రైల్వే మంత్రిత్వ శాఖ
ప్రయాణీకులకు ప్రపంచస్థాయి సౌకర్యాలు కల్పిస్తున్న భారతీయ రైల్వేలు
68,800 బోగీల్లో 2,45,400కు పైగా బయో టాయిలెట్లు ఏర్పాటు
200 స్టేషన్లలో పర్యావరణహిత ఏర్పాట్లకు 2019-20లో ఐఎస్‌వో 14001 గుర్తింపు
సుఖమయ ప్రయాణం కోసం స్వచ్ఛ్ భారత్, స్వచ్ఛ్ రైల్వేస్ వంటి కార్యక్రమాలు నిర్వహణ
Posted On:
05 JUN 2020 1:45PM by PIB Hyderabad
ప్రపంచ అత్యుత్తమ రైల్వే వ్యవస్థల్లో ఒకటైన భారతీయ రైల్వేలు.., ప్రయాణీకులకు ప్రపంచస్థాయి సౌకర్యాలు కల్పించడానికి కట్టుబడి పని చేస్తున్నాయి. పరిశుభ్ర వాతావరణం, చక్కటి ప్రయాణ అనుభూతి కోసం స్వచ్ఛ్ భారత్, స్వచ్ఛ్ రైల్వేస్ వంటి అనేక కార్యక్రమాలను రైల్వేలు చేపట్టాయి.
ప్రయాణీకుల సౌకర్యం కోసం రైల్వేలు చేపట్టిన కార్యక్రమాల్లో కొన్ని:
2019-20లో, 14,916 బోగీల్లో 49,487 బయో టాయిలెట్లను ఏర్పాటు చేశారు. దీంతో వీటి మొత్తం సంఖ్య 68,800 బోగీల్లో 2,45,400 దాటింది. దీనివల్ల 100 శాతం బయో టాయిలెట్లు ఏర్పాటు పూర్తయింది.
మహాత్మాగాంధీ 150వ జయంతి అయిన 2019 అక్టోబర్ 2 నుంచి చిన్నపాటి ప్లాస్టిక్ ముక్కను కూడా రైల్వేలు ఉపయోగించలేదు.
రైల్వేలు చేస్తున్న కృషితో, స్వచ్ఛ్ భారత్ కార్యాచరణ ప్రణాళిక అమలు కోసం ఉత్తమ ప్రయత్నం చేస్తున్న మంత్రిత్వ శాఖగా రైల్వే శాఖ గుర్తింపు పొందింది. 2019 సెప్టెంబర్ 6న రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం అందుకుంది.
200 స్టేషన్లలో పర్యావరణహిత ఏర్పాట్ల అమలుకు 2019-20లో ఐఎస్‌వో 14001 సర్టిఫికెట్ లభించింది.
953 స్టేషన్లలో సమీకృత యంత్ర ఆధారిత పరిశుభ్రత కార్యక్రమాలు చేపడుతున్నారు.
రాజధాని, శతాబ్ధి, దురంతో వంటి దూర ప్రయాణాలు చేసే 2200కు పైగా రైళ్లలో.. ప్రయాణ సమయంలోనే మరుగుదొడ్లు, ద్వార మార్గాలు, నడవాలు, కంపార్టుమెంట్లను శుభ్రం చేసేలా "ఆన్‌బోర్డ్ హౌస్ కీపింగ్ సర్వీస్" (ఓబీహెచ్‌ఎస్) ఉంది.
2120 రైళ్లలో ఎస్‌ఎంఎస్ ఆధారిత "కోచ్ మిత్ర" సేవ ద్వారా ఓబీహెచ్‌ఎస్ సౌకర్యాన్ని పొందవచ్చు.
ఏసీ బోగీల్లో అందించే దుప్పట్ల వంటి వస్త్రాల శుభ్రతలో నాణ్యత పెంచేందుకు యాంత్రిక లాండ్రీలు ఏర్పాటు చేస్తున్నారు. 2019-20లో 8 యాంత్రిక లాండ్రీలు ఏర్పాటు చేయగా, వీటి మొత్తం సంఖ్య 68కి చేరింది.
రైల్వే స్టేషన్లలో పర్యావరణహిత వాతావరణం కోసం.., ప్లాస్టిక్ వాడకం తగ్గింపు, పునర్వినియోగం, ప్లాస్టిక్ ధ్వంసం చేయడానికి "ప్లాస్టిక్ బాటిల్ క్రషింగ్ మెషీన్స్" (పీబీసీఎమ్) ఏర్పాటు కోసం సమగ్ర విధానపర మార్గదర్శకాలను తెచ్చారు. ప్రస్తుతానికి, జిల్లా ప్రధాన రైల్వే స్టేషన్లు సహా 229 స్టేషన్లలో 315 "ప్లాస్టిక్ బాటిల్ క్రషింగ్ మెషీన్స్" ఏర్పాటు చేశారు.
2019-20లో, 8 ప్రాంతాల్లో ఆటోమేటి కోచ్ వాషింగ్ ప్లాంట్లు (ఏసీడబ్ల్యుపీ) ఏర్పాటు చేశారు. దీంతో వీటి మొత్తం సంఖ్య 20కి చేరింది.
రైళ్లు స్టేషన్లలో ఆగినప్పుడు నీటి నింపడానికి జరుగుతున్న సమయం వృథాను అరికట్టేందుకు, వేగంగా నీటిని నింపే వ్యవస్థలను 29 చోట్ల ఏర్పాటు చేశారు. వీటి మొత్తం సంఖ్య 44కు చేరింది.
(Release ID: 1629628)
Visitor Counter : 262
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Malayalam