శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

చౌకగా కరోనావైరస్ పరీక్షల పరికరం రూపకల్పన

Posted On: 11 JUN 2020 4:02PM by PIB Hyderabad

కరోనావైరస్ పరీక్షకు భారత వైద్య పరిశోధనామండలి (ఐ సి ఎం ఆర్ ) ఒక సరికొత్త పరికరాన్ని సిఫార్సు చేసింది. రివర్స్ ట్రాన్స్ క్రిప్షన్ పాలిమెరేజ్ చైన్ రియాక్షన్ గా పిలిచే ఈ చౌక విధానపు సరికొత్త పరీక్షా పరికరాన్ని సెంటర్ ఫర్ మాలిక్యులార్ బయాలజీ (సిసిఎంబి) కి చెందిన పరిశోధకులు రూపొందించారు. ఇప్పటివరకు వాడుతున్న ప్రామాణిక పరికరాలతో దీని పనితీరును సిసిఎంబి బృందం పరీక్షించి చూసింది.  తుదిఫలితాలు సంతృప్తికరంగా ఉన్నట్టు తేల్చింది..

రెండు రకాల పరీక్షలనూ పోల్చి చూసినప్పుడు ప్రామాణిక పరీక్షా పరికరాల సామర్థ్యం తక్కువగా ఉందని, వాస్తవంలో కేవలం 50% మాత్రమే  ఫలితాలు ఇవ్వగగింది. అయితే, దీనికి కారణం ఎక్కువ శాంపిల్స్ లో వైరస్ తక్కువగా ఉండటం కూడా కావచ్చునని తేల్చారు. అందువలన వైరస్ ను గుర్తించటంలో సామర్థ్యాన్ని పరీక్షించటంలో అక్కడి వాతావరణం కూడా ముఖ్యమని ఈ అంశం వెల్లడించింది.

" మేం రూపొందించి అభివృద్ధి చేసిన ప్రొటోకాల్ ను పరీక్షించాం. నాలుగు రకాల లక్షణాల ఆధారంగా పరీక్షించే ఏర్పాటు ఇందులో ఉంది. వ్యక్తిగతమైన లక్షణాలను పరీక్షించటానికి ఆర్ ఎన్ ఎ ను విడదీయకుండా పరీక్షించగలగటం దీని ప్రత్యేకత" అని ఇండియా సైన్స్ వైర్ తో మాట్లాడుతూ సిసిఎంబి డైరెక్టర్ రాకేశ్ మిశ్రా అన్నారు.

"గొంతులో నుంచి తీసే స్వాబ్ శాంపిల్స్  నుంచి వేరు చేసిన ఆర్ ఎన్ ఎ శాంపిల్స్ ను గతంలో పరీక్షించేవారు. అయితే, ఇప్పుడు ఈ సరికొత్త విధానం ద్వారా చేసిన పరీక్షలను పోల్చి చూశాం. రెండ్ఉ రకాల పరీక్షల ఫలితాలనూ గమనించినప్పుడు కొత్త విధానం పాజిటివ్ గా నిర్థారణ అయిన కేసుల్లో 90% కేసులను గుర్తించగలిగింది. అదే సమయంలో గతంలో నెగటివ్ అని నిర్థారించిన శాంపిల్స్ లో 13% పాజిటివ్ గా కూడా తేల్చింది. అందువల్ల సమర్థత రీత్యా కూడా ఈ కొత్త విధానం తగినదేనని తేలింది. ప్రామాణిక విధానంలో దాదాపు 50% కేసులు మొదటి పరీక్షలోనే ఫలితాలు ఇవ్వలేకపోవచ్చు. కానీ ఇప్పుడు రూపొందించిన విధానంలో ఫలితాలు మెరుగ్గా ఉంటాయి" అన్నారు.

"ఈ కొత్త పరీక్ష ఐసిఎంఆర్ ఆమోదం కోసం ఎదురు చూస్తోంది. ప్రామాణిక పరీక్షల పరికరాలు అందుబాటులో లేని చోట దీన్ని వాడి చూడాల్సిందిగా ఐసిఎంఆర్ ను కోరతాం" అని డాక్టర్ మిశ్రా అన్నారు.


(Release ID: 1630955) Visitor Counter : 310