యు పి ఎస్ సి

సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ -2019 లో మిగిలిన అభ్యర్థులకు జూలై 20 నుండి వ్యక్తిత్వ పరీక్షలు.

Posted On: 05 JUN 2020 4:23PM by PIB Hyderabad

కోవిడ్ -19 కారణంగా ప్రస్తుత పరిస్థితులను సమీక్షించేందుకు గాను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ రోజు (శుక్ర‌వారం) ప్రత్యేక సమావేశం నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్రాల వారు ప్రకటించిన లాక్‌డౌన్ మరియు ఇత‌ర  ప్రగతిశీల సడలింపులను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న కమిషన్.. ఆయా పరీక్షలు / నియామక పరీక్షల (ఆర్టీలు) యొక్క సవరించిన షెడ్యూలును జారీ చేయాలని నిర్ణయించింది. పరీక్షలు / ఆర్టీలకు సంబంధించి సవరించిన క్యాలెండర్ వివరాల‌ను క‌మిషన్ త‌న వెబ్‌సైట్‌లో ప్రచురించ‌నుంది. సివిల్ సర్వీసెస్ ప‌రీక్ష‌- 2019 లో మిగిలిన అభ్యర్థులకు వ్యక్తిత్వ పరీక్షల్ని జులై 20వ తేదీ నుంచి తిరిగి ప్రారంభించాలని కమిషన్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఆయా అభ్యర్థులకు వ్యక్తిగతంగా సమాచారం ఇవ్వునున్నా‌రు. ఈ ఏడాది అక్టోబర్ 04 తేదీన జరగాల్సిన ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌లో ఈఓ / ఏఓ పోస్టుల నియామక పరీక్ష వాయిదా పడింది. 2021కు సంబంధించి వివిధ పోటీ పరీక్షలు / నియామక పరీక్షల క్యాలెండర్ జారీ చేసే సమయంలో ఈ ఆర్టీ ప‌రీక్ష‌ల నిర్వ‌హణ‌కు సంబంధించిన ‌కొత్త తేదీల‌ను కమిషన్ త‌న‌న వెబ్‌సైట్‌లో వెలువ‌రించ‌నుంది. 



(Release ID: 1629701) Visitor Counter : 251