రిత్వ శాఖ
ఢిల్లీలో కోవిడ్ -19 పరిస్థితిపై నిర్వహించిన సమీక్షా సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అధ్యక్షత వహించారు.
కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ అనిల్ బైజల్, ముఖ్యమంత్రి శ్రీ అరవింద్ కేజ్రివాల్, ఢిల్లీకి చెందిన మూడు మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు, సీనియర్ అధికారులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశాన్ని, దేశరాజధాని ఢిల్లీని కరోనా రహితం చేయాలని . వీలైనంత త్వరగా ఆరొగ్యం, సుసంపన్నతను సాధించాలని కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా పిలుపునిచ్చారు.
కరోనా పరీక్షలను అట్టడుగు స్థాయి వరకు నిర్వహించడం, ఇంటింటి సర్వేని సక్రమంగా నిర్వహించడానికి కేంద్రప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీకి చెందిన మూడు మునిసిపల్ కార్పొరేషన్లు చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆదేశించారు.
ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీకి చెందిన ముగ్గురు మేయర్లు, ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్లు కలసికట్టుగా పనిచేయాలని హోంమంత్రి సూచించారు
Posted On:
14 JUN 2020 8:05PM by PIB Hyderabad
దేశాన్ని, దేశ రాజధానిని కరోనా రహితం చేయాలని, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో వీలైనంత త్వరగా ఆరోగ్యం , సుసంపన్నత సాధించాలని కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా పిలుపునిచ్చారు.కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ అనిల్ బైజల్, ముఖ్యమంత్రి శ్రీ అరవింద్ కేజ్రివాల్, ఢిల్లీకి చెందిన మూడు మునిసిపల్ కార్పొరేషన్ల మేయర్లు, ఇతర సీనియర్ అధికారులతో దేశరాజధాని ఢిల్లీలో కోవిడ్ -19 పరిస్థితులపై నిర్వహించిన సమీక్షా సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షత వహించారు.
ఈ ఉదయం జరిగిన సమావేశంలో తీసుకున్న ఇంటింటి సర్వే , అట్టడుగు స్థాయి వరకు కరోనా పరీక్షలు నిర్వహించడం వంటి నిర్ణయాలను సక్రమంగా అమలయ్యేట్టు చూడాలని కేంద్రప్రభుత్వాన్ని, ఢిల్లీ ప్రభుత్వాన్ని, ఢిల్లీలోని మూడు మునిసిపల్ కార్పొరేషన్లను ఆయన ఆదేశించారు. పరస్పర సహకారంతో కరోనా పై పోరాటంలో విజయం సాధించడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశమని ఆయన చెప్పారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వంలో మనం దేశాన్ని, దేశ రాజధానిని కరోనా రహితం చేసి ఆరోగ్యం, సుసంపన్నత ను వీలైనంత త్వరగా సాధించాలని శ్రీ అమిత్ షా పిలుపునిచ్చారు. దీనిని అందరి పరస్పర సహకారం, సమన్వయంతో తోనే సాధించగలమని ఆయన అన్నారు. ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీకి చెందిన ముగ్గురు మేయర్లు, ఢిల్లీలోని మూడు మునిసిపల్ కార్పొరేషన్లు కలిసి పనిచేస్తూ, ఉదయం జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయాలని కోరారు. అన్ని మార్గదర్శకాలూ కచ్చితంగా అమలయ్యేలా చూడాల్సిందిగా ఢిల్లీ పోలీస్ కమిషనర్‌ను కేంద్ర హోంమంత్రి ఆదేశించారు.
***
(Release ID: 1631597)
Visitor Counter : 228