కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

పెన్షనర్ల జీవన్ ప్రమాణ పత్ర సమర్పణ ప్రక్రియ

మరింత సానుకూలం
కామన్ సర్వీస్ సెంటర్లతో ఉద్యోగుల
భవిష్యనిధి సంస్థ సంస్థ ఏర్పాటు.

Posted On: 11 JUN 2020 4:45PM by PIB Hyderabad

     పెన్షనర్లకు మరింత చేరువగా సేవలందంచేందుకు ఉద్యోగుల పెన్షన్ పథకం (ఈపీఎస్) కొత్త ఏర్పాటు చేసింది. దేశంలో కోవిడ్-19 వైరస్ మహమ్మారి వ్యాప్తి కారణంగా ఏర్పడిన సవాళ్ల నేపథ్యంలో ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) ఏర్పాటు చేసింది. పెన్షర్లు డిజిటల్ జీవన్ ప్రమాణ్ పత్ర (లైఫ్ సర్టిఫికెట్) ను సులభంగా సమర్పించేందుకు వీలుగా దేశవ్యాప్తంగా ఉన్న కామన్ సర్వీస్ సెంటర్లతో ఈపీఎఫ్ఓ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. దేశంలోని 65లక్షల మంది పెన్షనర్లు తమ ఇళ్లకు చేరువలోనే ఉండే కామన్ సర్వీస్ సెంటర్లలో డిజిటల్ జీవన్ ప్రమాణ పత్రను సమర్పించేందుకు ఇది వీలు కలిగిస్తుంది. దీనితో మొత్తం 3లక్షల 65 కామన్ సర్వీస్ సెంటర్లలో పెన్షనర్లు జీవన్ ప్రమాణ పత్రాలను సమర్పించడానికి వీలు ఉంటుంది. పెన్షనర్లు తమ నెలవారీ పెన్షన్ పొందాలంటే ప్రతియేటా జీవన్ ప్రమాణ పత్ర లేదా లైఫ్ సర్టిఫికెట్ ను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది.

  కామన్ సర్వీస్ సెంటర్లతో పాటుగా, దేశంలోని 135 ప్రాంతీయ కార్యాలయాలు, 117 జిల్లా స్థాయి కార్యాలయాలు, పెన్షన్ బట్వాడా చేసే బ్యాంకుల ద్వారా కూడా ఈపీఎస్ పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికెట్లను సమర్పించచ్చు. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ అనుసరించే బహుళ సంస్థల సదుపాయం ద్వారా పెన్షనర్లు తమకు సానుకూలమైన, సౌకర్యవంతమైన పద్ధతిలో సేవలను ఉపయోగించుకునే స్వేచ్ఛ ఉంది.

 ఏడాదిలో ఎప్పుడైనా తమ సౌకర్యాన్ని బట్టి పెన్షనర్లు డిజిటల్ జీవన్ ప్రమాణ పత్రాన్ని సమర్పించవచ్చు మేరకు ఉద్యోగుల పెన్షన్ పథకం తన విధానంలో కీలకమైన మార్పు చేసింది.

పెన్షనర్ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించిన తేదీనుంచి సంవత్సరంపాటు చెల్లుబాటవుతుంది. ఇదివరకైతే ప్రతియేటా నవంబరు నెలలో జీవన ప్రమాణ పత్రాన్ని సమర్పించవలసి ఉండేది. నిబంధన కారణంగా పెన్షనర్లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చేది. తమకు పెన్షన్ చెల్లింపు నిలిచిపోయిందంటూ పలు ఫిర్యాదులు పెన్షనర్లనుంచి వచ్చేవి. ఆలస్యంగా లైఫ్ సర్టిఫికెట్ సమర్పించిన సందర్భాల్లో నవంబర్ వరకూ కొన్ని నెలలు మాత్రమే సర్టిఫికెట్ చెల్లుబాటయ్యేది. పరిస్థితుల్లో పెన్షనర్ల ప్రయోజనాలకు అనుకూలంగా ఉండాలనే లక్ష్యంతో ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ కీలక నిర్ణయం తీసుకుని ప్రత్యేక ఏర్పాటు చేసింది.

  దేశంలోని 65లక్షల మంది పెన్షనర్ల ఆర్థిక స్వాతంత్య్రంకోసం ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ కట్టుబడి ఉంది. ఇందుకోసం వారికి సకాలంలో పెన్షన్ బట్వాడా చేసేందుకు, ప్రత్యేకించి సంక్షోభ సమయాల్లో సకాలంలో పెన్షన్ అందించేందుకు   ఏర్పాటు చేసింది



(Release ID: 1630931) Visitor Counter : 262