ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 అప్‌డేట్స్‌

Posted On: 04 JUN 2020 4:45PM by PIB Hyderabad

గ‌డిచిన‌ 24 గంటల స‌మ‌యంలో మొత్తం 3,804 మంది కోవిడ్-19 రోగులు వైర‌స్ ప్ర‌భావం నుంచి కోలుకున్నారు. దీంతో దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 1,04,107 మంది రోగులు కోవిడ్-19 మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్న‌ట్ట‌యింది.

కోవిడ్ -19 రోగుల రికవరీ రేటు 47.99 శాతానికి చేరింది. ప్రస్తుతం 1,06,737 క్రియాశీల కేసులు ఉన్నాయి. వీరంద‌రూ చురుకైన వైద్య పర్యవేక్షణలో ఉన్నారు.

వైర‌స్ ఇన్ఫెక్ష‌న్ బారిన ప‌డిన వ్యక్తులలో న‌వ్య కరోనా వైరస్‌ను గుర్తించే పరీక్ష సామర్థ్యాన్ని ఐసీఎంఆర్ మరింతగా పెంచింది. ప్రభుత్వ ల్యాబ్‌ల సంఖ్యను 498 కు ప్రైవేట్ ల్యాబ్‌లను 212.1 కు పెంచారు.

గ‌డిచిన‌ 24 గంటల్లో మొత్తం 39,485 నమూనాలను పరీక్షించ‌డం జ‌రిగింది. దీంతో ఇప్పటి వరకు పరీక్షించిన మొత్తం నమూనాల సంఖ్య 42,42,718కు చేరుకుంది.

కోవిడ్ -19 మహమ్మారి నేప‌థ్యంలో అనుసరించాల్సిన సురక్షితమైన చెవ్వు, ముక్కు, గొంతు (ఈఎన్‌టీ)కు సంబంధించిన పద్ధతులపై మంత్రిత్వ శాఖ తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ వివరాలను https://www.mohfw.gov.in/pdf/ENTCOVID0306.pdf వెబ్‌సైట్ నందు చూడవచ్చు.

కోవిడ్ -19కు సంబంధిత సాంకేతిక సమస్యలు, మార్గదర్శకాలు & సలహాలు మ‌రియు ఇత‌ర అన్ని ప్రామాణికమైన నవీకరించబడిన సమాచారం కోసం దయచేసి క్రమం తప్పకుండా https:// www.mohfw.gov.in/ మరియు @MoHFW_INDIA ల‌ను సంద‌ర్శించండి.

కోవిడ్‌-19 కి సంబంధించిన ఏవైనా సాంకేతిక స‌మ‌స్య‌ల‌ను technquery.covid19@gov.in అనే మెయిల్ ఐడీకి మరియు ఇతర ప్రశ్నలను ncov2019@gov.in మరియు @CovidIndiaSeva మెయిల్ ఐడీల‌కు పంపవచ్చు.

కోవిడ్‌-19కు సంబంధించి ఏవైనా ప్రశ్నలు ఉంటే, దయచేసి ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ హెల్ప్‌లైన్ నెం.: + 91-11-23978046 లేదా 1075 (టోల్ ఫ్రీ)కు కాల్ చేయ‌వ‌చ్చు. కోవిడ్‌-19కు సంబంధించి ఆయా రాష్ర్టాలు మ‌రియు కేంద్ర పాలిత ప్రాంతాల‌లోని  హెల్ప్‌లైన్ సంఖ్యల జాబితా https://www.mohfw.gov.in/pdf/(Release ID: 1629401) Visitor Counter : 65