గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
వ్యర్థ పదార్థాల సమర్థ నిర్వహణ తో జీవవైవిధ్య పరిరక్షణ
ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2020 న ఎంహెచ్యుఎ వరుస సలహాలను విడుదల చేసింది
Posted On:
05 JUN 2020 12:49PM by PIB Hyderabad
ప్రపంచ పర్యావరణ దినోత్సవం-2020 సందర్భంగా, గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ (ఎంహెచ్యుఎ) సహాయ మంత్రి (ఇంచార్జి) శ్రీ హర్దీప్ సింగ్ పూరి న్యూఢిల్లీ లోని నిర్మాణ్ భవన్ లో జరిగిన ఒక కార్యక్రమంలో సలహాల శ్రేణిని ప్రారంభించారు. ‘ వ్యర్థ పదార్థాలను ప్రభావవంతంగా నిర్వహణ తో జీవవైవిధ్య పరిరక్షణ' అనే కార్యక్రమంలో వెబ్‌కాస్ట్ ప్రత్యక్ష ప్రసారం అయ్యింది. ఎంహెచ్యుఎ కార్యదర్శి శ్రీ దుర్గాశంకర్ మిశ్రా, జాయింట్ సెక్రటరీ మరియు నేషనల్ మిషన్ డైరెక్టర్, స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ (ఎస్బిఎం-యు) శ్రీ వి.కె. జిందాల్ పాల్గొన్నారు.
విడుదల చేసిన మూడు ముఖ్య సలహాలలో 'మునిసిపల్ సాలిడ్ వేస్ట్ (ఎంఎస్‌డబ్ల్యు) కోసం మెటీరియల్ రికవరీ ఫెసిలిటీస్ (ఎంఆర్‌ఎఫ్),' ల్యాండ్‌ఫిల్ రిక్లమేషన్ ' ఆన్-సైట్, ఆఫ్-సైట్ మురుగునీటి నిర్వహణ పద్ధతులపై' కన్సల్టేటివ్ డాక్యుమెంట్ (డ్రాఫ్ట్) ఉన్నాయి. 'ఎస్బిఎం-యు కింద సెంట్రల్ పబ్లిక్ హెల్త్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్ ఆర్గనైజేషన్ (సిపిహెచ్ఈఈఓ) తయారుచేసింది. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, “ఈ రోజున, జీవవైవిధ్య పరిరక్షణ, సమర్థవంతమైన వ్యర్థ పదార్థాల నిర్వహణ మధ్య అంతర్గత సంబంధాన్ని బలోపేతం చేయడానికి మనకు అవకాశం లభించింది. స్వచ్ఛత, జీవవైవిధ్య పరిరక్షణ మధ్య అవినాభావ సంబంధం ఉంది” అని అన్నారు. “2014 లో గౌరవ ప్రధానమంత్రి ఎస్బిఎం-యు ప్రారంభించినప్పుడు, పట్టణ ఇండియాబహిరంగ మలవిసర్జన రహితం చేయాలనే లక్ష్యంతో పాటు, 100% శాస్త్రీయ ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ. ఈ రెండు రంగాలలో మనం గణనీయమైన ప్రగతి సాధించాము" అని మంత్రి తెలిపారు. మల వ్యర్థం నిర్వహణపై ప్రచారం కోసం టూల్‌కిట్‌ను మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. టూల్‌కిట్ ఇంగ్లీషుతో పాటు 10 భారతీయ భాషలలో సృజనాత్మకతతో ఉంది. ఈ విధంగా వ్యర్థ నిర్వహణలో అనుసరించే వివిధ వ్యూహాలు దేశంలో స్వచ్ఛ్ (పరిశుభ్రత), స్వాస్థ్ (ఆరోగ్యం), సశక్త్ (సాధికారత), సంపన్న(సుసంపన్నమైన), ఆత్మనిర్భర్ (స్వావలంబన) ను సాధించే దిశగా తీసుకెళ్తామని కేంద్ర మంత్రి అన్నారు అందరం ఇటువంటి సంకల్పం తీసుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
‘భారతదేశంలో ఆన్-సైట్ & ఆఫ్-సైట్ మురుగునీటి నిర్వహణ పద్ధతుల కోసం ముసాయిదా సలహాసూచనల’ పై వర్చువల్ వర్క్‌షాప్ జరిగింది, దీనికి రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులతో పాటు విద్యావేత్తలు, విషయ నిపుణులు 100 మంది పాల్గొన్నారు.
(Release ID: 1629631)
Visitor Counter : 295