వ్యవసాయ మంత్రిత్వ శాఖ
వ్యవసాయ రంగంలో ప్రవేటు పెట్టుబడులు పెరగాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పిన కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్
వ్యవసాయరంగంలో ప్రగతి, దేశం స్వావలంబన సాధించడానికి ఉపకరిస్తుందని స్పష్టం చేసిన శ్రీ తోమర్
భారతీయ రైతులు ఎలాంటి సంక్లిష్ట పరిస్థితినైనా ఎదుర్కొనగలరని కోవిడ్ -19 సంక్షోభం రుజువుచేసిందన్న మంత్రి.
వ్యవసాయ దిగుబడులు పెంచేందుకు కృషిచేయాల్సిందిగా శాస్త్రవేత్తలకు శ్రీతోమర్ పిలుపు
Posted On:
13 JUN 2020 8:47PM by PIB Hyderabad
వ్యవసాయరంగంలో పెట్టుబడులు పెరగాల్సిన అవసరం ఉందని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్రసింగ్ తోమర్ స్పష్టం చేశారు. మీరట్ లోని, చౌదరి చరణ్ సింగ్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిన అంతర్జాతీయ వెబినార్, జునాఘడ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏరర్పాటుచేసిన జాతీయ వెబినార్‌ల లో మంత్రి మాట్లాడారు. ప్రైవేటు పెట్టుబడులతో వ్యవసాయ రంగంలో సుసంపన్నత పెరుగుతుందని, ఫలితంగా ఇది దేశ సుసంపన్నతకు, స్వావలంబనకు దోహదపడుతుందని అన్నారు. వ్యవసాయరంగంలో ఉత్పాదకత పెరగడానికి, కష్టాలను అధిగమించడానికి శాస్త్రవేత్తలు తమవంతు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
మీరట్ విశ్వవిద్యాలయ వెబినార్‌లో మాట్లాడుతూ కేంద్ర మంత్రి శ్రీ తోమర్, ఆహారధాన్యాల ఉత్పత్తిలో దేశం స్వయం సమృద్ధం కావడమే కాకుండా మిగులు సాధించిందని అన్నారు. క్లిష్టమైన సవాళ్లను కూడా అధిగమించగలమని రైతులు రుజువుచేశారని ఆయన అన్నారు. 2050 నాటికి దేశ జనాభా 160 కోట్ల మందికి చేరుకోనున్నదని అందువల్ల సాగు దారులు, దేశంలోని శాస్త్రవేత్తలు దేశ ప్రజలందరికీ మరింత మెరుగైన పౌష్టికాహారాన్ని అందించేందుకు కృషి చేయాలన్నారు. ఇందుకు ప్రగతిదాయక సాగును అభివృద్ది చేయాలని, ఇది వ్యాధుల బారినుంచి , క్రిమికీటకాలనుంచి తట్టుకునే విధంగా, తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడి వచ్చే విధంగా ఉండాలన్నారు. పొడి వాతావరణం, అధిక ఉష్ణోగ్రతలు, క్షారభూములు, లవణభూములలో సైతం తట్టుకుని నిలబడగల రకాలను అభివృద్ధి చేయాలని ఆయన కోరారు. అధిక ప్రోటీన్, ఐరన్, జింక్ తదితర పౌష్టికాహార లక్షణాలు కలిగిన మంచి నాణ్యత కలిగిన పంట దిగుబడి రకాలను అభివృద్ధి చేసేందుకు బయో ఫోర్టిఫికేషన్ వ్యూహాన్ని అనుసరించాలని ఆయన పిలుపునిచ్చారు.
వ్యవసాయ రంగంలో ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడం గురించి మాట్లాడుతూ శ్రీ తోమర్, వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ లక్షకోట్ల రూపాయలను ప్రకటించారని చెప్పారు. అలాగే మత్స్యసంపద ,పశుగణాభివృద్ధి, తేనెటీగల అభివృద్ధి, వనమూలికల అభివృద్ది, ఆహార ప్రాసెసింగ్ రంగ అభివృద్ధికి ఇలాంటి ప్రొవిజన్లను ప్రధానమంత్రి ప్రకటించారని ఆయన గుర్తుచేశారు. భూసార పరీక్షల ప్రాధాన్యతను గుర్తుచేస్తూ మంత్రి, ఈ విషయంలో ప్రజలను చైతన్యవంతులను చేయాలన్నారు.
జునాఘడ్ అగ్రికల్చర్‌యూనివర్సిటీ వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్వహించిన వెబినార్‌లో మాట్లాడుతూ మంత్రి, తక్కువ నీటివినియోగంతో మెరుగైన వ్యవసాయ దిగుబడి సాధించాల్సిన ఆవశ్యకతను ఆయన నొక్కి చెప్పారు.గ్రామాలు స్వయం సమృద్దం కానిదే దేశం సుసంపన్నం కాదని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఆర్థిక వ్యవస్జ, దాని అనుబంధ రంగాలూ సుసంపన్నం కావాలని ఆయన అన్నారు. ఇది జరిగితే దేశం అన్ని రకాల సవాళ్లను ఎదుర్కోగలుగుతుందని ఆయన అన్నారు.
కరోనా వైరస్ సంక్షోభం సమయంలో , ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి వెళ్ళిన సమయంలోనూ భారతీయ రైతులు , గ్రామాలలో లభించే వనరులతోటే అద్భుత దిగుబడి సాధించారని, లాక్‌డౌన్ సమయంలో పంటకోతలు సాధారణ స్థితిలోనే సాగాయని కేంద్ర మంత్రి తోమర్ అన్నారు. పంట దిగుబడి గత ఏడాది కంటే ఎక్కువగానే ఉందని, ఖరీప్ పంటల నాట్లు గత సంవత్సరం కంటే 45 శాతం ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. ఇది మన గ్రామాలు, మన రైతుల శక్తికి నిదర్శనమన్నారు. శ్రీ నరేంద్ర మోదీ ప్రభుత్వం వ్యవసాయం, రైతు సంక్షేమానికి కేటాయించినన్ని నిధులు మరే ప్రభుత్వమూ కేటాయించలేదన్నారు. పిఎం-కిసాన్ పథకం ఒక్కదానికే గత మొత్తం వ్యవసాయ బడ్జెట్ కంటే ఎక్కువ కేటాయించారని ఆయన చెప్పారు. మరింత మంది రైతులను పదివేల కొత్త రైతు ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లతో(ఎఫ్.పి.ఒ) అనసంధానం చేయాల్సిన ఆవశ్యకతను ఆయన నొక్కి చెప్పారు. ఈ ఎఫ్.పి.ఒల ఏర్పాటుపై ప్రభుత్వం ఇటీవలే ప్రకటన చేసింది.
(Release ID: 1631489)
Visitor Counter : 249