రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 వ్యాప్తిని నియంత్రించడానికి పారిశ్రామికంగా పెద్ద ఎత్తున 3 డి యాంటీమైక్రోబయాల్ ఫేస్-షీల్డ్స్ యొక్క తయారీ మరియు వాణిజ్యీకరణ కోసం ఎన్.ఐ.పి.ఈ.ఆర్.-గౌహతి మరియు హిందూస్తాన్ యాంటీబయాటిక్స్ లిమిటెడ్ మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది.

3డి ప్రింటెడ్ 3-పొరల లేయర్ యాంటీ మైక్రోబియాల్ మాస్కు మరియు హ్యాండ్స్ ఫ్రీ పరికరాలను కూడా అభివృద్ధి చేసిన - ఎన్.ఐ.పి.ఈ.ఆర్.-గౌహతి


కోవిడ్-19 ను అరికట్టేందుకు అభివృద్ధి చేసి, రూపొందించిన 3డి ఉత్పత్తుల తయారీ హక్కుల కోసం దాఖలు చేసిన - ఎన్.ఐ.పి.ఈ.ఆర్.

Posted On: 08 JUN 2020 4:20PM by PIB Hyderabad

కోవిడ్-19 యొక్క ప్రాణాంతక వ్యాప్తిని నివారించడానికి అవసరమైన వ్యక్తిగత రక్షణ పరికరాల (పి.పి.ఇ.) అభివృద్ధి పరంగా ఉపయోగకరమైన సహకారం మరియు పరిష్కారాలను అందించడానికి భారత ప్రభుత్వ కేంద్ర రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖకు చెందిన ఫార్మాస్యూటికల్స్ విభాగం కింద ఉన్న జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రధాన సంస్థ, గౌహతీ లోని  నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ( ఎన్.ఐ.పి.ఈ.ఆర్) కట్టుబడి ఉంది.

తాము రూపొందించి, అభివృద్ధి చేసిన 3-డి. ప్రింటెడ్ యాంటీమైక్రోబియాల్ ఫేస్-షీల్డ్ లను పెద్ద ఎత్తున పారిశ్రామిక-గ్రేడ్ తయారీ మరియు వాణిజ్యీకరణ కోసం భారత ప్రభుత్వ ఫార్మాస్యూటికల్స్ శాఖ కు చెందిన పింప్రి, పూణే లోని హిందూస్థాన్ యాంటీబయాటిక్ లిమిటెడ్ (హెచ్.ఏ.ఎల్) తో అవగాహన ఒప్పందంపై సంతకం చేసినట్లు, ఎన్.ఐ.పి.ఈ.ఆర్.-గౌహతి డైరెక్టర్ డాక్టర్ యు.ఎస్.ఎన్. మూర్తి తెలియజేశారు. 

ఎన్.ఐ.పి.ఈ.ఆర్.-గౌహతి తాను రూపొందించిన 3-డి ముద్రిత యాంటీమైక్రోబియాల్ ఫేస్-షీల్డ్ లకు భారతీయ డిజైన్ పేటెంట్ మరియు తాత్కాలిక పేటెంట్ రెండింటి కోసం న్యూఢిల్లీ లోని భారతీయ పేటెంట్ కార్యాలయంలో దాఖలు చేసింది.

రిస్క్ తీవ్రత కోసం అనేక వనరులను జాగ్రత్తగా విశ్లేషించిన తరువాత, చేతుల ద్వారా మరియు నోరు, కళ్ళు, ముక్కు, చెవుల ద్వారా  వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుందీ  అనే దానిపై జాగ్రత్తగా విశ్లేషించిన తర్వాత నావెల్ కరోనా వైరస్ యొక్క వ్యాప్తిని నియంత్రించడానికి  ఎన్.ఐ.పి.ఈ.ఆర్.-గౌహతి 3-డి-ప్రింటెడ్ యాంటీమైక్రోబియాల్ ఫేస్-షీల్డ్‌ను రూపొందించింది.  3-డి-ప్రింటెడ్ యాంటీమైక్రోబియాల్ ఫేస్-షీల్డ్ యొక్క కొన్ని ముఖ్యమైన లక్షణాలు:  అధిక సంక్షిప్త, పారదర్శకత, సులభంగా డిజైన్, తక్కువ ఖర్చు, ధరించడం సులభం, ప్రకృతిలో యాంటీమైక్రోబయల్, అద్భుతమైన రసాయన స్థిరత్వం, పెళుసుగా ఉండదు,  ఇప్పటికే ఉన్న శానిటైజర్లు లేదా ఏదైనా ఆల్కహాలిక్ క్రిమిసంహారకాలతో సులువుగా శుభ్రపరచవచ్చు.  

వీటితో పాటు, నావెల్ కరోనా వైరస్ యొక్క వ్యాప్తిని నియంత్రించడానికి 3-డి- ప్రింటెడ్ మల్టీ-లేయర్ యాంటీమైక్రోబియాల్ ఫేస్ మాస్క్‌ను ఎన్.ఐ.పి.ఈ.ఆర్-గౌహతి రూపొందించి, అభివృద్ధి చేసింది.  ఈ మాస్క్ యొక్క మొదటి పొర యాంటీ బాక్టీరియల్ కేసింగ్ అవుతుంది, రెండవది శుభ్రపరిచే పొర మరియు గాలి ద్వారా వచ్చే కణాలు బహిర్గతం కాకుండా తగ్గిస్తుంది.  చివరగా, మూడవ పొర అదనపు సూక్ష్మజీవుల దాడులను నివారించడానికి  ఉపయోగపడే ఔషధాలను కలిగి ఉంటుంది. 

చివరగా, ఎన్.ఐ.పి.ఈ.ఆర్-జి ఎలివేటర్, ల్యాప్‌ టాప్ / డెస్క్ ‌టాప్ కీ బోర్డులు, స్విచ్ బటన్లను ఆన్ / ఆఫ్ చేయడంతో సహా, తలుపులు, కిటికీలు, సొరుగు (నిలువు మరియు అడ్డంగా రెండూ), రిఫ్రిజిరేటర్ తలుపులు తెరవడం లేదా మూసివేయడం కోసం 3-డి-ముద్రిత, చేతులతో పెట్టుకోవలసిన అవసరం లేకుండా, అనేక పనులను చేయగల ఒక వస్తువును అభివృద్ధి చేసి ధృవీకరించింది. ఈ ఉత్పత్తి ని  చాలా సులభంగా, ఉపయోగించేవారికి వీలుగా, పెళుసుగా లేకుండా రూపొందించారు.  మరియు దీనిని ఇప్పటికే అందుబాటులో ఉన్న శానిటైజర్ లేదా ఏదైనా ఆల్కహాలిక్ క్రిమిసంహారక మందులతో సులువుగా శుభ్రం చేయవచ్చు. 

*****


(Release ID: 1630298) Visitor Counter : 362