మంత్రిమండలి
భారతదేశంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు మంత్రిత్వ శాఖలు / విభాగాల్లో ఎంపవర్డ్ గ్రూప్ ఆఫ్ సెక్రటరీస్ (ఈ.జి.ఓ.ఎస్) మరియు ప్రాజెక్ట్ డెవలప్ మెంట్ సెల్స్ (పి.డి.సి)ల ఏర్పాటుకు ఆమోదం తెలిపిన ప్రభుత్వం
· భారతదేశంలో పెట్టుబడులను ఊతమిచ్చే ప్రతిపాదన
· ఇది భారతదేశాన్ని పెట్టుబడులకు మరింత అనుకూలమైన గమ్యస్థానంగా మారుస్తుంది. అదే విధంగా దేశంలోకి పెట్టుబడుల ప్రవాహాన్ని మరింత అనుకూల చేయడంతో పాటు దేశీయ పరిశ్రమలకు ప్రయోజనకరంగా మారుతుంది.
· ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకుపోయే దిశంలో ఈ.జి.ఓ.ఎస్ మరియు పి.డి.సి. ఒక కీలకమైన దశ
· పెట్టుబడి మరియు సంబంధిత ప్రోత్సాహక విధానాలలో మంత్రిత్వ శాఖలు / విభాగాలు మరియు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఇది సమన్వయం తీసుకువస్తుంది.
· ఆర్థిక వ్యవస్థకు ఊపునివ్వటంతో పాటు వివిధ రంగాల్లో అపారమైన ప్రత్యక్ష మరియు పరోక్ష ఉపాధి అవకాశాలకు తలుపులు తెరవడం
Posted On:
03 JUN 2020 5:08PM by PIB Hyderabad
భారతదేశంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర మంత్రి వర్గం భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు / విభాగాలలో ఎంపవర్డ్ గ్రూప్ ఆఫ్ సెక్రటరీలు (ఈ.జి.ఓ.ఎస్) మరియు ప్రాజెక్టు డెవలప్ మెంట్ సెల్స్ (పి.డి.సి)లను ఏర్పాటు చేయడానికి అనుమతి ఇచ్చింది. ఈ కొత్త విధానం 2024-25 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలనే భారతదేశ దృష్టిని బలోపేతం చేస్తుంది.
దేశీయ పెట్టుబడిదారులతో పాటు ఎఫ్.డి.ఐ.లను గట్టిగా సమర్థించే పెట్టుబడి స్నేహపూర్వక పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిశ్చయించుకోవటంతో పాటు ఆర్థిక వ్యవస్థను అనేక రెట్లు పెంచుతుంది. డి.పి.ఐ.ఐ.టి. ఒక సమగ్ర విధానం యొక్క వ్యూహాత్మక అమలును ప్రతిపాదిస్తుంది. ఇది చివరికి మంత్రిత్వ శాఖలు / విభాగాలు మరియు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్ పెట్టుబడి సంబంధితం ప్రోత్సాహక విధానాల్లో సమన్వయం తీసుకొస్తుంది.
ప్రస్తుతం కోవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో, భారతదేశానికి దేశంలోకి ఎఫ్.డి.ఐ.ల అధిక స్థాయిలో ఆకర్షించే అవకాశం ఉంది. ప్రత్యేకించి పెద్ద కంపెనీల నుంచి తమ పెట్టుబడులను కొత్త భౌకోళికంగా విస్తరించడానికి మరియు నష్టాలను తగ్గించే ప్రయత్నం చేస్తుంది. అలాగే ఉత్పత్తి శ్రేణల్లో ఉత్పత్తిని పెంచడం అమెరికా, ఈ.యు, చైనా మరియు ఇతర ప్రాంతాల్లో పెద్ద మార్కెట్లకు సేవ చేయడానికి సహాయపడుతుంది. ప్రపంచ విలువల గొలుసులో అతి పెద్ద దేశంగా నిలిచేందుకు ప్రపంచ ఆర్థిక స్థితి నుంచి ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలనే తలంపుతో ఈ ప్రతిపాదనను లక్ష్యంగా పెట్టుకుంది.
భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి, ఆర్థిక వ్యవస్థ యొక్క ముఖ్య రంగాల్లో వృద్ధిని పెంచడానికి, పెట్టుబడిదారులకు మద్ధతు మరియు సదుపాయాన్ని అందించడానికి, ఈ క్రింది కూర్పు మరియు లక్ష్యాలతో ఎంపవర్డ్ గ్రూప్ ఆఫ్ సెక్రటరీస్ (ఈ.జి.ఓ.ఎస్) ఆమోదించబడింది.
· క్యాబినెట్ కార్యదర్శి (చైర్ పర్సన్)
· సి.ఈ.ఓ, నీతిఆయోగ్ (సభ్యుడు)
· కార్యదర్శి, పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్యం యొక్క ప్రమోషన్ విభాగం (సభ్యుడు కన్వీనర్)
· కార్యదర్శి, వాణిజ్య విభాగం (సభ్యుడు)
· కార్యదర్శి, రెవెన్యూ శాఖ (సభ్యుడు)
· కార్యదర్శి, ఆర్థిక వ్యవహారాల విభాగం (సభ్యుడు)
· సంబంధిత శాఖ కార్యదర్శి (సహకారం)
ఈ.జి.ఓ.ఎస్. లక్ష్యాలు..
· సమన్వయం తీసుకురావడం మరియు వివిధ విభాగాలు మరియు మంత్రిత్వ శాఖల నుంచి సకాలంలో అనుమతులు పొందడం.
· భారతదేశంలోకి పెరిగిన పెట్టుబడులను ఆకర్షించడం మరియు ప్రపంచ పెట్టుబడిదారులకు పెట్టుబడి మద్దతు మరియు సదుపాయాన్ని కల్పించటం.
· భారీ పెట్టుబడిదారుల పెట్టుబడులను లక్ష్యంగా పెట్టుకోవడం, మొత్త పెట్టుబడి వాతారవణంలో విధాన స్థిరత్వం మరియు స్థిరత్వాన్ని పొందడం.
· (i) ప్రాజెక్ట్ సృష్టి (ii) వాస్తవ పెట్టుబడుల ఆధారంగా వారి విభాగాలు ముందు పెట్టిన పెట్టుబడులను అంచనా వేయడం. అంతే కాకుండా, ఈ విభాగాలకు సాధికారిత సమూహం వివిధ దశలను పూర్తి చేయడానికి లక్ష్యాలను అందిస్తుంది.
కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయంతో పెట్టుబడి పెట్టలేని ప్రాజెక్టుల అభివృద్ధికి ప్రాజెక్టు డెవలప్ మెంట్ సెల్ (పి.డి.సి) ఆమోదించబడింది. తద్వారా భారతదేశంలో ఇన్వెస్టిబుల్ ప్రాజెక్టుల ధార పెరుగుతుంది. తద్వారా ఎఫ్.డి.ఐ.ల ప్రవాహం పెరుగుతుంది. కార్యదర్శి యొక్క మార్గదర్శకత్వంలో ప్రతి సంబంధిత సెంట్రల్ లైన్ మంత్రిత్వ శాఖ యొక్క జాయింట్ సెక్రటరీ హోదాలో లేని ఒక అధికారి, పి.డి.సి.కి బాధ్యత వహిస్తారు. పెట్టుబడి పెట్టగల ప్రాజెక్టులకు సంబంధించి వివరాలను సంభావితం చేయడం, వ్యూహరచన చేయడం, అమలు చేయడం మరియు వ్యాప్తి చేయడం వంటివి నిర్వహించడం జరుగుతుంది.
పి.డి.సి. కింది లక్ష్యాలను కలిగి ఉంటుంది :
· అన్ని ఆమోదాలతో, కేటాయింపులకు అందుబాటులో ఉన్న భూమిని మరియు పెట్టుబడి దారుల దత్తత / పెట్టుబడి కోసం పూర్తి వివరణాత్మక ప్రాజెక్టు నివేదికలతో ప్రాజెక్టులను రూపొందించటం కోసం.
· పెట్టుబడులను ఆకర్షించేందుకు మరియు ఖరాలు చేసేందుకు పరిష్కరించాల్సిన సమస్యలను గుర్తించటం మరియు వీటిని సాధికారత సమూహం ముందు ఉంచటం.
ఈ నిర్ణయం భారతదేశాన్ని మరింత మంది పెట్టుబడిదారులకు అనుకూలమైన గమ్యస్థానంగా మారుస్తుంది. అదే విధంగా దేశంలోకి పెట్టుబడుల ప్రవాహాన్ని మరింత ఉన్నతంగా మరియు గౌరవప్రదంగా చేయడం ద్వారా గౌరవ ప్రధాని భవిష్యత్ దర్శనానికి అనుగుణంగా ఆత్మనిర్భర్ భారత్ మిషన్ కు ఊతమిస్తుంది. ఇది ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వటంతో పాటు వివిధ రంగాల్లో అపారమైన ప్రత్యక్ష మరియు పరోక్ష ఉపాధి అవకాశాలను నిలబెడుతుంది.
***
(Release ID: 1629168)
Visitor Counter : 485
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam